SnehaJobs.com

GSWS Updates|| VSU Previous Papers||Study Materials||Latest Jobs

6 వ తరగతి పౌరశాస్త్రం

6th  పౌరశాస్త్రం

  • ప్రజాస్వామ్య బద్ధంగా నిర్వహించటానికి ప్రతిగ్రామంలో ‘గ్రామసభను ‘ ఏర్పాటు చేయడం జరిగింది . గ్రామసభలో గ్రామ ఓటర్లు అందరూ సభ్యులుగా ఉంటారు.
  • ప్రతి గ్రామ పంచాయతీకి 5 నుంచి 21 మండి వరకు వార్డు సభ్యులు ఉంటారు. 21 సంవత్సరాలు నిండినవారు గ్రామ పంచాయితీ ఎన్నికలలో పోటీ చేయవచ్చు.
  • పార్లమెంట్ స్త్రీలకు స్టానిక సంస్థలలో 1/3 వంతు స్థానాలను కేటాయించింది.
  • సర్పంచ్ గ్రామ పంచాయితీకి పెద్ద, ప్రధమ పౌరుడు. గ్రామ పంచాయియితీకి వచ్చే ఆదాయ, వ్యయాలకు సర్పంచే భాద్యత వహిస్తారు.
  • గ్రామపంచాయితీ సమావేశం ప్రతినెలకు ఒకసారి జరుగుతుంది. ప్రతి సమావేశానికి కనీసం సగం మంది సభ్యులు హాజరు కావాలి. అలా జరగని పక్షంలో సమావేశం రద్దు చేయడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం ఏప్రిల్ నేలకంటే ముందు వచ్చే ఆర్ధిక సంవత్సరానికి అవసరమైన బడ్జెట్ ని తయారు చేసుకుంటారు. ఈ ఈ బడ్జెట్ ప్రతిపాదన మండల, జిల్లా పరిషత్తులకు వారి ఆమోదం పంపిస్తారు. నిధులు విడుదలైన తరువాత సర్పంచ్ పనులు చేయిస్తు పర్యవేక్షణ చేస్తాడు.
  • గ్రామ పంచాయితీకి సుమారుగా 1/3 వంతు ఆదాయం పన్నులవలన సమకూరుతుంది. కొన్ని గ్రామపంచాయితీలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చే నిధులపైన ఎక్కువగా ఆదారపడి ఉన్నాయి. కొన్ని నిధులను మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపధీ హామీ చట్టం ద్వారా సమకూర్చుకుంటుంది.
  • ప్రతి మండలం లో దాదాపుగా 20 గ్రామపంచాయితీలు ఉంటాయి. జిల్లాలో ఉన్న అన్నీ మండల పరిషత్తులు జిల్లా పరిషత్ ఆద్వర్యంలో పనిచేస్తాయి. మండల పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గ (MPTC) సభ్యులను ప్రజలు ఎన్నుకుంటారు. అలాగే జిల్లా పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గ ( ZPTC) సభ్యులను కూడా ఎన్నికల ప్రక్రియద్వారా ఎన్నుకుంటారు.
  • రాష్ట్ర ప్రభుత్వం అభివృద్దిచెందిన గ్రామపంచాయితీకి ‘శుభ్రం’ అవార్డును ఇస్తుంది. కేంద్రప్రభుత్వం నిర్మల గ్రామపురస్కారం ఇస్తుంది.
  • జనాభాను దృష్టిలో పెట్టుకుని మనకు మూడు రకాల పురపాలక సంస్థలు ఉన్నాయి.

నగర పంచాయితీ –  20,000 – 40,000

మున్సిపల్ కౌన్సిల్ – 40,000 – 3,00,000

మున్సిపల్ కార్పొరేషన్  – మూడు లక్షల పైన జనాభా

  • గ్రామపంచాయితీ లాగానే పురపాలక సంస్థలు కూడా ఎన్నికల ద్వారానే ఏర్పాటవుతాయి. నగర ప్రాంతాలనుకూడా వార్డులుగా విభజిస్తారు. వార్డులకు ప్రతినిధులను ప్రజలు ఎన్నుకుంటారు. ఈ ప్రతినిధులను పురపాలక సంస్థలో కౌన్సిలర్ అని, కార్పొరేషన్ లో కార్పొరేటర్ అని పిలుస్తారు. వార్డు కౌన్సిలర్ల తోపాటు ఛైర్మన్ / మేయర్ ఈ సంస్థలకు పెద్దగా వ్యవహరిస్తారు.
  • ఆంధ్రప్రదేశ్ లో మొదటి పురపాలక సంఘం భీముని పట్టణ పురపాలక సంఘం. దీనినే భీమిలి అనికూడా పిలుస్తారు. ఇది విశాఖ జిల్లాలో ఉంది. దీనిని 1861 లో స్థాపించారు. ఇది 2011 లో 150 వ వార్షికోత్శవమ్ జరుపుకొన్నది. ఇది భారత దేశం లో గల పురాతన పురపాలక సంఘాలలో ఒకటి.
  • భారతదేశం లో లింగ నిష్పత్తి (2011) – 1000 : 940
  • ఆంధ్రప్రదేశ్ లో లింగ నిష్పత్తి (2011) -1000 : 992
  • ఆంధ్రప్రదేశ్ పురుషుల అక్ష్యరాశ్యత (2011) – 76%
  • ఆంధ్రప్రదేశ్ స్త్రీల అక్ష్యరాస్యత (2011) – 60%
  • వారసత్వంగా వచ్చే ఆస్తిలో లింగ వివక్ష లేకుండా స్త్రీలకు సమాన హక్కులను కల్పించడం లో ఆంధ్రప్రదేశ్ మొదటి స్టానంలో ఉంది .
  • క్రీ.శ. 12 వ శతాబ్ధం నాటి తమిళ ‘పెరియపురాణం’ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చిత్తూరు జిల్లాలోని శ్రీ కాళహస్తి ప్రాంతం లో నివసించిన వేట సేకరణ ఆధారిత సమాజం వాళ్ళ జీవన శైలిని , మత విశ్వశాలను గురించి వివరిస్తుంది. ‘భక్త కన్నప్ప’ కధ ఈ పురాణంలో తెలుపబడినది. ఈ యన తెలుగువారికి సుపరిచితుడు.
  • ప్రాచీనా కాలం లో గిరిజన ప్రాంత ప్రజలు అమ్మ తల్లి లేదా ‘నెలతల్లి’ ని ఆరాధించేవారు. పశువులు, పంటలు సమృద్దిగా విలసిల్లలంటే అమ్మతల్లి అనుగ్రహం ఆవశ్యకమని వీళ్ళు భావిస్తారు.
  • సింధులోయ నాగరికత ప్రజలు రావిచెట్టును పవిత్రంగా భావించేవాళ్లు.
  • వేధాలు భారత ఉపఖండంలోని మొట్టమొదటి సాహిత్యం , వేదాలు నాలుగు అవి. ఋగ్వేదం, సామవేదం, యజుర్వేదం , అధర్వణవేదం. వీటిలో ఋగ్వేదం అతి ప్రాచీనమైనది. వేదాలలో దేవతలు కీర్తించే మంత్రాలు, సంక్షేమం కోసం చేసే పార్ధనలు ఉన్నాయి. వీటిని ఋషులు సంకలనం చేశారు. దేవతలలో ముఖ్యమైన వారు అగ్ని, ఇంద్రుడు ( యుద్ద దేవత ) సోమలత ( ఒక ప్రత్యేక పానీయంచేయడానికి వాడే తీగ మొక్క.
  • ఋగ్వేదం లో పశువులకోసం, సంతానం కోసం ( మగసంతానం), ఆశ్వాలకోసం చాలా ప్రార్ధనలున్నాయి.
  • బుద్ధుని అతని అనుయాముల భోధనలను ‘త్రిపీటకాలు’ అనే పేరుతో సంకలనం చేశారు. అవి వినయ,సుత్త, అభిదమ్మ అనే మూడు పీటకాలుగా పిలువబడినవి.
  • భాగవతులు విష్ట్నువునే ‘పరమాత్మ’ అనీ విశ్వాన్ని సృస్ట్టించిన వాడని అతిశక్తివంతుడని, అన్ని తెలిసినవాడని విశ్వసిస్తారు.
  • బుద్ధుని కధలను ‘జాతక కధలు’ గాను శివుని లేదా విష్ట్నువు కధలను ‘పురాణాలు’ అనేపేరుతోను రాశారు.
  • 12 మంది ప్రధానమైన విష్త్ను భక్తులను ఆళ్వార్లు అంటారు. పెరియాళ్వారు, నమ్మాళ్వారు వాళ్ళలో ముఖ్యులు. పెరియాళ్వారు కుమార్తె అయిన ఆండాళ్ ఆళ్వార్లలోని ఒకే ఒక మహిళ. వీరిలో చాలామంది అనేక వైశ్ట్నవాలయాలను సందర్శించి పద్యమాలికలను అల్లి , పాడారు. వాటినే పాశురాలు అంటారు.
  • నాయనార్లు దాదాపు 63 మంది ఉన్నారు. వీరంతా శివభాక్తులే. వీళ్ళు వివిధ కులాలలో పుట్టినవారు. వీరిలో కన్నప్ప లాంటి వేటగాళ్ళునందనర్ లాంటి నిమ్న కులాలవారు ఉన్నారు. అప్పర్, సంబందర్ , సుందర్, మాణిక్యవాచకర్ లాంటి వారు ఒక ఆలయం నుంచి మరొక ఆలయానికి వెళ్ళి అక్కడ శివుణ్ణి గురించి కీర్తనలు పాడేవారు. వీరిలో కరైక్కాలమ్మ, అవ్వయ్యర్ అనే ఇదరు మహిళలు కూడా ఉన్నారు.
  • ఏసుక్రీస్తు ఇజ్రాయెల్ లోని జెరుసలెం కి దగ్గరలోగల బెత్లెహమ్ లో జన్మించాడు. సెయింట్ థామస్ ఏసుక్రీస్తు అను యాయుడు, రోమాను వర్తకులతో కలసి భారత దేశానికి ఏసుబొదనలను తీసుకొని వచ్చాడు. ఈ యన క్రైస్తవమతాన్ని ధక్షిణ భారతదేశంలో ప్రచారం చేశాడు.
  • మహ్మద్ ప్రవక్త అరేబియాలోని మక్కాలో క్రీ.శ. 570 లో జన్మించాడు. ఈయన ఇస్లాం మతాన్ని స్థాపించాడు.
  • భారతదేశానికి నౌకావాణిజ్యం కోసం వచ్చిన అరబ్ వర్తకులు ఇస్లాం మతాన్ని మనదేశంలో వ్యాపింపజేశారు.
  • కేరళలోని చెర్మన్ మశీదు భార్తదేశంలోని మొట్టమొదటిది గా నిర్మింపబడినది గా నమ్ముతారు.
  • భారత కాలమానం 1947 సెప్టెంబర్ 1 నా ఏర్పాటైంది. ఉత్తరప్రదేశ్ లోని మీర్జాపూర్ కు చేరువగా వెళ్ళే 82.50 తూర్పు రేఖాంశానికి అనుగుణంగా దీన్ని నిర్ణయించారు. ఈ రేఖ మన రాష్ట్రం లో కాకినాడ నగరం గుండా పోతుంది.
  • తెలుగు, తమిళ, కన్నడ , మలయాళ గోండు భాషలు ద్రావిడ భాషా కుటుంబంలోనివి.
  • సింధులోయ ప్రజలు బొమ్మల లిపినే వాడారు. కానీ మనకి ఇంతవరకు అవి చదవడం తెలియదు.
  • భారతదేశం లో వాడుతున్న అనేక లీపులకు మూలం అశోకుడు ఉపయోగించిన బ్రాంహీలిపి. ఆంధ్రప్రదేశ్ లోని కృస్త్నా జిల్లాలోని భట్టిప్రోలు లో స్తూపం వున్న శాసనం సుమారు క్రీ.పూ. 200సం|| నాటికి చెందినది. ఈ శాసనం ఈ లీ గురించి తెలుపుతున్నది.
  • ఉత్తర భారతదేశంలో హిమాలయలలో పెరిగే భూర్జ పత్రాలనే చెట్ల బెరడు పొరలను కాగితం లాగా ఉపయోగించి రాసేవారు.
  • ఈ విశ్వం ఎలా ప్రారంబమైనదో ఋగ్వేదంలో ఆసక్తికరమైన మంత్రం కలదు.
  • వాల్మీకి మహర్షి సంస్కృతంలో రచించిన రామాయణాన్ని ఆది కావ్యం గా పరిగణిస్తారు.
  • ప్రపంచం లో కెల్లా ఎక్కువ పద్యాలు కలిగిన మరియు వందల్కోడ్డి చిన్న చిన్న కధలు కలిగిన కావ్యంగా మహాభారతాన్ని చెప్పవచ్చు. మహాభారతాన్ని వ్యాసమహర్షి సంస్కృతంలో రచించాడు.
  • చరక సంహిత , శుశ్రూతసంహిత గ్రంధాలు శస్త్ర చికిత్శాలను గురించి తెలుపుతాయి. ఈ గ్రంధాలు ఆయుర్వేద వైధ్య విదానానికి ఆది గ్రంధాలని చెప్పవచ్చు.
  • ఆర్యభట్ట “ఆర్యభట్టీయం” అనే పుస్తకాన్ని రచించడం జరిగింది. భూ బ్రమణం వల్ల రాత్రి పగలు ఏర్పడుతున్నాయని, సూర్యుడు భూమిచుట్టు తిరగడం లేదని చెప్పడం జరిగింది. గణితం లో దశాంశ పద్ధతిని, స్థానపు విలువను, సంఖ్యమనాన్ని కనుక్కొన్నాడు.
  • సంగమ వాజ్మయం అంటే అనేకమంది కవులు, కవయిత్రులు పండితులు రాసిన పద్యాలు అని అర్ధం.
  • బుధుడు మొదటిసారిగా సారనాద్ లో బోధించాడు. సారనాధ్ లోని సింహా శిఖరం ను అశోకుడు స్టాపించాడు. రాజసం ఉట్టిపడే ఈ నాలుగు సింహాల తలలు నాలుగు దిక్కులను సూచిస్తూ ‘ధర్మ చక్రాన్ని “ చూపిస్తున్నాయి.
  • హ్యూయన్ త్సాంగ్ ( చైనా యాత్రికుడు) ఆ నాటి ప్రఖ్యాత బౌద్ధ సన్యాసుల విద్యా పీటమైన నలందా ( బీహార్) లో విద్య నభ్యసిస్తూ కాలం గడిపారు.
Updated: August 2, 2020 — 10:05 pm
Disclaimer- We (snehajobs.com) provide Degree previous papers/ Jobs / Career related information gathered from various reliable sources. We have tried our best to provide accurate information about syllabus, previous paper, Study Materials, results, jobs, vsws updates, private job and other informative links. Any error or false information is not our responsibility. We are a Non-Government service provider and does not guarantee 100% accuracy. Please double-check the information from the official source/website before taking any action. All Rights Reserved

You cannot copy content of this page