బియ్యం కార్డు

By | July 12, 2020

బియ్యం కార్డు  New Rice Cards in AP

ప్రజా పంపిణీ వ్యవస్తలో పారదర్శకత – ఇంటివద్దకే నాణ్యతతో కూడిన నిత్యవసర సరుకులు అందజేత

అర్హతలు

  • కుటుంబ నెలసరి ఆదాయము:

                   గ్రామీణప్రాంతాలలోరూ. 10000/- లోపు

                  పట్టంప్రాంతాలలో రూ. 12000/- లోపు ఉన్నవారు అర్హులు.

  • మొత్తం కుటుంబానికి 3 ఎకరాల మాగాణి భూమి లేదా 10 ఎకరాల మెట్ట లేదా మాగాణి మరియు మెట్ట భూములు రెండు కలిపి 10 ఎకరాలు మించరాదు.
  • కుటుంబం నివసిస్తున్న గృహం ( సొంత / అద్దె ) యొక్క నెలవారీ విధ్యుత్ వినియోగ బిల్ 300 యూనిట్ల లోపు ఉండవలెను. ( గత ఆరు నెలల విధ్యుత్ వినియోగ బిల్ యొక్క సగటు 300 యూనిట్లు లేదా అంతకు తక్కువ ఉండవలెను.)
  • పట్టణ ప్రాంతాలలో నిర్మాణపు స్తలము 1000 చదరపు అడుగులకంటే తక్కువ ఉండాలి.
  • కుటుంబ సభ్యులలో ఏ ఒక్కరికైన 4 వీలర్ ( నాలుగు చక్రములు ) సొంత వాహనము ఉన్నట్లైతే ( ఆటో, టాక్షీ మరియు ట్రాక్టర్ ఇందుకు మినహాయింపు) అనర్హులుగా పరిగణించవలెను.
  • కుటుంబంలో ఏ ఒక్కరు ప్రభుత్వ ఉద్యోగి లేదా పింఛను దారుడై ఉండరాదు ( పారిశుధ్య కార్మికులు మినహాయింపు)
  • కుటుంబాలో ఏ ఒక్కరు ఆదాయపు పన్ను చెల్లించే పరిధిలో ఉండరాదు

అర్హులై ఉండి ఇంకనూ బియ్యం కార్డు పొందని వారు ధరఖాస్తు చేసుకునే విధానము

  • అర్హత కలిగిన కుటుంబము తమ కుటుంబ సభ్యుల వివరాలతో ఆధార్ కార్డు నకలు కుటుంబ ఆదాయ వివరాలను జత చేసి నిర్ణీత దరఖాస్తును నేరుగా గ్రామ వార్డు సచివాలయాలలో గానీ లేదా గ్రామ/ వార్డు వాలంటీర్ల ద్వార గానీ ధరఖాస్తు చేసుకోవచ్చు.
  • అర్హులైన ధరఖాస్తు ధారునికి YSR ( Your Service Request మీ సేవల అభ్యర్ధన ) నెంబర్ ఇవ్వబడుతుంది.
  • ధరఖాస్తు చేసిన 10 పని దినములలో  అర్హులైన ధరఖాస్తు ధారునికి బియ్యం కార్డు కేటాయించబడుతుంది.

Also read New Rice cards in AP 

Check your rice card status

One thought on “బియ్యం కార్డు

  1. Pingback: Six Step Validation - Snehajobs.com

Comments are closed.