Ration card new rules in AP
ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం బియ్యం కార్డు కి సంబందించి నూతన మార్గదర్శాలు . సహాయం కొరకు టోల్ ఫ్రీ నెంబర్ 1902/ 18004250082. లేదా గ్రామ వార్డ్ సచివాలయాలకు వెళ్ళండి .
1️⃣ కొత్త రైస్ కార్డు
కొత్త రైస్ కార్డు కి సంబంధించి దరఖాస్తు దారులు ఏ కార్డులో లేనట్లయితే వారికి అప్లై చేయవచ్చు …..కుటుంబం లో అబ్బాయి కి వివాహం జరిగి కొత్త కార్డు కావాలంటే ముందుగా తన భార్యను అబ్బాయి కుటుంబ కార్డు లో యాడ్ చేయాలి …..తర్వాత వారిని స్ప్లిట్ చేయాలి…..స్ప్లిట్ చేశాక కొత్త కార్డు కి అప్లై చేయవలసి వస్తుంది …..
2️⃣ కార్డు లో సభ్యులను చేర్చూట
కార్డు లో సభ్యులను చెర్చుట కేవలం చిన్న పిల్లలు మరియు వివాహం జరిగిన స్త్రీల ను మాత్రమే కార్డు లో చేర్చగలము…. చిన్న పిల్లని చేర్చుటకు కచ్చితంగా వారి బర్త్ సర్టిఫికేట్ మరియు ఆధార్ కార్డు కావలెను …..వివాహం అయిన స్త్రీ కి ఆమె ఆధార్ కార్డు,ఆమె తల్లి తండ్రుల రైస్ కార్డు నంబర్ మరియు వివాహం చేసుకున్న వారి కుటుంబం రైస్ కార్డు కావలెను…..వీరిని వారి అమ్మ వాళ్ళ కార్డు నుండి డైరెక్ట్ గా యాడ్ మెంబర్ సర్వీస్ ద్వారా ట్రాన్స్ఫర్ చేయవచ్చు…..
3️⃣ కార్డు నుండి తొలగింపు
రైస్ కార్డు నుండి తొలగింపు కేవలం చనిపోయిన వారికి మాత్రమే….. ఎవరైనా రైస్ కార్డు లో ఉన్న సభ్యులు చనిపోయిన ట్లైతే వారికి మాత్రమే డిలీట్ మెంబర్ సర్వీస్ వర్తిస్తుంది……
4️⃣ స్ప్లిట్టింగ్
స్ప్లిట్ చేయాలంటే ముందు ఆ సభ్యులు ఒకటే రైస్ కార్డు నందు ఉండవలెను….అప్పుడు మాత్రమే స్ప్లిట్ చేయడం సాధ్య మవుతుంది….
అలాగే స్ప్లిట్ అవ్వాల్సిన సభ్యులు కచ్చితంగా e-kyc చేయించు కోవాలి లేదంటే స్ప్లిట్ సాధ్యం కాదు…… కుటుంబం లో తల్లి తండ్రుల లలో ఒకరు మాత్రమే ఉన్నట్లైతే అంటే తల్లి ఉండి తండ్రి లేకపోవడం లేదా తండ్రి ఉండి తల్లి లేనట్లయితే స్ప్లిట్ అవ్వడం వీలు కాదు…..అందరూ ఆ రైస్ కార్డు నందు ఉండవలసిందే…..
1 Comment
Comments are closed.