సత్య డిగ్రీ మరియు పి. జి. కళాశాలలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు

By | August 15, 2020

సత్య డిగ్రీ మరియు పి. జి. కళాశాలలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు

74th Independence Day Celebrations at Sathya Degree And PG College.

విజయనగరం తేదీ(15/08/2020)నాడు స్థానిక తోటపాలెం సత్య డిగ్రీ మరియు పి. జి. కళాశాలలో, సత్య విద్యాసంస్థల”చైర్మన్”రాష్ట్ర మున్సిపల్ మరియు పట్టణ అభివృద్ధి శాఖ మాత్యులు” గౌరవనీయులు”శ్రీ”బొత్స సత్యనారాయణ గారు,”కరస్పాండెంట్,&సెక్రెటరీ,విజయనగరం మాజీ పార్లమెంట్ సభ్యులు గౌరవనీయులు”శ్రీ”డాక్టర్”బొత్స ఝాన్సీ లక్ష్మి గారు,సత్య విద్యాసంస్థల డైరెక్టర్ గౌరవనీయులు”శ్రీ”డాక్టర్ మజ్జి శశిభూషన్ రావు గారి,ఆదేశాల మేరకు,సత్య కళాశాల ప్రిన్సిపల్ “శ్రీ”డా”సాయి దేవ మణి గారి అధ్యక్షతన, రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ ఉపాధ్యక్షులు గౌరవనీయులు”శ్రీ”డాక్టర్ కేసలి అప్పారావు గారు,ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసి వారి చేతులమీదుగా జెండా వందనం కార్యక్రమం జరిపి,ఈరోజు స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ బృహత్తరమైన కార్యక్రమంలో covid 19,కరోనాతో నిరంతరం పోరాటం చేస్తున్నా,”డాక్టర్”శ్రీ వినోద్ కుమార్ లాల్వని గారు, (మహారాజా హాస్పిటల్)డి. రాధిక గారు(వన్ టౌన్ పోలీస్ స్టేషన్) శ్రీ “మంగ గారు,( స్టాఫ్ నర్స్) జె.కృపా గారు,(స్టాఫ్ నర్స్)పి. పైడిరాజు (శానిటేషన్ వర్కర్)గారికి,సత్య విద్యాసంస్థల యాజమాన్యం వారు, ఈ కరోనా సమయంలో వారి యొక్క వీరోచితమైన సేవలను గుర్తించి,ఇటువంటి సేవలు జిల్లా ప్రజలకు అందించినందుకు గాను కళాశాల ప్రాంగణంలో వారిని సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సీతం కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్”శ్రీ”రామమూర్తి గారు, ఎన్.సి.సి ఆఫీసర్స్ సూరపు నాయుడు గారు, కళ్యాణ్ గారు, సత్య వేణి గారు, కళాశాల టీచింగ్ & నాన్-టీచింగ్ సిబ్బంది మరియు ఎన్.సి.సి విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది.