బియ్యం కార్డు New Rice Cards in AP
ప్రజా పంపిణీ వ్యవస్తలో పారదర్శకత – ఇంటివద్దకే నాణ్యతతో కూడిన నిత్యవసర సరుకులు అందజేత
అర్హతలు
- కుటుంబ నెలసరి ఆదాయము:
గ్రామీణప్రాంతాలలోరూ. 10000/- లోపు
పట్టంప్రాంతాలలో రూ. 12000/- లోపు ఉన్నవారు అర్హులు.
- మొత్తం కుటుంబానికి 3 ఎకరాల మాగాణి భూమి లేదా 10 ఎకరాల మెట్ట లేదా మాగాణి మరియు మెట్ట భూములు రెండు కలిపి 10 ఎకరాలు మించరాదు.
- కుటుంబం నివసిస్తున్న గృహం ( సొంత / అద్దె ) యొక్క నెలవారీ విధ్యుత్ వినియోగ బిల్ 300 యూనిట్ల లోపు ఉండవలెను. ( గత ఆరు నెలల విధ్యుత్ వినియోగ బిల్ యొక్క సగటు 300 యూనిట్లు లేదా అంతకు తక్కువ ఉండవలెను.)
- పట్టణ ప్రాంతాలలో నిర్మాణపు స్తలము 1000 చదరపు అడుగులకంటే తక్కువ ఉండాలి.
- కుటుంబ సభ్యులలో ఏ ఒక్కరికైన 4 వీలర్ ( నాలుగు చక్రములు ) సొంత వాహనము ఉన్నట్లైతే ( ఆటో, టాక్షీ మరియు ట్రాక్టర్ ఇందుకు మినహాయింపు) అనర్హులుగా పరిగణించవలెను.
- కుటుంబంలో ఏ ఒక్కరు ప్రభుత్వ ఉద్యోగి లేదా పింఛను దారుడై ఉండరాదు ( పారిశుధ్య కార్మికులు మినహాయింపు)
- కుటుంబాలో ఏ ఒక్కరు ఆదాయపు పన్ను చెల్లించే పరిధిలో ఉండరాదు
అర్హులై ఉండి ఇంకనూ బియ్యం కార్డు పొందని వారు ధరఖాస్తు చేసుకునే విధానము
- అర్హత కలిగిన కుటుంబము తమ కుటుంబ సభ్యుల వివరాలతో ఆధార్ కార్డు నకలు కుటుంబ ఆదాయ వివరాలను జత చేసి నిర్ణీత దరఖాస్తును నేరుగా గ్రామ వార్డు సచివాలయాలలో గానీ లేదా గ్రామ/ వార్డు వాలంటీర్ల ద్వార గానీ ధరఖాస్తు చేసుకోవచ్చు.
- అర్హులైన ధరఖాస్తు ధారునికి YSR ( Your Service Request మీ సేవల అభ్యర్ధన ) నెంబర్ ఇవ్వబడుతుంది.
- ధరఖాస్తు చేసిన 10 పని దినములలో అర్హులైన ధరఖాస్తు ధారునికి బియ్యం కార్డు కేటాయించబడుతుంది.
Also read New Rice cards in AP
Check your rice card status
INSTANT AP GOVT UPDATES
మా వాట్సాప్ ఛానెల్లో జాయిన్ అవ్వండి
AP ప్రభుత్వ పథకాలు, GSWS ఫారమ్‌లు & జాబ్ అప్డేట్స్ నోటిఫికేషన్లు పొందండి!
Join WhatsApp Channel