SnehaJobs.com

విద్య, ఉద్యోగ సమాచారం & ప్రభుత్వ పథకాలు — అన్నీ ఒకే చోట

7 వ తరగతి

7th Class General Science

  • మలబద్దకం నివారించడానికి పీచు పదార్దాలు ఉన్న ఆహారం తీసుకోవాలి.
  • 1752లో ‘ జేమ్స్ లిండ్స్ ‘ అనే శాస్త్రవేత్త ‘స్కర్వీ ‘ అనే వ్యాధిని తాజా ఫలాలను , కూరగాయలను తినటం వల్ల నయం  చేయవచ్చని కనుగొన్నాడు.
  • నీలి లిట్మస్ ను ఎరుపు రంగులోకి మార్చే పదార్దాలకు ఆమ్ల స్వభావం ఉంటుంది.
  • ఎరుపు లిట్మస్ ను నీలి రంగులోకి మార్చే మృదు స్పర్శ కలిగిన పదార్దాలకు క్షార స్వభావం ఉంటుంది.
  • చీమ కుట్టిన చోట ఫార్మిక్ ఆమ్లన్ని విడుదల చేయడం వల్ల మంటగా, నొప్పిగా అనిపిస్తుంది.
  • మిథైల్ ఆరంజ్ వల్ల ఆమ్లాలు ఎరుపు రంగులోకి, క్షారాలు పసుపు రంగులోకి మారుతాయి.
  • ఫీనాఫ్తలీన్ ఆమ్లాలతో రంగు లేకుండా, క్షారాలతో ఉదా రంగులోకి మారుతుంది.
  • ఆమ్లా వర్షాలలో సల్ఫ్యూరి కామ్లం , కార్భానీకామ్లాలు కలసి ఉంటాయి.
  • హెన్రీకావెండిష్ ఇటాలియన్ శాస్త్రవేత్త , హైడ్రోజన్ వాయువును కనుగొన్నాడు. ఈ వాయువుకు రంగు లేదు.
  • పట్టు పురుగులను ‘బాంబీక్స్ మోరీ ‘ అంటారు.
  • పట్టు పురుగులు అల్లిన దారాలలో రెండు రకాల ప్రోటీన్లు సిరిసిన్, ఫైబ్రోయిన్ ఉంటాయి. వీటి వల్ల పట్టు దారం గట్టిగా ఉంటుంది.
  • పట్టు కాయ నుండి పట్టు దారాన్ని తీయడాన్ని రీలింగ్ అంటారు.
  • మెరినో జాతి గొర్రె నుంచి నాణ్యమైన ఉన్ని లభిస్తుంది.
  • పట్టు కోసం పట్టు పురుగులను పెంచడాన్ని పట్టు వర్ధనం (సిరి కల్చర్ ) అంటారు.
  • ఉన్ని ఉత్పత్తిలో ఆస్ట్రేలియా , చైనా దేశస్థులు అగ్రగణ్యులు.
  • మనం నిత్య జీవితంలో ఉపయోగించే కొన్ని ఆహార పదార్దాలలో సహజంగా కొన్ని ఆమ్లాలు ఉంటాయి వాటిలో
  • కొన్ని అవి : వెనిగర్         ~    ఎసిటిక్ ఆమ్లం
    • ఆలివోయిల్ ~    ఆలివ్ ఆమ్లం
    • నిమ్మ ,నారింజ ~  సిట్రిక్ ఆమ్లం
      • కొవ్వు పడర్దాలు ~  స్టీరిక్ ఆమ్లం
      • వెన్న ~ బ్యూటీరిక్ ఆమ్లం
      • ద్రాక్ష ,చింతపండు ~ టార్టారిక్ ఆమ్లం
      • మజ్జిగ, పెరుగు ~  లాక్టిక్ ఆమ్లం
      • పామాయిల్ ~  పామాటిక్ ఆమ్లం
    • మనం తయారు చేసే పదార్దాలలో కొన్ని రకాల ఆమ్లాలు, క్షారాలు ఉపయోగిస్తుంటాము.
    • ఆమ్లాలు అవి: శీతల పానీయాల  తయారీలో ~     కార్బానిక్  ఆమ్లం
      • సిరా మరకలు తొలగించడానికి ~ ఆగ్జాలిక్ ఆమ్లం
      • మందులు,రంగుల తయారీలో ~    హైడ్రోక్లోరిక్  ఆమ్లం
      • పచ్చళ్ళ తయారీలో ~     ఎసిటిక్  ఆమ్లం
      • పులిహోర తయారీలో ~   సిట్రిక్ ఆమ్లం
    •  క్షారాలు అవి : సబ్బుల తయారీలో                –  పొటాషియం హైడ్రాక్సైడ్ , సోడియం హైడ్రాక్సైడ్
      • బ్లీచింగ్ పౌడర్ తయారీలో –   కాల్షియం హైడ్రాక్సైడ్
      • అగ్నిమాపక పదార్దాల తయారీలో – అల్యూమినియం హైడ్రాక్సైడ్
    • I పద్దతిలో వేగాన్ని ప్రమాణం – మీ /సె.
    • లోహాలలో పాదరసం మాత్రమే గది ఉషోగ్రత వద్ద ద్రవ రూపంలో ఉంటుంది. అందుకే ధర్మా మీటర్ లో ఉషోగ్రతలను సూచించడానికి  పాదరసాన్ని ద్రవం గా ఉపయోగిస్తారు.
    • క్రీ.శ. 1593 లో గెలీలియో మొదటి ధర్మామీటర్ కనుగొన్నాడు.
    • మానవుని శరీర సాధారణ ఉష్ణోగ్రత -370
    • వాతావరణ శాఖవారు ‘రెయిన్ గేజ్ ‘ ను ఉపయోగించి వర్షపాతన్ని కొలుస్తారు.
    • మైఖేల్ ఫారడే (1791-1867), 1831 లో విద్యుత్ డైనమో తయారు చేశాడు. ట్రాన్స్ ఫార్మర్ కూడా కనుగొన్నాడు.
    • గాలి వేగాన్ని కొలవడానికి అనిమోమీటర్ అనే పరికరాన్ని ఉపయోగిస్తారు.
    • అద్దంలో కుడి ఎడమలు తారుమారవుతాయి దీనిని పార్శ్వ విలోమం అంటారు.
    • తెర పై పట్టగలిగిన ప్రతిబింబాన్ని ‘నిజాప్రతిబింబం ‘అంటారు.ఈ ప్రతిబింబాన్ని మనం దర్పణం లో కూడా చూడవచ్చు.
    • తెర పై పట్టడానికి వీలు కాక దర్పణంలో మాత్రమే చూడగలిగే ప్రతిబింబాన్ని ‘మిథ్యా ప్రతిబింబం అంటారు.
    • ప్రక్ర్య్థిలో పత్రాలలోని ఆకుపచ్చటి పదార్డామ్ కిరణజన్య సంయోగక్రియకు తప్పనిసరి. ఈ ఆకుపచ్చటి పదార్దాన్ని
    • క్లోరోఫిల్ అంటారు.
    • మొక్కలను భద్రపరచడాన్ని ‘హెర్బేరియం ‘ అంటారు.
    • పరాన్నజీవి మొక్కలకు ఆహారాన్ని ఇతర మొక్కల నుంచి గ్రహించడానికి కొన్ని ప్రత్యేకమైన వేళ్ళు ఉంటాయి. వాటిని ‘హాస్టోరియా ‘  అంటారు.
    • నత్రజని తక్కువగా ఉన్న నేలలో కీటకాహార మొక్కలు పెరుగుతాయి.
    • గాలిని లోపలికి పీల్చడాన్ని ఉచ్ఛ్వాసం అని , వెలుపలికి పంపదాన్ని నిశ్వాసం అని అంటారు.ఒక నిముషంలో ఎన్ని సార్లు అయితే గాలిని లోపలికి పీల్చి ,వెలుపలికి వదిలి పెడతామో దాన్ని శ్వాసరేటు అంటారు.
    • కార్భన్ డై ఆక్సైడ్ ను కనుగొన్న శాస్త్రవేత్త – జోసెఫ్ బ్లాక్  (1756 సం .లో ).
    • ఆక్సిజన్ కు లెవోయిజర్ (1775) దానికి పేరుపెట్టాడు.
    • గ్రీకు బాషలో ఆక్సిజన్ అంటే ఆమ్లాలాను తయారుచేసేదని అర్దం. దీనిని కనుగొన్నది – జోసెఫ్ ప్రిస్ట్లే (1774)
    • చేపలలో శ్వాసవయవాలు మొప్పలు. ఇవి నీటిలో కరిగిన ఆక్సిజన్ ను శోషిస్తాయి. ఈ ఆక్సిజన్ శరీరంలోని ఇతర భాగాలకు సరఫరా ఉంటాయి.
    • బొద్దింక దేహానికి పార్శ్వ భాగాలలో చిన్న చిన్న రంధ్రాలు ఉంటాయి. ఈ రంధ్రాలను ‘స్పైరకల్స్’ అంటారు.
    • పుష్పంలో ఉండే కేసరదండం, పరాగకోశం (or) కేసరం లను కలిపి ‘పురుష ప్రత్యుత్పత్తి భాగాలు’ అంటారు.
    • జిలేబి తయారు చేసేవారు జిలేబి పిండికి ఈస్ట్ అనే ఒక పదార్దాన్ని కలిపి కొంతసేపు ఉంచుతారు. దాని వల్ల జిలేబీలు తయారవుతాయి.
    • అలెగ్జాండర్ ఫ్లెమింగ్ అనే స్కాటిష్ శాస్త్రవేత్త ఒక రకమైన శిలీంద్రాలన్ని కనుగొన్నాడు. దీనికి  ‘పెన్సిలియం ‘ అని పేరు. దీని నుంచి ‘పెన్సిలిన్’ ను తయారు చేశాడు.
    • ఇది బాక్టీరియా ద్వారా కలిగే అనేక వ్యాధులను నయం చేయడానికి యాంటీసెప్టిక్ గా ఉపయోగపడుతుంది.
    • 2005 సం. నుండి ప్రతి సం. మార్చి 22 వ తేదీని ‘ప్రపంచ జల దినోత్సవం ‘గా జరుపుకుంటున్నాం.
    • ‘నీరే మనకు ప్రాణాధారం ‘అనే కార్యక్రమాన్ని నిర్వహించడానికి గాను 2005-2015 మధ్య కాలాన్ని అంతర్జాతీయ దశాబ్దంగా ప్రకటించారు.
    • నీతిలోని వ్యాధులను కలిగించే సూక్ష్మజీవులను చంపడానికి క్లోరిన్ కలుపుతారు.
    • చిన్న చిన్న రాతి ముక్కలు , ‘హ్యూమస్ ‘ అనే కర్భాన సంబంధ పదార్దాలు కలసి మట్టి ఏర్పడుతుంది.
    • మట్టిలో పెద్ద రేణువులు , సన్నటి రేణువులు సమపాళ్లలో ఉన్నట్లయితే ఆ మట్టిని ‘ లోమ్ నేలలు ‘ అంటారు.
    • మట్టి కణాల నుంచి నీరు నెలలోకి చొచ్చుకుపోవడాన్ని ‘ పర్కో లేషన్ ‘ అంటారు.
    • ఇనుము తుప్పు పట్టకుండా దాని మీద క్రోమియం (లేదా) జింక్ వంటి లోహాల పూత పూస్తారు.
    • ఇనుము మీద జింక్ (లేదా) క్రోమియం పూత పూసే ప్రక్రియను ‘గాల్వనైజేషన్’ అంటారు.
    • ఒక లోహం మీద మరొక లోహపు పూత పూసే ప్రక్రియను ‘గాల్వానైజేషన్’అంటారు

    Click Here to Read 8th Class

Updated: July 11, 2020 — 7:26 am
SnehaJobs.com © 2026 All Rights Reserved

You cannot copy content of this page