6 వ తరగతి చరిత్ర

By | August 2, 2020

6th HISTORY 

  • గంగా, సింధూ మైదానంలోని అనుకూలప్రాంతాలలో వివిద తెగలు వ్యవసాయం చేస్తూ స్తిరపడ్డాయి. వీరిని సంస్కృతం లో ‘జన’ అనేవారు. స్తిరపడిన ప్రాంతాన్ని ‘జనపదం’ అని పిలుస్తారు.
  • మహా జనపదాల కాలం లో వ్యవసాయం చేసే భూ యజమానులను ‘గుహపతి’ లేదా ‘గహపతి’ అనేవారు. వారు కుటుంబ సభ్యుల తో పాటు వ్యవసాయ క్షేత్రాలలో పనిచేసేవారు. వాళ్ళు దాసులను లేదా బానిసలను కూడా పనికి ఉపయోగించేవారు. అంతేకాకుండా ‘భర్తుకా’ అనే పనివాళ్ళకు కూలి ఇచ్చి పొలం లోనూ ఇంటిలోనూ పనిచేయించుకునేవారు.
  • వ్యవసాయం చేసే గృహపతులనుండి రాజులు పన్నులు వసూలు చేసేవారు. వారు తమ పంటను ఆరుభాగాలుగా చేసి ఒక భాగాన్ని రాజుకు ఇచ్చేవారు. దీనిని ‘భాగ’ అని పిలిచేవారు.
  • ఈ మహాజన పదాల కాలం లోనే నాణేలను ఉపయోగించటం ప్రారంభమైంది.
  • మగధ రాజ్యం లోని దక్షిణ ప్రాంతం లో ఇనుపఖనిజ నిక్షేపాలు ఉండేవి వాటిని ఉపయోగించి ఆయుధాలు మొదలైనవి తయారు చేసేవారు.
  • మగధ రాజ్యానికి ఉత్తరంగా గణతంత్ర ప్రభుత్వాన్ని (గణం) కలిగిన వజ్జీ మహాజన పదం ఉండేది. రాజ్యంలో ఒకే పరిపాలకుడు కాక, ఒక పరిపాలకుల బృందం ఉండేది. కొన్ని సందర్బాలలో వేలమంది కలసి పాలన చేసేవారు. ప్రతి ఒక్కరూ తమను ‘రాజ’ అని పిలుచుకునేవారు. బుద్దుడు, మహావీరుడు గణాలకు చెందినవారు.
  • మహా జనపదాల కాలంలో యుద్దాలలో పాల్గొనే సైన్యానికి జీతాలు ఇచ్చేవారు.
  • మొదటి రాజులైన బింబిసారుడు, అజాతశత్రువు మగధను బలమైన రాజ్యంగా తీర్చి దిద్దారు. మహా పద్మ నందుడు మరొక బలమైయన రాజు ఈయన నందవంశ స్తాపకుడు.
  • మహా నందుని తరువాత కొన్ని సంవత్సరాలకు యువకుడైన మౌర్య చంద్రగుప్తుడు మగధకు రాజాయ్యాడు.. అతనే మౌర్య సమ్ర్యాజ్యాన్ని స్టాపించాడు. చంద్రగుప్తుని కొడుకు బింబి సారుడు మనువడు అశోకుడు మగధ సామ్ర్యాజ్యాన్ని విస్తరించాడు.
  • భారత ఉపఖనడం లో తొలి చక్రవర్తి చంద్రగుప్త మౌర్యుడు.
  • మౌర్య సామ్రాజ్యా కాలంలో ప్రజల దగ్గరనుంచి పన్నులు వసూలుచేయడానికి, రాజాజ్ఞను పాటించనివారిని శిక్షించడానికి అదికారులను నియమించేవారు. రాజ్యం లో జరిగే విషయాలను అదికారులు ఎలా పనిచేస్తునారు అనే సమాచారాన్ని ‘వేగులు’ రాజుకు అందించేవారు. చక్రవర్తి సందేశాలను అధికారులకు దూతలు చేరవేసేవారు.
  • చంద్రగుప్తుని మంత్రి అయిన కౌటిల్యుడు( చాణక్యుడు) ‘అర్ధశాస్త్రం’ ను ఇతని ఆస్థానంలోగల గ్రీకు రాయబారి మెగస్తనీస్ రాసిన ఇండికా ముక్యమైనవి.
  • అశోకుడు శాసనాలద్వారా వర్తమానాన్ని ప్రజలకు చేరవేసిన మొట్టమొదటి రాజు. అశోకుని శాసనాలు చాలావరకు ‘ప్రాకృత భాషలో’ ‘బ్రాహ్మీలిపిలో ‘ ఉన్నాయి.
  • చక్రవర్తి అయిన 8 సంవత్సరాలకు అశోకుడు కళింగను ( ఒడిసా) ను జయించాడు. ఈ యుద్దం లో లక్షా ఎబైవేలమంది బందీలయ్యారు. లక్షకు పైగా బందీలయ్యారు. లక్షకు పైగా సైనికులు చనిపోయారు.
  • అశోకుడు ‘ధర్మ యాత్రులు’ అనే అధికారులను నియమించాడు. వారు రాజ్యం లోని వివిధ ప్రాంతాలకు వెళ్ళి ధర్మ ప్రచారం చేసేవారు.
  • కృష్ణా నాడీ తీరంలో నాగార్జున కొండకు దగ్గరలోని ‘విజయపురి’ ని రాజధానిగా చేసుకొని ఇక్ష్వాకులు సామ్రాజ్యాన్ని నెలకొల్పారు.