6 వ తరగతి

By | August 2, 2020

6th  Geography

  • రక రకాల కొత్త రాతి పనిముట్లతో వ్యాసాయం చేసిన కాలాన్ని నవీన శిలాయుగం లేదా కొత్త రాతియుగం అంటారు. స్టిరజీవనం ఏర్పాటు చేసుకోవడం, రాతితో, కొయ్యతో లేదా మట్టితో ఇళ్లను నిర్మించుకోవడం, పాలు నీరు, ధాన్యం నిల్వ చేయడానికి వండటానికి పాత్రలు అవసరమయ్యాయ. ఇది వివిధ రకాల కుండల తయారీకి దారి తీసింది. ఇవన్నీ నవీన శిలాయుగం లో సంభవించిన విప్లవత్మక మార్పులు.
  • పచ్చిమ కనుమలలోని మహాబలేశ్వరం వద్ద కృష్ట్న నది పుట్టింది.
  • నదులు నిక్షిప్తం చేసిన నేలలను ఒండలి లేదా ఒండ్రు భూమి అంటారు. ఈ భూములు సారవంతం గా ఉండి ఎక్కువ నీటిని పట్టి ఉంచగలుగుతాయి. వీటిలో అధిక పోషక పదార్ధాలు ఉంటాయి.
  • నల్లరేగడి భూములు వర్షా కాలములో ఎంతో జిగురుగా ఉండి చాలా కాలం వరకు తేమను పోగొట్టు కోకుండా ఉంటాయి. ఇవి ఆవిరి పోతున్నపుడు భూమి ఉపరితలం మీద పగుళ్లు ఏర్పడతాయి. ఈ పగుళ్లు వల్ల భూ ఉపరితలం పైనున్న మట్టి రాతి పగుళ్లలో చేరుతుంది. దీన్నే సెల్ఫ్ ప్లవింగ్ (స్వయంగా మట్టి మార్పిడి) అంటాము.
  • వర్షా కాల ప్రారంభం అంటే జూన్, జూలై మాసాలలో వరినారు పోస్తారు. తరువాత దానిని పొలాలలో నాటుతారు. దీన్ని సాల్వ అంటారు.
  • డిసెంబర్ నెలలో వేసే వరి పంటను శీతకాలపు పంట లేదా దాళ్వా అంటారు.
  • మెట్ట భూమి లేదా గరుగు ( ఇసక కలిసిన ) భూమి కూరగాయల సాగుకు ఎంతో అనువైనది.
  • వేసవి కాలం లో కొంతమంది వ్యవసాయదారులు వాళ్ళభూములలో జీలుగ, పిల్లిపెసర లాంటివి వేస్తారు. ఈ పంటలవల్ల భూమిలో నత్రజని శాతం పెరుగుతుంది. ఇవి వేసిన 30-40 రోజుల తరువాత ఈ మొక్కలను భూమిలో కలిపి దున్నుతారు. ఇది పంటలకు ఎరుపుగా ఉపయోగపడుతుంది.
  • నది సమీప భూములలో ఎక్కువ భాగం ఇసుకతో కూడిన మట్టి ఉంటుంది. ఈ భూములకు తెమను నిలుపుకునే సామర్ధ్యం తక్కువగా ఉంటుంది. అందువల్ల ఈ భూములలో వరి లాంటి పంటలను పండిస్తారు. ఈ భూములలో పండ్ల మొక్కల వేర్లు ఇసుక పొరలను చీల్చుకొని బాగా లోతుకు వెళ్ళి అక్కడి నీటిని తీసుకొని బాగా పెరుగుతాయి. అందువల్ల నదీ సమీప భూములలో పండ్ల మొక్కలు బాగా పెరుగుతాయి.
  • ఎర్ర రంగు నేలలు తక్కువ సారవంతమైన, తక్కువ తెమను మాత్రమే వ్యాపించడానికి అనుకూలంగా ఉండవు. అందువలన సేద్యం చేయకుండానే భూమిని వదిలేస్తారు. క్రమం గా అటువంటి నేలలు క్షీణించి పంటను పండించడానికి వీలుకాని బీడు నేలలు గా మారుతున్నాయి. బీడు నేలల్లో ఎక్కువగా సున్నం, క్షారాలవణాలు ఉంటాయి. తేమను పీల్చుకోలేవు కాబట్టి ఆ నేలలు అన్ని రకాల పంటలు పండించడానికి పనికి రావు.
  • పురుగులు, క్రిములను నియంత్రించడానికి సేంద్రీయపదార్ధాలైన వేప ద్రావణం ను ఉపయోగిస్తారు.
  • అడవిలో కొంత ప్రాంతం లో చెట్లను నరికి మిగిలిన వాటిని కాల్చి చదును చేస్తారు. ఆ ప్రాంతంలో కొన్ని సంవత్సరాలు సాగు చేస్తారు. తరువాత నిస్సారమైన ఆ ప్రాంతాన్ని విడచి మరొక ప్రాంతానికి వెళ్ళి అక్కడ చెట్లను నరికి మళ్ళీ కొన్ని సంవత్సరాలు వ్యాసాయం చేస్తారు. ఇటువంటి విధానాన్ని పోడువ్యాసాయం లేదా జామ్ విధానం అని అంటారు.
  • రైతు బజారులో ఉత్పత్తుల ధర నిర్ణయించడానికి కమిటీ ఉంటుంది. ఇందులో ముగ్గురు రైతులు, ఉద్యోగులు సభ్యులుగా ఉంటారు. టోకు ధరలకంటే 25% ఎక్కువగాను, చిల్లర ధరలకు 25% తక్కువగాను ధర నిర్ణయిస్తారు.