YSR NETANNA NESTHAM || వై యస్ ఆర్ నేతన్ననేస్తం
HOW TO APPLY YSR NETANNA NESHTAM || YSR NETANNA NESTHAM ELIGIBILITY RULES
స్వంత మగ్గం ఉన్న చేనేత కుటుంబాలకు సంవత్సరానికి రూ. 24000/- ఆర్దికసహాయం.
వై.ఎస్.ఆర్ నేతన్న నేస్తం-రెండవ విడత దరఖాస్తుల పరిశీలనకు మార్గదర్శకాలు
అప్లికేషన్ ఫారం
YSR నేతన్ననేస్తం అర్హతలు
- స్వంత మగ్గం కలిగి ఉండి దానిపై పనిచేయుచు జీవనోపాది పొందుచున్న చేనేత కార్మికులు మాత్రమే ఈ పధకానికి అర్హులు.
- కుటుంబంలో ఎన్ని చేనేత మగ్గలు ఉన్నప్పటికీ ఒక్క చేనేత మగ్గమునకు మాత్రమే ఆర్ధిక సహాయం అందించబడుతుంది.
- ఈ పధకంలో లబ్ధి పొందాలంటే సంబందిత చేనేత కుటుంబం పేదరిక రేఖకు దిగువ ఉండాలి.
- ప్రాధమిక చేనేత సంఘముల మరియు మాస్టర్ వీవర్ల షెడ్లలో పనిచేయుచున్న చేనేత కార్మిలుకులు వై యస్ ఆర్ నేతన్న నేస్తం పధకమునకు అనర్హులు.
- చేనేత అనుబంధ వృత్తులలో పనిచేయు కార్మికులు ఈ పధకము ద్వారా సహాయం పొందుటకు అనర్హులు ( ఉదా . నూలు వడుకు వారు, పడుగు తయారు చేయువారు , అద్ధకం పనివారు , అచ్చులు అతికేవారు మొదలైనవారు )
జాబితాలో పేరులేని వారు దరఖాస్తు చేసుకునే విధానము
- అర్హత కలిగిన చేనేత కార్మికులు తమ ఆధార్ కార్డు , బ్యాంక్ ఖాతా వివరాలు , కుల మరియు బియ్యం కార్డు / తెలుపు రేషన్ కార్డు నకలు పత్రములను జత చేసి ధరఖాస్తును , గ్రామ/ వార్డు సచివాలయాలలో స్వయంగా గాని లేదా గ్రామ/ వార్డు వాలంటీర్ల ద్వారగాని సమర్పించవలెను.
- అర్హులైన ధరఖాస్తు దా రునికి YSR ( Your Service Request – మీ సేవల అభ్యర్ధన ) నెంబర్ ఇవ్వబడుతుంది.
- దరఖాస్తు చేసిన లబ్ధి దారులకు నిర్ధేశించిన ప్రక్రియలు అన్నీ పూర్తి చేసి అర్హత కలిగిన వారికి సంవత్సరానికి ఒకసారి మంజూరు చేసే వై యస్ ఆర్ నేతన్న నేస్తం పధకం ద్వారా లబ్ధి చేకూర్చ బడుతుంది.
1 Comment
Comments are closed.