SnehaJobs.com

విద్య, ఉద్యోగ సమాచారం & ప్రభుత్వ పథకాలు — అన్నీ ఒకే చోట

6 వ తరగతి

6th Class General Science

  • అరటి పండులో మన శరీరానికి పనికి వచ్చే పోటాసీయం అనే పదార్ధం ఉంటుంది.
  • ఖాళీ కడుపుతో అరటి పండు తినకూడదు. దానిలో ఉండే చక్కెర ప్రభావాన్ని తగ్గించుకోవడానికి ఏదైనా మాంసకృతులున్న పదార్ధంతో కలిపి తినాలి.
  • చికోరి జీర్ణవ్యస్తకు, రక్త ప్రసరణ వ్యస్థకు మేలు చేస్తుంది.
  • టమాటాలో విటమిన్ ‘సీ’ అనే పధార్ధం ఉంటుంది. ఇది రోగ నిరోధక శక్తిని కలిగిస్తుంది.
  • ఇప్పటివరకు మనకు తెలిసిన అయస్కాంత పదార్ధాలలో నియోదైమియం బలమైన అయస్కాంతం.
  • Loadstones – సహజ అయస్కాంతం (Magnash – గొర్రెలకాపరి – అయస్కాంతము ను కనుగొన్నాడు.
  • సాధారణం గా ఇనుము , నికేల్ , రాగి , కోబాల్ట్ , అల్యూమినియం ల మిశ్రమాలతో శక్తివంతమైన అయస్కాంతలను తయారు చేస్తారు.
  • సాదారణంగా అయస్కాంతాలను ఇనుము లేదా ఉక్కుతో తయారు చేస్తారు.
  • ఒక అయస్కాంత పదార్ధం ఒక అయస్కాంతానికి దగ్గరగా ఉన్నపుడు అది కూడా అయస్కాంత లక్షణాన్ని చూపడాన్ని అయస్కాంత ప్రేరణ అంటారు.
  • వాన చినుకు గంటకు 7 నుంచి 18 మైళ్ళ వేగం తో ప్రయాణిస్తుంది.
  • నీటి ని నీటి ఆవిరిగా మార్చే ప్రక్రియనే భాష్పీభవనం అంటారు .
  • నీటి ఆవిరి నీరు గా మారే ప్రక్రియ – సాంద్రీకరణం ( ధ్రవీభవనం )
  • పరిశ్రమలు, వాహనాల నుంచి వెలువడే సల్ఫర్ డైఆక్సైడ్ , నై ట్రోజన్ డై ఆక్సైడ్ లతో మేఘాలు కలుషితమైనపుడు ఆమ్లవర్షాలు కురుస్తాయి.
  • 600 మిలియన్ సంవత్సరాలకు పూర్వం ప్రికేంబ్రయన్ కాలం లో మొదటగా జంతువులు ఉద్భవించాయి.
  • జంతువులను ఆరు ప్రాధమిక సమూహాలుగా వర్ఘీకరిస్తారు అవి , అకశేరుకాలు, ఉబయ చరాలు , పక్షులు , చేపలు , సరీసృపాలు , క్షీరదాలు.
  • స్పంజికలు అనే జంతువులలో చలనం ఉండదు. జీవితం లో ఎక్కువ కాలం ఒక ప్రదేశం లో స్థిరం గా ఉంటాయి.
  • జంతువులలో నీలి తిమింగళాలు చాలా పెద్దవి.
  • క్రేన్ ఫ్లై లార్వ దశలో ఉన్నపుడు ఎక్కువగా తింటుంది . కానీ ఫ్రౌదాజీవిగా మారిన తరువాత దానికి ఆహారం తినవలసిన అవసరమే ఉండదు.
  • 150 మిలియన్ సంవత్సరాల పూర్వం మిసోజాయిక్ యుగం లో సరీసృపాల నుంచి పక్షులు ఉద్భవించాయి.
  • రక్తాన్ని పీల్చడానికి జలగా నోటిలో చూశాకాలు అనే ప్రత్యేక అవయవాలు ఉంటాయి.
  • రాత్రి వేళల్లో ఆహారాన్ని సేకరించి పగలు చీకటి ప్రదేశాలలో దక్కునే వాటిని నిశాచరులు అంటారు. ఉదాహరణకు బొద్ధింకలు, ఎడారి సరీసృపాలు, ఎలుకలు, గుడ్లగూబలు . మాల్ ( రెక్కపురుగు ) , ఇలకోడి.
  • చీమలు ‘హనీఢ్యూ’ అనే పదార్ధం కోసం ఎపిడ్స్ అనే ఒకరకమైన కీటకాలను పెంచుతాయి. ఇవి ఫేరమోన్స్ అనే రసాయనాన్ని విడుదల చేయడం ద్వారా సమాచారాన్ని తెలుపుతాయి.
  • ఒక వస్తువు రంగు దానినుంచి విడుదలయ్యే కాంతి రంగు పై ఆదరపడి ఉంటుంధి.
  • ఒక వస్తువు తేలడం లేదా మునగడం అనేది వస్తువు సాంధ్రత తో బాటు మాధ్యమం సాంధ్రత పై కూడా ఆదరపడి ఉంటుంది.
  • నీటి సాంధ్రత 1 గ్రా /మీ.లీ. ఎధైన వస్తువు నీటిపై తేలాలంటే దాని సాంద్రత 1 గ్రా / మీ. లీ . కన్నా తక్కువ ఉండాలి.
  • నదులలో మంచినీరు , సముద్రాలలో ని ఉప్పునీటితో కలిసే ప్రాంతాలలో మడ అడవులు (మాంగ్రూవ్) పెరుగుతాయి.
  • కర్పూర వృక్షం ( సిన్నాయోమమ్ కాంపొర ) చెట్టు బేరడును స్వేదనం చేయడం ద్వారా కర్పూరాన్ని తయారు చేస్తారు.
  • ఉప్పు , పటిక మొదలైన స్పటికాలలో కూడా నీరు ఉంటుంది . దీనిని స్పటిక జాలం అంటారు .
  • జోర్ధన్ దేశం లో మృత సముద్రం ఉంది .
  • ఒడిసా లోని చిలకా సరస్సు మన దేశం లో ఉన్న అతిపెద్ద ఉప్పునీటి సరస్సు.
  • ఏదైనా పదార్ధం నేరుగా ఘనరూపం నుండి వాయు రూపంలోకి లేదా వాయు రూపం నుండి ఘన రూపం లోకి మారే ప్రక్రియను ఉత్పతనం అంటారు.
  • రంగులను వేరు చేసే పద్ధతిని క్రొమోటోగ్రఫి అంటారు.
  • ఘన స్థితిలో ఉన్న కార్బన్ డై ఆక్సైడ్ ను ‘డ్రైఐస్’ అంటారు.
  • ఒక ద్రవం నుంచి కరిగిన పధర్దాలను వేరుచేయడానికి స్పటికీకరణం పద్దతిని ఉపయోగిస్తారు.
  • నీటిలో ఉన్న మలినాలను తొలగించడానికి స్వేదనం పద్దతిని ఉపయోగిస్తారు.
  • బైండింగ్ లో ఉపయోగించే గుడ్డను ‘కాలికో’ అంటారు.
  • దూది నుంచి గింజలను వేరు చేయడాన్ని జీన్నింగ్ అంటారు.
  • దూది పీచును ఉపయోగించి నూలు దారాలను తయారు చేయడాన్ని వడకడం అంటారు.
  • జనప నారను ‘బంగారు దారం’ అంటారు.
  • వస్త్ర పరిశ్రమలో ఎక్కువగా ఉపయోగించే పాలిస్టర్ దారాలను పెట్రోలియం నుంచి తయారు చేస్తారు.
  • కర్రగుజ్జుకు రసాయనాలను కలిపి రేయాన్ దారాలను తయారు చేస్తారు.
  • మిరపకాయలో కారం కలిగించే పదార్ధాన్ని ‘కాప్సిసియమ్ ‘ అంటారు.
  • ఒక పదార్ధం ద్రవస్తితి నుంచి ఘన స్తితికి మారడాన్ని స్పటికీకరణం అంటారు .
  • పాలను పెరుగుగా మార్చే భ్యాక్టీరియాయ లాక్తోబాసిల్లాస్
  • డైరీ పరిశ్రమలో భారీ ఎత్తున పాలనుంచి పెరుగు తయారు చేయడాన్ని కోయగ్యులేషన్ అంటారు.
  • వాతావరణ శాస్త్రవేత్తలు రాడార్ ( Radio Detection and Ranging ) అనే పరికరాన్ని ఉపయోగించి వర్షం , మంచు మోదలైన వాటిని గురించి తెలుసుకుంటారు.
  • విలియం బర్డ్స్ అనే బ్రిటిష్ శాస్త్రవేత్త (1544-1603) విద్యుత్ ను కనుగొన్నాడు.ఇది కదిలే ప్రవాహం లాంటిదని దానికి హూమర్ అని పేరు పెట్టాడు.
  • మైఖేల్ ఫారడే అను భౌతిక రసాయన శాస్త్రవేత్త (1791-1867) మొట్ట మొదటిగా విద్యుత్ మోటార్ ను, విద్యుత్ జనరేటర్ ను కనుగొన్నాడు.
  • బల్బ్ ఫీలమెంట్ లో వాడే పదార్దం- టంగ్ స్టన్.
  • ప్రపంచంలో అతి పొడవైన వంతెన ‘కూషాన్ గ్రాండ్ బ్రిడ్జ్ ‘(164.8K.M)( చైనా ).
  • ఒక గజం =3 అడుగులు , 1 అడుగు = 12 అంగుళాలు .
  • 1957 ఏప్రిల్ 1న మనదేశం మెట్రిక్ పద్దతిని ప్రామాణిక పద్దతిగా స్వీకరించబడింది.
  • విమానాలు , ఓడల వేగాన్ని నాట్ లు /నాటికల్ మైళ్ళలో కొలుస్తారు.  ఒక నాట్ =1.852 కి . మీ /గం .
  • ఒక మైలు =1.61 M.
  • ఖగోళ శాస్త్రవేత్తలు నక్షత్రాల మధ్య దూరాన్ని ‘పారలాక్స్ ‘ యూనిట్లలో కొలుస్తారు.
  • అత్యంత వేగంగా పరిగెత్తగలిగే జంతువు – చిరుతపులి (97కి.మీ).
  • నెమ్మదిగా కదిలే జంతువు –నత్త (0.013-0.028 మీ /సె).
  • పక్షులలో అతి చిన్న పక్షి – హమ్మింగ్ బర్డ్ (5.70 CM).
  • పక్షులోకెల్లా మగ ఆస్ట్రిచ్ పక్షి బరువైనది (345 పౌండ్లు ).
  • కొన్ని కండరాలకు గుండ్రంగా,తెల్లగా ఉండే దారాలాంటి తంతువులు ఉంటాయి . వీటిని ‘టెండాన్’ అంటారు. వాటి చివరాలు ఎముకకు అతికి ఉంటాయి.
  • మన శరీరంలో పొడవైన ఎముక ‘ఫీమర్ ‘ ఇది తొడలో ఉంటుంది.
  • రెండు ఎముకలను కలపడానికి ప్రత్యేకమైన కండరపు తంతువులు ఉంటాయి.వీటిని లిగమెంట్లు అంటారు.
  • మానవ శరీరంలో నీటిపై  తేలగల అవయవం – ఊపిరితిత్తులు .
  • మానవుని పుర్రె లో 22 ఎముకలు ఉంటాయి. ఇవన్నీ కలసిపోయి ఒకటిగా కనిపిస్తాయి. దీన్ని ‘కార్నియం’ అంటారు.
  • మన శరీరంలో 206 ఎముకలు, 230 కీళ్ళు ఉంటాయి.
  • సూర్యకాంతి భూమిని చేరడానికి 8 నిముషాల 17 సె. సమయం పడుతుంది.
  • ఆకుపచ్చ,ఎరుపు,నీలం రంగులను ప్రాధమిక వర్ణాలు అంటారు. ఇవి వివిధ పాళ్ళలో కలసి అనేక రంగులను ఏర్పరుస్తాయి.
  • కాంతిని గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ‘దుశా శాస్త్రం ‘ (optics) అంటారు.
  • భూమి నుంచి కాంతి చంద్రుని చేరడానికి 1.255 సెకనుల సమయం పడుతుంది.
  • మనం పుట్టినప్పటి నుంచి జీవితాంతం వరకు జీవించి ఉండే కణాలు మెదడు కణాలు మాత్రమే.
  • కోడిగుడ్డు తెల్లసొనలో ‘ఆల్బూమిన్ ‘ అనే ప్రోటీన్ ఉంటుంది.
  • జగదీశ్ చంద్రబోస్ మొక్కలకు కూడా ప్రాణం ఉంటుందని అవి కూడా ప్రతిస్పందిస్తాయని నిరూపించారు.
  • జున్ను తయారు చేయడంలో శిలీంద్రాలను ఉపయోగిస్తారు. దీనిని ‘ కిణ్ణ్వానమ్ ‘ అంటారు.
  • క్రీ.శ 1590 లో డచ్ శాస్త్రవేత్త జకారస్ జాన్సన్ అతని తండ్రి హేన్స్ మైక్రోస్కోప్ ను కనుగొన్నాడు.
  • మనం ఆహారంగా ఉపయోగించే పుట్టగొడుగులు కూడా శిలీంద్రాలే .
  • శైశవ దశలో వెన్నెముకలో 33 వెన్నుపూసలు ఉంటాయి.ఆ తరువాత చివర 9 వెన్నుపూసలు కలిసిపోయి ఒకటిగా ఏర్పడుతాయి.
  • కాంతి సెకనుకు 3 లక్షల కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. నీటి బిందువు గుండా సూర్యకాంతి ప్రయాణించినపుడు ఇంద్రధనస్సు ఏర్పడుతుంది.
  • మానవుని గుండే నిముషానికి 5 నుంచి 30 లీటర్ల రక్తాన్ని పంపు చేస్తుంది.

 Click Here to Read 7th Class 

Updated: July 26, 2026 — 2:36 pm
SnehaJobs.com © 2026 All Rights Reserved

You cannot copy content of this page