SnehaJobs.com

GSWS Updates|| VSU Previous Papers||Study Materials||Latest Jobs

EBC నేస్తం

EBC నేస్తం

Apply online EBC Nestham // How to Apply EBC Nestham // EBC Nestham Eligibility Rules

Financial Assistance to EBC communities. 

అగ్ర వర్ణాల పేద మహిళలకు శుభవార్త  ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ “ఈబీసీ  నేస్తం” పధకం. 2021-22 సంవత్సరం కి గాను 29-09-2021 నుండి  ప్రారంభం అగును .  అగ్ర వర్ణాల లోని ఆర్థిక వెనుక బాటు కలిగిన “బ్రాహ్మణ, వైశ్య, వెలమ, క్షత్రియ, కమ్మ, రెడ్డి, ముస్లిం తదితర మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం ” ఈబీసీ నేస్తం” పధకం ద్వారా 45 సంవత్సరముల నుండి 60 సంవత్సరాల మధ్య వయస్సు లోపు మహిళలకు ప్రతీ సంవత్సరం. 15,000/- లను అందించబోతోంది,  ఈ సందర్భముగా రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ Y S జగన్ మోహన్ రెడ్డి గారికి మహిళలందరి తరఫున హృదయ పూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము  ఈ పధకము నకు కావలసినవి.
మీరు  EBC నేస్తం కి అప్లై చేయాలనుకుంటున్నారా  ఐతే వెంటనే మీ దగ్గర లోని సచివాలయాలలో ఈ క్రింది సర్టిఫికేట్ లకి అప్లై చేసుకోండి.
1. కుటుంబ సభ్యుల ఆధార్  కార్డు జిరాక్స్ లు
2. ఆధార్ హిస్టరి
2. రైస్ కార్డు జిరాక్స్
౩. బ్యాంకు బుక్ మొదటి పేజి జిరాక్స్
4. కుల ద్రువీకరణ పత్రం జిరాక్స్
5. EWS (ఎకనామికల్లి వీకర్ సెక్షన్) సర్టిఫికేట్ జిరాక్స్
లబ్ధి దారులు ఈ క్రింది అర్హతలు కలిగి ఉండవలెను  
  • ఆర్ధికంగా వెనుకబడి SC/ST/BC/Kapu/Minority కులాలు కాకుండా గతం లో YSR Cheyutha’ మరియు  “Kapu Nestham”. పధకాలలో లబ్ధిదారులు కానివారు అర్హులు
  • సొంతతంగా ఆధార్ కార్దు మరియు  బ్యంక్ అకౌంట్ కలిగి ఉండవలెను

కుటుంబ నెలసరి ఆదాయము:

గ్రామీణప్రాంతాలలోరూ. 10000/- లోపు మరియు పట్టణ   ప్రాంతాలలో రూ. 12000/- లోపు ఉన్నవారు అర్హులు.

కుటుంబ భూమి

  • మొత్తం కుటుంబానికి 3 ఎకరాల మాగాణి భూమి లేదా 10 ఎకరాల మెట్ట లేదా మాగాణి మరియు మెట్ట భూములు రెండు కలిపి 10 ఎకరాలు మించరాదు.

ప్రభుత్వ ఉద్యోగి

  • కుటుంబంలో ఏ ఒక్కరు ప్రభుత్వ ఉద్యోగి లేదా పింఛను దారుడై ఉండరాదు ( పారిశుధ్య కార్మికులు మినహాయింపు)

నాలుగు చక్రముల వాహనము 

  • కుటుంబ సభ్యులలో ఏ ఒక్కరికైన 4 వీలర్ ( నాలుగు చక్రములు ) సొంత వాహనము ఉన్నట్లైతే ( ఆటో, టాక్షీ మరియు ట్రాక్టర్ ఇందుకు మినహాయింపు) అనర్హులుగా పరిగణించవలెను.

ఆదాయపు పన్ను

  • కుటుంబాలో ఏ ఒక్కరు ఆదాయపు పన్ను చెల్లించే పరిధిలో ఉండరాదు

పట్టణ ప్రాంతాలలో నిర్మాణపు స్తలము

  • పట్టణ ప్రాంతాలలో నిర్మాణపు స్తలము 750 చదరపు అడుగులకంటే తక్కువ ఉండాలి.
వయస్సు 
25-09-2021 తేదీ నాటికి 45 సంవత్స రములు పుర్తి  చేసుకుని 60  సంవత్స రములు లోపు ఉన్న మహిలలు అర్హులు.
దయచేసి అగ్ర వర్ణాల లోని ఆర్థిక వెనుక బాటు కలిగిన మహిళలు అందరు ఈ పధకము నకు దరఖాస్తు చేసుకోగలరని మనవి   మీ దగ్గర లోని సచివాలయం లో  పైన తెలిపిన సర్టిఫికేట్ల కొరకు దరఖాస్తు చేసుకోగలరు .
Time line
Timeline: 29-09-2021          ———- ట్రైనింగ్ మరియు SOP
Timeline: 29-09-2021 to 05-10-2021   —  Door to Door volunteer survey
Timeline: 06-10-2021 to 08-10-2021  ——- Reverification for existing Beneficiaries and submit new applications
Timeline: 11-10-2021 & 12-10-2021  —– Deletion of ineligible names
Timeline: 13-10-2021 &14-10-2021  —– Preparation of the Village/Ward Secretariat wise list
Timeline: 18.10.2021 & 19.10.2021 — Submission of the final list of beneficiaries
Timeline: 20.10.2021 & 21.10.2021  — Final scrutiny at District level at Executive Director
Timeline: 25.10.2021 & 26.10.2021 —- Transfer of the financial assistance through Direct Benefit Transfer
Updated: September 27, 2021 — 8:33 pm
Disclaimer- We (snehajobs.com) provide Degree previous papers/ Jobs / Career related information gathered from various reliable sources. We have tried our best to provide accurate information about syllabus, previous paper, Study Materials, results, jobs, vsws updates, private job and other informative links. Any error or false information is not our responsibility. We are a Non-Government service provider and does not guarantee 100% accuracy. Please double-check the information from the official source/website before taking any action. All Rights Reserved

You cannot copy content of this page