SnehaJobs.com

విద్య, ఉద్యోగ సమాచారం & ప్రభుత్వ పథకాలు — అన్నీ ఒకే చోట

వై ఎస్ ఆర్ చేయూత

వై ఎస్ ఆర్ చేయూత

  1. పథకం యొక్క వివరం:

మహిళలు ఆర్ధిక స్వావలంబన సాధించటానికి వీలుగా 45 నుండి 60 సంవత్సరాల లోపు వయస్సు కలిగి BC,SC,ST మరియు మైనారిటీ వర్గాలకు చెందిన మహిళలకు ఆయా సంక్షేమ కార్పొరేషన్ల ద్వారా సంవత్సరానికి రు” 18,750 నాలుగు సంవత్సరాల కాలంలో రూ. 75,000/-ల ఆర్ధిక సహాయం నాలుగు విడతలుగా అందించడం ఈ పథకం యొక్క లక్ష్యం. ఇది వారికి సుస్థిర జీవనోపాధి అవకాశాలను, కుటుంబ స్థాయిలో ఆదాయ పెంపుదలను, సంపద సృష్టిని కల్పించడం ద్వారా వారి యొక్క  జీవన ప్రమాణాలను పెంపొందిస్తుంది.

  • పథకం అమలుకు బాధ్యత వహించే ఉద్యోగి:
    • సంక్షేమ మరియు విద్యా సహాయకులు (గ్రామీణ ప్రాంతాలు)
    • వార్డు సంక్షేమ & అభివృద్ధి కార్యదర్శి (పట్టణ ప్రాంతాలు)
  • అర్హతా ప్రమాణాలు:

ఈ పథకం క్రింద ఆర్ధిక సహాయం పొందడానికి లబ్ధిదారులు ఈ క్రింద తెలిపిన అర్హతా ప్రమాణాలను కలిగి ఉండాలి.

ప్రమాణంనిబంధనలు
మొత్తం కుటుంబ ఆదాయంగ్రామీణ ప్రాంతాలు – నెలకు రూ. 10,000/-ల లోపుపట్టణ ప్రాంతాలు – నెలకు రూ. 12,000/-ల లోపు ఉండాలి.  
మొత్తం కుటుంబానికి గల భూమిలబ్ధిదారులు 3 ఎకరాల కంటే తక్కువ మాగాణి లేదా 10 ఎకరాల కంటే తక్కువ మెట్ట లేదా రెండూ కలిపి గరిష్టంగా 10 ఎకరాల లోపు ఉన్నవారు మాత్రమే అర్హులు
ప్రభుత్వ ఉద్యోగి/ ఫించనుదారుకుటుంబంలోని ఏ వ్యక్తి ప్రభుత్వ ఉద్యోగి లేదా ఫించనుదారు అయి ఉండరాదు. ఈ షరతు నుండి పారిశుద్ధ్య పనివారి కుటుంబాలు మినహాయించబడినవి.
నాలుగు చక్రాల వాహనంలబ్ధిదారు కుటుంబం నాలుగు చక్రాల వాహనం కలిగి ఉండకూడదు. (టాక్సీలు, ట్రాక్టర్లు, ఆటోలు ఈ షరతు నుండి మినహాయించబడినవి).
విద్యుత్ వినియోగంగడచిన 12 నెలలలో కుటుంబం యొక్కవిద్యుత్తు వినియోగం  నెలకు సరాసరి 300 యూనిట్లు మించరాదు.
ఆదాయపు పన్నుఆదాయపు పన్ను చెల్లిస్తున్నవారు ఈ పథకానికి అనర్హులు  
పట్టణాల్లో ఆస్తిమున్సిపాలిటీ పరిధిలో 1000 చ.అల కంటే తక్కువ నిర్మిత ప్రాంతం (నివాస లేదా వాణిజ్య)ఉన్నవారు(పట్టణ ప్రాంతాలకు మాత్రమే వర్తిస్తుంది)  
వయస్సు & లింగంపధకం ప్రారంభం నాటికి 45 నుండీ 60 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన మహిళలు.
పుట్టిన తేదీ ఆధారంఆధార్కార్డ్ప్రకారం
కుల ధృవీకరణ పత్రం మరియు బ్యాంకు ఖాతా వివరాలులబ్ధిదారులు చెల్లుబాటయ్యే కుల ధృవీకరణ పత్రాన్ని మరియు ఆర్ధిక సహాయాన్ని జమ చేసేందుకు ఏదైనా షెడ్యూల్డ్ వాణిజ్య బ్యాంకులో తమ పేరుపై తెరచిన ఖాతా వివరాలను ఇవ్వాలి.
  • పథకం అమలు విధానం
  • తక్షణ అప్పీలేట్ అథారిటీ
  • మండల పరిషత్ అభివృద్ధి అధికారి
  • మున్సిపల్ కమీషనర్
  • సంబంధిత ప్రభుత్వ ఉత్తర్వులు
వ.నెంవివరణఉత్తర్వుల నెం.
1.వై ఎస్ ఆర్ చేయూత  పథకం – అమలు మార్గదర్శకాలుజి.ఓ.ఎం.ఎస్.నెం. 636, తేదీ: 12-06-2020
2.వై ఎస్ ఆర్ చేయూత  పథకం – మార్గదర్శకాలు/ పథకం అమలుకు పని విధానం (వర్క్ ఫ్లో)మెమో నెం. 1168432/ ఆర్‌డి.1/A1/2020
  • ప్రభుత్వ ఉత్తర్వులసవరణ వివరాలు
సవరణ నెం. సవరణ తేదీ సవరణ వివరాలు
111-08-2020జి.ఓ.ఎం.ఎస్.నెం 648,PR&RD

# సాంకేతిక సమస్యలకు సంప్రదించవలసిన వారు

లబ్ధిదారులు లేదా పౌరులు సంప్రదించవలసిన టోల్ ఫ్రీ నెంబరు:1902

ఫిర్యాదులను www.navasakam2.apfss.in అనే ఈ మెయిల్ అడ్రస్ కు పంపవచ్చు.

For More Schemes Click Here

Updated: January 25, 2023 — 4:34 pm
SnehaJobs.com © 2026 All Rights Reserved

You cannot copy content of this page