గ్రామపంచాయతీ పరిపాలన · రిజిష్టర్ల మార్గదర్శిని
గ్రామపంచాయతీ నిర్వహించే
రిజిష్టర్లు
ప్రతి సంస్థకు ఉద్దేశ్యాలు, ఆశయాలు ఉంటాయి — వాటిని రికార్డుల రూపంలో నమోదు చేయటం వల్ల సంస్థ దీర్ఘకాలికంగా, స్వల్పకాలికంగా చేపట్టిన, చేపట్టనున్న పనుల సమాచారం భద్రంగా నిలుస్తుంది.
ప్రతి గ్రామపంచాయతీ తన ఉద్దేశ్యాలు, ఆశయాలు నెరవేర్చటానికి గ్రామసభలు జరుపుతుంది, ప్రజాభిప్రాయాన్ని స్వీకరిస్తుంది; గ్రామసభ నిర్ణయాలను అమలు చేసేందుకు సమావేశాలు నిర్వహించి తీర్మానాలు చేస్తుంది; వనరుల సమీకరణకై పన్నులు వసూలు చేస్తుంది; చేపట్టిన పనులను కొలతల పుస్తకం (యం.బుక్కు)లో నమోదు చేయించి చెల్లింపులు చేస్తుంది; సిబ్బందికి జీతభత్యాలు ఇస్తుంది; ఆర్థిక కార్యకలాపాలకై ఎకౌంట్సు రిజిష్టర్లు నిర్వహిస్తుంది. ఈ కార్యకలాపాలన్నింటినీ, రాబోయే ప్రతినిధులకు మార్గదర్శిగా ఉండేలా, రిజిష్టర్లలో వ్రాసి భద్రపరుస్తుంది. ఈ రిజిష్టర్లను నాలుగు రకాలుగా విభజించవచ్చు:
సమావేశాలకు సంబంధించిన రిజిష్టర్లు
- గ్రామపంచాయతీ సమావేశపు ఎజెండా నోటీసు రిజిష్టరు
- గ్రామపంచాయతీ సమావేశపు సభ్యుల హాజరు రిజిష్టరు
- గ్రామపంచాయతీ సమావేశపు తీర్మానాల రిజిష్టరు
- గ్రామ సభ ఎజెండా నోటీసు రిజిష్టరు
- గ్రామ సభ సభ్యుల హాజరు రిజిష్టరు
- గ్రామసభ తీర్మానాల రిజిష్టరు
- కార్యాచరణ కమిటీల సమావేశపు ఎజెండా నోటీసు రిజిష్టరు
- కార్యాచరణ కమిటీల సమావేశపు సభ్యుల హాజరు రిజిష్టరు
- కార్యాచరణ కమిటీల సమావేశపు తీర్మానాల రిజిష్టరు
సాధారణ పరిపాలనకు సంబంధించిన రిజిష్టర్లు
- పారిశుద్ధ్య నిర్వహణ సంబంధిత రిజిష్టర్లు
- త్రాగునీటి సరఫరా, నిర్వహణ సంబంధిత రిజిష్టర్లు
- వీధి దీపాల నిర్వహణ సంబంధిత రిజిష్టర్లు
- రోడ్ల నిర్మాణం, నిర్వహణ సంబంధిత రిజిష్టర్లు
- స్మశాన వాటికల నిర్వహణ సంబంధిత రిజిష్టర్లు
- ఆస్తుల పరిరక్షణ, నిర్వహణ సంబంధిత రిజిష్టర్లు
- సమాచారహక్కు చట్టం రిజిష్టర్
- స్టేషన్ రిజిష్టర్
- కాన్స్టిట్యూషన్ రిజిష్టర్
- ఎన్నికల రిజిష్టర్
- సభ్యుల అర్హతలు, అనర్హతలు తెలుపు రిజిష్టర్ (20 ఎ అండ్ బి)
- సాధారణ ఖాళీల రిజిష్టర్
- ఆక్రమణల రిజిష్టర్
- కోర్టు కేసుల రిజిష్టర్
రోజువారీ పరిపాలనకు సంబంధించిన రిజిష్టర్లుఫారములు
ఘన వ్యర్థాల నిర్వహణ కేంద్రం (SWPC) రిజిష్టర్లునిర్వహించవలసిన రికార్డులు
- షెడ్ కానిస్టిట్యూషన్ రిజిష్టర్
- టూల్స్ అండ్ ప్లాంట్ రిజిష్టర్
- SWPC క్యాంప్ బుక్
- హాజరు రిజిష్టర్
- విజిటర్స్ రిజిష్టర్
- వర్మి కంపోస్ట్ స్టాక్ రిజిష్టర్
- పొడి చెత్త అమ్మకం రిజిష్టర్
- ఎట్ ఏ గ్లాన్స్ రిజిష్టర్
- పశుపక్ష్యాదుల సంహార వాటిక నిర్వహించిన జంతువుల తేదీలతో కూడిన రిజిష్టర్
- నోటిఫైడ్ కలెక్షన్ – సేల్-అడ్రెస్లు తెలుపు రిజిష్టర్
- హాజరు పట్టిక
APSIRDPR
విస్తరణ శిక్షణా కేంద్రాలు
ప్రధాన సంస్థ · Head Institute
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ సంస్థ (APSIRDPR)
apsirdpr.ap.gov.in
గ్రామపంచాయతీ రికార్డుల నిర్వహణ మార్గదర్శిని
📌 సంబంధిత సమాచారం: గ్రామపంచాయతీ రిజిష్టర్లు, పంచాయతీ ఫారములు మరియు PDO / Panchayat Secretary ఉపయోగించే ముఖ్యమైన ఫారముల కోసం ఈ పేజీని చూడండి.
PDO Forms & Information →మా వాట్సాప్ ఛానెల్లో జాయిన్ అవ్వండి
AP ప్రభుత్వ పథకాలు & జాబ్ అప్డేట్స్ కోసం జాయిన్ అవ్వండి!
Join WhatsApp Channel