YSR PELLI KANUKA : వైస్సార్ పెళ్లి కానుక
HOW TO APPLY YSR PELLI KANUKA
YSR PELLI KANUKA STATUS
ఉద్దేశం :
“రాష్ట్రములోని నిరుపేద కుటుంబాలలో ఆడపిల్ల వివాహ కార్యక్రమము భారం కాకుండా మరియు పెళ్లి కుమార్తె పెళ్లి అయి అత్త వారింటికి వెళ్ళిన తరువాత కూడా అభద్రతా భావంతో ఉండకుండా ఉండేందుకు గాను రాష్ట్ర ప్రభుత్వం వారు పెళ్లి కానుక పథకానికి శ్రీకారం చుట్టారు. ఈ పథకం ద్వారా ప్రభుత్వం పేదింటి ఆడపిల్లకు ఆర్ధిక సహాయం చేయడం ద్వారా అండగా ఉండడమే కాక, బాల్య వివాహాలు నిర్మూలించేందుకు మరియు వివాహం రిజిస్ట్రేషన్ చెయ్యడం ద్వారా వధువుకి రక్షణ కల్పించడం ”వైఎస్సార్ పెళ్ళికానుక” రూప కల్పన ముఖ్య ఉద్దేశ్యం.”
పథక మార్గదర్శకాలు:
1. మండల సమాఖ్య / మెప్మా కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలి.
2. అనంతరం అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలిస్తారు.
3. వివాహానికి ముందే సాయం మొత్తంలో 20 శాతం పెళ్లికుమార్తె బ్యాంకు ఖాతాలో వేస్తారు.
4. వివాహమయ్యాక మిగతా మొత్తాన్ని జమ చేస్తారు.
5. అనంతరం వివాహ ధ్రువీకరణ పత్రం ఇస్తారు.
అర్హతలు (వధూవరులిద్దరూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందినవారయితే):
1.వధువు మరియు వరుడు ఇద్దరూ ప్రజా సాధికార సర్వే నందు నమోదు కాబడి ఉండాలి. ( వాలంటీర్ నందు HOUSEHOLD సర్వే చేసుకున్న అగును – మార్గ దర్శకాలు రావలిసి ఉంది )
2.వధువు మరియు వరుడు ఇద్దరూ ఆంద్ర ప్రదేశ్ రాష్ట్ర నివాసితులై ఉండాలి.
3.వధువు మరియు వరుడు ఇద్దరూ ఆధారు కార్డు కలిగి ఉండాలి.
4.వధువు తప్పనిసరిగా తెల్ల రేషను కార్డు కలిగి ఉండాలి.
5.వివాహ తేది నాటికీ వధువుకు 18 సంవత్సరములు మరియు వరుడుకు 21 సంవత్సరములు పూర్తి అయి ఉండవలెను.
6.కేవలం మొదటిసారి వివాహము చేసుకొనే వారు మాత్రమే ఈ పధకమునకు దరఖాస్తు చేసుకొనుటకు అర్హులు. అయితే, వధువు వితంతువు అయినప్పటికీ ఈ పధకమునకు దరఖాస్తు చేసుకొనవచ్చును.
7.వివాహము తప్పనిసరిగా ఆంద్ర ప్రదేశ్ రాష్ట్రములో మాత్రమే జరుగవలెను.
అర్హతలు (వధువు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి చెంది ఉండి వరుడు ఇతర రాష్ట్రాలకు (తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, చతీస్ ఘడ్ & ఒడిస్సా) చెందినవారయితే):
1.వధువు ప్రజా సాధికార సర్వే నందు నమోదు కాబడి ఉండాలి ( వాలంటీర్ నందు HOUSEHOLD సర్వే చేసుకున్న అగును – మార్గ దర్శకాలు రావలిసి ఉంది )
2.వధువు ఆంద్ర ప్రదేశ్ రాష్ట్ర నివాసితులై ఉండాలి.
3.వధువు మరియు వరుడు ఇద్దరూ ఆధారు కార్డు కలిగి ఉండాలి.
4.వధువు తప్పనిసరిగా తెల్ల రేషను కార్డు కలిగి ఉండాలి
5.వివాహ తేది నాటికీ వధువుకు 18 సంవత్సరములు మరియు వరుడుకు 21 సంవత్సరములు పూర్తి అయి ఉండవలెను.
6.కేవలం మొదటిసారి వివాహము చేసుకొనే వారు మాత్రమే ఈ పధకమునకు దరఖాస్తు చేసుకొనుటకు అర్హులు. అయితే, వధువు వితంతువు అయినప్పటికీ ఈ పధకమునకు దరఖాస్తు చేసుకొనవచ్చును
7.వివాహము తప్పనిసరిగా ఆంద్ర ప్రదేశ్ రాష్ట్రములో మాత్రమే జరుగవలెను.
ప్రోత్సహకం :
1 .వైఎస్సార్ పెళ్ళికానుక (ఎస్.సి) సాంఘిక సంక్షేమ శాఖ -40,000/-
2.వైఎస్సార్ పెళ్ళికానుక (ఎస్.సి కులాంతర) సాంఘిక సంక్షేమ శాఖ -75,000/-
3.వైఎస్సార్ పెళ్ళికానుక (గిరి పుత్రిక) గిరిజన సంక్షేమ శాఖ-50,000/-
4.వైఎస్సార్ పెళ్ళికానుక (ఎస్.టి కులాంతర) గిరిజన సంక్షేమ శాఖ -75,000/-
5.వైఎస్సార్ పెళ్ళికానుక (బి.సి) బి.సి సంక్షేమ శాఖ-35,000/-
6.వైఎస్సార్ పెళ్ళికానుక (బి.సి కులాంతర) బి.సి సంక్షేమ శాఖ-50,000/-
7.వైఎస్సార్ పెళ్ళికానుక (దుల్హన్) మైనారిటీ సంక్షేమ శాఖ-50,000/-
8.వైఎస్సార్ పెళ్ళికానుక (దివ్యంగులు) దివ్యంగులు సంక్షేమ శాఖ-1,00,000/-
9.వైఎస్సార్ పెళ్ళికానుక (APBOCWWB) ఆంధ్రప్రదేశ్ భవనములు మరియు ఇతర నిర్మాణ రంగములోని కార్మిక సంక్షేమ సంస్థ, కార్మిక సంక్షేమ శాఖ-20,000/-
కావలసిన డాకుమెంట్స్ :
1 కులము – కమ్యూనిటి మరియు జనన ధృవీకరణ పత్రము
2 వయస్సు -యస్.యస్.సి సర్టిఫికేట్: 2004 వ సంవత్సరము మరియు ఆ తరువాత పదవ తరగతి పాసయిన వారికీ (లేదా) డేట్ అఫ్ బర్త్ (లేదా ) ఆధార్ కార్డు
3.ఆదాయము (వధువుకి మాత్రమే) -తెల్ల రేషను కార్డు/ ఇన్కమ్ సర్టిఫికేట్
4.నివాసము-ప్రజా సాధికార సర్వే నందు నమోదు / హౌస్ హోల్డ్ సర్వే
5.అంగవైకల్యము -సదరం సర్టిఫికేట్ (కనీసం 40% గా ఉండి శాశ్వత అంగవైకల్యం అయి ఉండాలి)
6.వితంతువు-ఆధార్ నెంబర్ ఆధారముగా పింఛను డేటాతో పరిశీలిస్తారు. వితంతువు అయి ఉండి పింఛను పొందకపోతే లేదా ఫించను డేటాలో వివరాలు లేకపోతే వ్యక్తిగత ధృవీకరణ.
7.భవన మరియు ఇతర నిర్మాణ కార్మికులు- ఎ.పి.బి.ఒ.సి.డబ్ల్యూ.డబ్ల్యూ.బి చే జారీ చేయబడిన కార్మికుని యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్/గుర్తింపు కార్డు.
వైఎస్సార్ పెళ్ళికానుక లో నమోదు చేసుకునే విధానము
నమోదు చేసుకునే సమయానికి వివాహ వేదిక, వివాహ సమయం నిర్ణయించ బడి ఉండాలి. వివాహ తేదీకి కనీసం 5 రోజుల ముందు నమోదు చేసుకోవాలి. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న వారు రూరల్ వెలుగు మండల మహిళ సమాఖ్యలో నమోదు చేసుకోవచ్చు.
నమోదు చేసుకునే సమయానికి వివాహ వేదిక, వివాహ సమయం నిర్ణయించ బడి ఉండాలి. వివాహ తేదీకి కనీసం 5 రోజుల ముందు నమోదు చేసుకోవాలి. పట్టణ ప్రాంతంలో ఉండేవారు అర్బన్ మెప్మా లో నమోదు చేసుకోవచ్చు.
పెళ్లి కనుక వెబ్ సైట్ :
Click Here For Official Website
పెళ్లి కనుక స్టేటస్ :
Click Here For Pellikanuka Status
Call me annaya 7569643897
Meetho matladali I’m a YouTuber Channel name Charan Tech World