ysr matsyakarabarosa apply online|| ysr matsyakarabarosa eligibility rules || ysr matsyakarabarosa eligibility status.
సముద్రంపై మరపడవలు మరియు తెప్పలపై చేపలు పట్టే మత్స్య కారుల జీవన ప్రమాణాలను పెంచుటకు వైయస్ ఆర్ మత్స్య కార భరోసా ద్వారా సంవత్సరానికి రూ. 10000/- ఆర్హిక సహాయం.
అప్లికేషన్ ఫారం
వై యస్ ఆర్ మత్స్య కార భరోసా అర్హతలు
- మొత్తం కుటుంబం ఆదాయం గ్రామీణ ప్రాంతాలలో నెలకు రూ. 10000/- మరియు పట్టణ ప్రాంతాలలో ఐతే రూ. 12000/- కంటే తక్కువ ఉండాలి.
- మొత్తం కుటుంబానికి 3 ఎకరాలు మాగాణి భూమి లేదా 10 ఎకరాలు మెట్ట లేదా మాగాణి మరియు మెట్ట భూములు రెండు కలిపి 10 ఎకరాలు మించరాదు.
- కుటుంబంలో ఏ ఒక్కరూ ప్రభుత్వ ఉద్యోగి లేదా పింఛనుదారుడై ఉండరాదు.
- కుటుంబం నివశిస్తున్న గృహం ( సొంతం/ అద్దే ) యొక్క నెలవారి విద్యుత్ వినియోగ బిల్ యొక్క సగటు 300 యూనిట్లు లోపు ఉండవలెను. ( గత 6 నెలల విద్యుత్ వినియోగ బిల్ యొక్క సగటు 300 యూనిట్లు లేదా అంతకు తక్కువ ఉండవలెను. )
- పట్టణ ప్రాంతాలలో సొంత గృహ నిర్మానపు స్థలము 1000 చదరపు అడుగులకంటే తక్కువ ఉండాలి
- కుటుంబాలో ఏ ఒక్కరూ ఆదాయపు పన్ను చెల్లించే పరిధిలో ఉండరాదు .
- ఆధార్ కార్డు కలిగి ఉండాలి.
- బియ్యం కార్డు / రేషన్ కార్డు కలిగి ఉండాలి 9 ఒక కుటుంబం ఒక లబ్ధి ప్రతిపదిక )
- 21 నుండి 60 సంవత్సరాలలోపు వయస్సు కలిగి , మత్స్య శాఖ నందు రిజిస్టర్ అయిఉన్న మరపడవలు మరియు తెప్పల పై సముద్రంలో చేపలు పట్టే మత్స్యకారులు అర్హులు.
- మత్స్య శాఖ ద్వారా రిజిస్ట్రేషన్ పొందిన ప్రతి మర మరియు యాంత్రిక పడవలు డీజిల్ సబ్సిడీ పధకం కు అర్హత కలిగి ఉంటాయి .
జాబితాలో పేరు లేనివారు దరఖాస్తు చేసుకునే విధానము
- అర్హత కలిగిన వారు బియ్యం కార్డు / రేషన్ కార్డు , ఆధర్ కార్డు , వారు వేట చేస్తున్నటువంటి పడవ / తెప్ప వివరాలతోపాటు స్వయంగా గ్రామ/వార్డు సచివాలయాలలో గాని లేదా గ్రామ వార్డు వాలంటీర్ల ద్వారా గాని ధరఖాస్తు చేసుకోవచ్చు
- అర్హులైన ధరఖాస్తు దారునికి YSR ( Your Service Request – మీ సేవల అభ్యర్ధన ) నెంబరు ఇవ్వబడుతుంది
- ధరఖాస్తు చేసిన లబ్ధి దారులకు నిర్ధేశించిన ప్రక్రియలు అన్నీ పూర్తి చేసి అర్హత కలిగిన వారికి సంవత్సరానికి రూ. 10000/- ఒకసారి మంజూరు చేసే వై యస్ ఆర్ మత్స్య కార భరోసా పధకం ద్వారా లబ్ధి చేకూర్చ బడుతుంది.
CLICK HERE FOR MORE GOVERNMENT SCHEMES
INSTANT AP GOVT UPDATES
మా వాట్సాప్ ఛానెల్లో జాయిన్ అవ్వండి
AP ప్రభుత్వ పథకాలు, GSWS ఫారమ్‌లు & జాబ్ అప్డేట్స్ నోటిఫికేషన్లు పొందండి!
Join WhatsApp Channel