ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం Kaushalam Survey ద్వారా యువతకు ఇంటి దగ్గర నుండే పనిచేసే అవకాశాలు కల్పిస్తోంది. ఈ ప్రక్రియలో ప్రతి అభ్యర్థి తన విద్యార్హత, నైపుణ్యాలు, డాక్యుమెంట్స్ ఆధారంగా survey లో నమోదు అవ్వాలి. ఇక్కడ పూర్తి వివరాలు ఇవ్వబడ్డాయి.
1. ఎలాంటి ప్రశ్నలు అడుగుతారు?
సర్వే సమయంలో అడిగే ముఖ్యమైన ప్రశ్నలు:
- విద్యార్హత (Qualification)
- Specialization (ఉదా: B.Tech – CSE, Diploma – EEE వంటివి)
- పొందిన సర్టిఫికెట్ / కోర్సు
- మార్కులు / GPA వివరాలు
- చదివిన విద్యాసంస్థ పేరు
- సర్టిఫికెట్ Upload
👉 అదనంగా: మాట్లాడే భాషలు, నైపుణ్యాలు, కోర్సులు, training వివరాలు కూడా అడుగుతారు.
2. సర్వేను ఎవరు చేస్తారు?
- గ్రామ / వార్డు సచివాలయ సిబ్బంది GSWS Employees App ద్వారా సర్వే నిర్వహిస్తారు.
- వారు అభ్యర్థుల Biometric లేదా Phone OTP ద్వారా ధృవీకరణ చేసి, వివరాలు నమోదు చేస్తారు.
3. Self Enrolment ద్వారా Survey చేసుకోవడం
ప్రతి అభ్యర్థి తనే survey చేసుకోవచ్చు.
👉 Kaushalam Survey Link: CLICK HERE
4. Online Application Steps
- పై లింక్‌కి వెళ్ళి క్లిక్ చేయాలి.
- Aadhaar number నమోదు చేసి OTP పొందాలి.
- OTP Verify చేసి survey form లోకి వెళ్లాలి.
- తరువాత Mobile number ద్వారా కూడా OTP verify చేయాలి.
- మీ ID details నమోదు చేయాలి.
- చివరగా మీ Qualification, Specialization, Subjects, GPA/Percentage వివరాలు ఇవ్వాలి.
- అవసరమైన Certificates Upload చేయాలి.
5. అవసరమైన పత్రాలు
విద్యార్హత పత్రాలు
- కనీసం 10th class లేదా అంతకంటే పై చదువు పూర్తి చేసి ఉండాలి.
- Diploma / Graduation / PG / Professional Course certificates.
ఇతర పత్రాలు
- Aadhaar Card (మొబైల్ నెంబర్ లింక్ అయి ఉండాలి).
- ఇ-మెయిల్ ID (OTP verification కోసం).
- విద్యార్హత పత్రాలు: మార్కులు, GPA, విద్యాసంస్థ పేరు.
- Certificates Soft Copies.
- SSC, Intermediate, Degree Certificates.
6. ముఖ్య గమనిక
- 10th class లేదా అంతకంటే పై చదివినవారే survey చేసుకోవచ్చు.
- Certificates లేకుండా survey పూర్తి చేయడం సాధ్యం కాదు.
- ఇచ్చిన సమాచారం ఆధారంగా AP Govt Work From Home Jobs అవకాశాలు ఇవ్వబడతాయి.
For More government schemes Click Here
INSTANT AP GOVT UPDATES
మా వాట్సాప్ ఛానెల్లో జాయిన్ అవ్వండి
AP ప్రభుత్వ పథకాలు, GSWS ఫారమ్‌లు & జాబ్ అప్డేట్స్ నోటిఫికేషన్లు పొందండి!
Join WhatsApp Channel