DSC Telugu Methods

By | June 16, 2020

DSC Telugu Methods : తెలుగు మెథడ్స్ – శ్రవణం భాషణం

1. శ్రవణశక్తి లోపాలకు సంబంధించి ఈ క్రింది వానిలో భిన్నమైనది.

1. విషయాస్తిలేమి

2. స్థాయికి మించిన విషయాలు చెప్పడం

3. శ్రవణేంద్రియాల లోపం

4. అశ్రద్ధ

2. భాషాభ్యసనంలో, బోధనలోగాని ప్రథమ సోపానం.

1. వాచికచర్య

2. అభినయ గేయం

3. ఉక్తరచన

4. శిశుగేయం

3. ‘‘ చిన్నది ఇదిగో చిటికెనవ్రేల్‌ ఉన్నది ప్రక్కన  ఉంగ్రపువ్రేల్‌ ‘‘ అనేది.

1. బాలగేయం

2. అభినయగేయం

3. సంభాషణ గేయం

4. నాటకీకరణం

4. ఎండలు కాసేదెందుకురా? వానలు కురిసేటేదుకురా అనేది

1. అభినయగేయం

2. బాలగేయం

3. సంభాషణ

4. కథాకథనం

5. ఊనిక, స్వరం, స్థాయి, స్పష్టత, భావానుగుణ్యత, శబ్ధప్రయోగం మొ॥ వాటిని ఈ ప్రక్రియ ద్వారా గమనించవచ్చు

1. అభినయగేయం

2. బాలగేయం

3. ఉక్తరచన

4. అంత్యాక్షరి

6. ఉపన్యాస ఫలకం Legturn or Rostrum) యొక్క  ఉపయోగం

1. సంభాషణ మూల్యాంకనం చేసుకోవచ్చు

2. అభినయ విధానం తెలుసుకోవచ్చు

3. భాషా నైపుణ్యానికి ప్రత్యేక కృషి చేస్తుంది

4. సభాకంపం తొలగించుకోవచ్చు

7. ‘‘ పిల్లలు అ్లరి చేసినాడు ‘‘ అనేది ఈ దోషం

1. భావాదోషం

2. ఉచ్చారణ దోషం

3. కర్తకు క్రియకు వచన వైరుధ్యం

4. కాలానికి కర్తకు వైరుధ్యం

8. ఈ క్రిందివానిలో భిన్నమైన దానిని గుర్తించండి.

1. హరిశ్చంద్రుడు – హరిచ్చంద్రుడు

2. ఆశ్చర్యం – ఆచ్చర్యం

3. పాశ్చాత్యు – పాచ్చాత్యు

4. పచ్చిపులుసు – పక్షిపులుసు

9. విద్యార్థి ‘‘ పశ్చిమ ‘‘ అనే పదాన్ని ‘ పచ్చిమం ‘ అని పలకడానికి కారణం.

1. దంత్యతాలవ్యాలను తారుమారు చేయడం

2. వర్ణమార్పిడి దోషం

3. అంతస్థాలు సరిగా పలకక పోవడం

4. ధ్వను స్థానకరణ ప్రయత్నాులు సరిగా తెలియక పోవడం

10. విద్యార్థుల ఉచ్చారణను వారే స్వయంగా తెలుసుకుని  సరిదిద్దుకొనేలా చేసేవి

ఎ. లింగ్పోఫోన్‌

బి. ఉచ్చారణ నికష

సి. భాషా ప్రయోగశాల

డి. రేడియో

11. స్వయంకృషి, ఆత్మవిశ్వాసం, నాయకత్వ లక్షణాలు  ఈ ప్రక్రియ యొక్క ప్రయోజనం

1. సంభాషణ

2. ఉక్తరచన

3. నాటకీకరణం

4. కథాకథనం

12. ఈ క్రింది వానిలో అనునాసిక దోషం కానిది

1. అన్నం – అణ్ణ

2. జ్ఞానం – గ్యానం

3. పరినతి – పరిణతి

4. ఉచ్చారణ – ఉచ్ఛారణ

13. శిశువు వీటిని పలకడంలో భాషాభ్యసన ప్రారంభమవుతుంది.

1. ఊ

2. తాత, మామ

3. క,త,ప

4. ఈ

14. ఈ స్థాయిలోగల వారికి ‘ భాగవత, రామాయణ‘ గ్రంథాల్లోని నవరసభరితమైన రసవత్తర పద్యాలను టేపురికార్డుర్‌ ద్వారా వినిపించాలి.

1. ప్రాథమిక

2. మాథ్యమిక

3. ఉన్నత

4. 2 మరియు 3

15. వాచికచర్యకు ఇది ముఖ్య ఆధారం.

1. సంభాషణ

2. ప్రశ్నావళి

3. నాటకీకరణం

4. ప్రసంగం

16. విద్యార్థి సేకరించుకున్న అంశాన్ని సరైన క్రమంలో అమర్చుకొనేటట్లు చేయడం వన ఈ దోషాన్ని సవరించవచ్చు.

1. వేగోచ్చారణ

2. సమవేగరరాహిత్య దోషం

3. సమస్వర రాహిత్య దోషం

4. ధారాళంగా మాట్లాడలేక పోవడం

17. క్రింది వానిలో విభిన్నమైన దోషాన్ని గుర్తించండి

1. సుతిలి – తుసిలి

2. మిగిలిన – మిలిగిన

3. చా – చాన

4. శంఖం – శంకం

18. అతి సులభంగా భావగ్రహణకు తోడ్పడే భాషా నైపుణ్యం

1. శ్రవణం

2. భాషణం

3. లేఖనం

4. పఠనం

19. వాచికచర్యను పెంపొందించుటకు ఇది బాగా  ఉపయోగపడుతుంది.

1. సంభాషణ

2. అభినయగేయం

3. కథాకథనం

4. నాటకీకరణం

20. విద్యార్థి ‘‘ నౌకరులు‘‘ అనుటకు బదు ‘‘ నౌకలు ‘‘ అన్నాడు ఇది భాషాదోషం

1. అక్షరదోషం

  2. పదదోషం

3. వాక్యదోషం

4. వ్యాకరణదోషం

21.భాష ఆలోచనకు ఆకృతి అని అన్నది.

1. హాకెట్‌

2. ఇజ్లర్‌

  3. జాన్సన్‌

4. సైమన్‌ పాటర్‌

22. భాష తీరు వీటిని బట్టి మారుతూ ఉంటుంది.

ఎ. వ్యక్తు

బి. కుటుంబం

సి. సమాజం

డి. జాతి

(1) ఎబి    (2) ఎబిసి    (3) బిసిడి    (4) ఎబిసిడి

23. క్రింది వానిలో సునిశిత శ్రవణ శక్తిని పెంపొందించ లేనిది.

  1. రాముడు – సీత

2. కరం – ఖరం

3. కల -కళ

4. బావి – భావి

24. మాట్లాడేటప్పుడు భావానుగుణమైన స్వరభేదం పాటిస్తే దానిని క్రింది విధంగా పిలుస్తారు.

1. ఆంగికాభినయం

2. వాచికాభినయం

3. స్వరాభినయం

4. భావాభినయం

25.  వాచిక చర్య శిక్షణ ఇచ్చేటప్పుడు శక్షణ ఇవ్వవల్సిన అంశాలను వరుసక్రమంలో ఉంచండి. 

ఎ. భావ ప్రకటనా కౌశం
బి. ఉచ్చారణ దక్షత
సి. విషయ పరిచయం
డి. నూతన శబ్ద పరిచయం

1. ఎబిసిడి          2. డిసిబిఎ            3. డిసిఎబి               4. బిసిఎడి