డా.  వై.యస్.ఆర్ ఆరోగ్యశ్రీ కార్డు

By | November 30, 2022

డా.  వై.యస్.ఆర్ ఆరోగ్యశ్రీ కార్డు

జనం ఆరోగ్యమే  – జగనన్న ఆశయం

పేదలందరికి నాణ్యమైన వైద్యం అందించటమే లక్ష్యం

కొత్త ఆరోగ్య శ్రీ కార్డ్ కొరకు ధరఖాస్తు ఫారం
హెల్త్ కార్డ్ నందు సభ్యుల నమోదు కొరకు ధరఖాస్తు
హెల్త్ కార్డ్ నందు సభ్యుల తొలగించుట కొరకు ధరఖాస్తు
హెల్త్ కార్డ్ నందు మార్పుల కొరకు ధరఖాస్తు

అర్హతలు

  • బియ్యం కార్డు, పింఛను కార్డు , జగనన్న విద్యా దీవెన మరియు జగనన్న వసతి దీవెన పధకాలకు అర్హులైన వారు ఈ పధకానికి అర్హులు.
  • మాగాణి భూమి 12 ఎకరాలు లేదా మెట్ట/మెరక భూమి 35 ఎకరాలు లేదా మెట్ట మరియు మాగాణి కలిపి 35 ఏకరాలలోపు కలిగినవారు అర్హులు.
  • 5 లక్షలు లేదా అంతకు తక్కువ కుటుంబ వార్షిక ఆదాయము కలిగిన వారు అర్హులు.
  • 5 లక్ష్లల లోపు ఆదాయపుపన్ను చెల్లింపులను చేస్తున్న కుటుంబాలు అర్హులు.
  • శాశ్వత ప్రభుత్వ ఉద్యోగి / పింఛను దారు మినహాయించి మరే ఇతర ఉద్యోగి ప్రభుత్వం లోగాని లేదా ప్రవేట్ గా కానీ కాంట్రాక్ట్ , ఒప్పంద ఉద్యోగులు , పార్ట్ టైమ్ ఉద్యోగులు , శానిటరీ వర్కర్లు , గౌరవవేతనం ఆదారంగా పనిచేసే ఉద్యోగులు ఎవరైనా 5 లక్షల లోపు వార్షిక ఆదాయం కలిగిఉన్న వారు అర్హులు.
  • 3000 చదరపు అడుగులు (334Yds) స్థలంలోపు వైశాల్యానికి మునిసిపల్ ఆస్తి పన్ను చెల్లింపుదారులు ఈ పధకానికి అర్హులు
  • ఒక కుటుంబానికి / గృహానికి ఒక వ్యక్తిగత కారును మించి ఉండరాదు.

జాబితాలో పేరు లేని వారు ధరఖాస్తు చేసుకునే విధానము

  • అర్హత కలిగిన వారు కుటుంబ సభ్యులందరి ఆధర్ కార్డు, ఆస్తి పన్ను రుజువు, పట్టాదార్ పాస్ పుస్తకం నకలు, స్వీయ మరియు కుటుంబ సభ్యుల జీతం సర్టిఫికటే ( ఏదైనా ఉంటే ) వాహనాలు మరియు ఆస్తి వివరాలు, కుటుంబం యొక్క ఫోటో తోపాటు గ్రామ వార్డు సచివాలయాలలో గానీ లేదా గ్రామ/ వార్డు వాలంటీర్ల ద్వార గానీ ధరఖాస్తు చేసుకోవచ్చు.
  • అర్హులైన ధరఖాస్తు ధారునికి YSR ( Your Service Request మీ సేవల అభ్యర్ధన ) నెంబర్ ఇవ్వబడుతుంది.
  • ధరఖాస్తు చేసిన 20 పని దినములలో అర్హులైన ధరఖాస్తు ధారునికి  డా.  వై యస్ ఆర్ ఆరోగ్యశ్రీ కార్డు వాలంటీర్ల ద్వారా ఇవ్వబడుతుంది.