మనలో చాలా మంది వాట్సాప్ ఎక్కువగా ఉపయోగిస్తుంటాం. అయితే, ఇది మీకు తప్పకుండా తెలుసుకోవాల్సిన మంచి ట్రిక్. ఎందుకంటే, మనం కొన్ని సందర్భాల్లో కాంటాక్ట్ లిస్ట్‌లో లేని వారికి వాట్సాప్‌లో మెసేజ్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది. అలాంటి సమయంలో, వారి నెంబర్‌ను మొబైల్‌లో సేవ్ చేసుకోవాల్సి వస్తుంది, తర్వాత ఆ నెంబర్ మన కాంటాక్ట్ లిస్ట్‌లో అలాగే ఉంటుంది. కానీ, నిజానికి ఆ నెంబర్ మనకు అవసరం ఉండదు. అయితే, ఈ ట్రిక్ తెలుసుకుంటే, మీరు వారి నెంబర్ సేవ్ చేసుకోకుండా వాట్సాప్‌లో వారికి మెసేజ్ చేయవచ్చు.