వై.యస్.ఆర్ పింఛన్ కానుక
- మొత్తం కుటుంబ ఆదాయం గ్రామీణ ప్రాంతాలలో నెలకు రూ. 10,000 మరియు పట్టణ ప్రాంతాలలో అయితే రూ. 12000 కంటే తక్కువ ఉండాలి.
- మొత్తం కుటుంబానికి 3 ఎకరాల మాగాణి భూమి లేదా 10 ఎకరాల మెట్ట లేదా మాగాణి మరియు మెట్ట భూములు రెండు కలిపి 10 ఎకరాలు మించరాదు.
- కుటుంబ సభ్యులలో ఏ ఒక్కరికైన 4 వీలర్ ( నాలుగు చక్రములు ) సొంత వాహనము ఉన్నట్లైతే ( ఆటో, టాక్షీ మరియు ట్రాక్టర్ ఇందుకు మినహాయింపు) అనర్హులుగా పరిగణించవలెను.
- కుటుంబంలో ఏ ఒక్కరు ప్రభుత్వ ఉద్యోగి లేదా పింఛను దారుడై ఉండరాదు ( పారిశుధ్య కార్మికులు మినహాయింపు)
- కుటుంబం నివసిస్తున్న గృహం ( సొంత / అద్దె ) యొక్క నెలవారీ విధ్యుత్ వినియోగ బిల్ 300 యూనిట్ల లోపు ఉండవలెను. ( గత ఆరు నెలల విధ్యుత్ వినియోగ బిల్ యొక్క సగటు 300 యూనిట్లు లేదా అంతకు తక్కువ ఉండవలెను.)
- పట్టణ ప్రాంతాలలో నిర్మాణపు స్తలము 1000 చదరపు అడుగులకంటే తక్కువ ఉండాలి.
- కుటుంబాలో ఏ ఒక్కరు ఆదాయపు పన్ను చెల్లించే పరిధిలో ఉండరాదు.
- సాదారణంగా ఒక కుటుంబానికి ఒక పింఛను ( 40% మరియు ఆ పైన అంగ వైకల్యం కలవారు మరియు ధీర్గకాలిక వ్యాధిగ్రస్తులు మినహా) మాత్రమే.
అర్హతలు
వై యస్ ఆర్ పింఛను కానుక – దరఖాస్తు ఫారం
వై యస్ ఆర్ పింఛను కానుక – ఫీల్డ్ వెరిఫికేషన్ ఫారం
వై యస్ ఆర్ పింఛను కానుక కొత్త ధర్ఖస్తూ ఫారం
ఒంట రి మహిళ ధృవీకరణ కొరకు ధరఖాస్తు
డప్పు కళా కారులస్వీయ ధృవీకరణ పత్రం
డప్పు కళాకారుల గుర్తింపు కార్డు కొరకు ధరఖాస్తు
చర్మకారులస్వీయ ధృవీకరణ పత్రం
డప్పు మరియు చర్మ కళాకారుల చెక్ లిస్ట్
పింఛను కేటగిరి |
నెలవారీ (రూ.లలో) |
అర్హత |
ఇతర అర్హతలు |
వృద్దాప్య పింఛను |
2250 |
60 సం.లు |
యస్.టి లకు 50 సవత్సరాలు |
వితంతు పింఛను |
2250 |
18 సం.లు |
భర్త మరణ ధృవీకరణ ఉండాలి |
వికలాంగులు |
3000 |
— |
40% పై బడి అంగ వైకల్యం ఉండాలి. సదరం ధృవపత్రం ఉండాలి |
చేనేత కార్మిలులు |
2250 |
50 సం.లు |
చేనేత శాఖ వారిచే గుర్తింపు పత్రం ఉండాలి |
కళ్లుగీత కార్మికులు |
2250 |
50 సం.లు |
ఎక్షైజ్ శాఖ వారిచే గుర్తింపు పత్రం ఉండాలి |
మత్స్య కారులు |
2250 |
50 సం.లు |
మత్స్య శాఖ వారిచే గుర్తింపు పత్రం ఉండాలి |
డప్పు కళాకారులు |
3000 |
50 సం.లు |
స్వీయ ధృవీకరణ |
చర్మ కారులు |
2250 |
40 సం.లు |
స్వీయ ధృవీకరణ |
HIV భాదితులు |
2250 |
— |
ART సెంటర్ నందు 6 నెలలు క్రమం ప్పకుండామందులు వాడి ఉండాలి. |
టాన్స్ జెండర్ |
3000 |
18 సం.లు |
ప్రభుత్వ వైద్య ఆరోగ్య శాఖ వారి సర్టిఫికేట్ ఉండాలి |
ఒంటరి మహిళలు భర్త నుండి విడిపోయిన వారు అవివాహితులు గ్రామాలలో పట్టణాలలో |
2250 |
50 సం.లు
50 సం.లు 50 సం.లు |
చట్ట ప్రకారం భర్త నుండి విడిపోయిన వారు, వివాహితులుగా ఉన్నవారు తహాశిల్ధర్ నుండి దృవీకరన్ పొంది ఉండవలెను. |
CKDU మరియు ధీర్ఘకాలిక |
2250 |
బహుల వైకల్యం కలిగిన కుస్టువ్యాధి గ్రస్టులు |
|
5000
|
భోధ వ్యాధి గ్రేడ్ -4, పక్షవాతం, కండరాల బలహీనత, ప్రమాద భాధితులు ( చక్రాల కుర్చీ లేదా మంచానికి పరిమితమైన వారు), 3,4,5 స్టేజీలలో ఉన్న మూత్ర పిండాల వ్యాధి గ్రస్తులు, బహుల వైకల్యం కలిగిన కుస్టువ్యాధి గ్రస్టులు మరియు వై యస్ ఆర్ ఆరోగ్య శ్రీ ద్వారా కిడ్నీ, కాలేయం లేదా గుండె మార్పిడి చేసుకున్న వ్యాధి గ్రస్తులు. |
||
10000
|
CKDU – డయాలసిస్ తలసేమియా, సికిల్ సెల్ అనీమియా, తీవ్ర హిమోఫీలియా (2% of factor 8,9) |