వై.యస్. ఆర్ చేయూత

By | December 1, 2022

వై.యస్. ఆర్ చేయూత

వై.యస్. ఆర్ చేయూత Latest Update

వై.యస్. ఆర్  పెన్షన్ కానుక కింద ఇప్పటికే లబ్ధి పొందుతున్న బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలకు చెందిన 45 నుంచి 60 ఏళ్ల వితంతువులు, వికలాంగులు, ఒంటరి మహిళలకు కూడా వై.యస్. ఆర్ చేయూత పధకాన్ని వర్తింపజేయాలని మంత్రి వర్గం నిర్ణయం తీసుకుంది.

అప్లికేషన్ ఫారం 
చేయూత సిక్స్ స్టెప్ అప్లికేషన్ ఫారం 

అర్హతలు

  • మొత్తం కుటుంబ ఆదాయం గ్రామీణ ప్రాంతాలలో నెలకు రూ. 10,000 మరియు పట్టణ ప్రాంతాలలో అయితే రూ. 12000 తక్కువ ఉండాలి.
  • మొత్తం కుటుంబానికి 3 ఎకరాల మాగాణి భూమి లేదా 10 ఎకరాల మెట్ట లేదా మాగాణి మరియు మెట్ట భూములు రెండు కలిపి 10 ఎకరాలు మించరాదు.
  • కుటుంబంలో ఏ ఒక్కరు ప్రభుత్వ ఉద్యోగి లేదా పింఛను దారుడై ఉండరాదు ( పారిశుధ్య కార్మికులు మినహాయింపు)
  • కుటుంబం నివసిస్తున్న గృహం ( సొంత / అద్దె ) యొక్క నెలవారీ విధ్యుత్ వినియోగ బిల్ 300 యూనిట్ల లోపు ఉండవలెను. ( గత ఆరు నెలల విధ్యుత్ వినియోగ బిల్ యొక్క సగటు 300 యూనిట్లు లేదా అంతకు తక్కువ ఉండవలెను.)
  • పట్టణ ప్రాంతాలలో నిర్మాణపు స్తలము 1000 చదరపు అడుగులకంటే తక్కువ ఉండాలి.
  • కుటుంబ సభ్యులలో ఏ ఒక్కరికైన 4 వీలర్ ( నాలుగు చక్రములు ) సొంత వాహనము ఉన్నట్లైతే ( ఆటో, టాక్షీ మరియు ట్రాక్టర్ ఇందుకు మినహాయింపు) అనర్హులుగా పరిగణించవలెను.
  • కుటుంబాలో ఏ ఒక్కరు ఆదాయపు పన్ను చెల్లించే పరిధిలో ఉండరాదు
  • ఆధార్ కార్డు కలిగి ఉండాలి.
  • ప్రభుత్వం జారీ చేసిన సమగ్ర కూయ దృవీకరణ పత్రం ( SC, ST, BC, Minority ) కలిగి ఉండవలెను.

ధరఖాస్తు చేసుకునే విధానము

అర్హత కలిగిన వారు కూయ దృవీకరణ పత్రం మరియు ప్రభుత్వ గుర్తింపు కార్డుతో పాటు స్వయంగా గామ/ వార్డు సచివాలయాలలో గానీ లేదా గ్రామ / వార్డు వాలంటీర్ల ద్వారగానీ ధరఖాస్తు చేసుకోవచ్చు.

అర్హులైన ధరఖాస్తు ధారునికి YSR ( Your Service Request మీ సేవల అభ్యర్ధన ) నెంబర్ ఇవ్వబడుతుంది.

ధరఖాస్తు చేసిన లబ్ధి దారులకు నిర్దేశించిన ప్రక్రియలు అన్నే పూర్తి చేసి అర్హత కలిగిన వారికి రూ. 18750/- ప్రభుత్వముచే అందించ బడుతుంది.

Click Here For Official Site

For More Details 

For PDF 2020PR_MS636

YSR Cheyutha Time Lines