వై యస్ ఆర్ నేతన్ననేస్తం 

YSR NETANNA NESTHAM || వై యస్ ఆర్ నేతన్ననేస్తం

HOW TO APPLY YSR NETANNA NESHTAM || YSR NETANNA NESTHAM ELIGIBILITY RULES

స్వంత మగ్గం ఉన్న చేనేత కుటుంబాలకు సంవత్సరానికి రూ. 24000/- ఆర్దికసహాయం.

YSR నేతన్ననేస్తం అర్హతలు

  • స్వంత మగ్గం కలిగి ఉండి దానిపై పనిచేయుచు జీవనోపాది పొందుచున్న చేనేత కార్మికులు మాత్రమే ఈ పధకానికి అర్హులు.
  • కుటుంబంలో ఎన్ని చేనేత మగ్గలు ఉన్నప్పటికీ ఒక్క చేనేత మగ్గమునకు మాత్రమే ఆర్ధిక సహాయం అందించబడుతుంది.
  • ఈ పధకంలో లబ్ధి పొందాలంటే సంబందిత చేనేత కుటుంబం పేదరిక రేఖకు దిగువ ఉండాలి.
  • ప్రాధమిక చేనేత సంఘముల మరియు మాస్టర్ వీవర్ల షెడ్లలో పనిచేయుచున్న చేనేత కార్మిలుకులు వై యస్ ఆర్ నేతన్న నేస్తం పధకమునకు అనర్హులు.
  • చేనేత అనుబంధ వృత్తులలో పనిచేయు కార్మికులు ఈ పధకము ద్వారా సహాయం పొందుటకు అనర్హులు ( ఉదా . నూలు వడుకు వారు, పడుగు తయారు చేయువారు , అద్ధకం పనివారు , అచ్చులు అతికేవారు మొదలైనవారు )

జాబితాలో పేరులేని వారు దరఖాస్తు చేసుకునే విధానము

  • అర్హత కలిగిన చేనేత కార్మికులు తమ ఆధార్ కార్డు , బ్యాంక్ ఖాతా వివరాలు , కుల మరియు బియ్యం కార్డు / తెలుపు రేషన్ కార్డు నకలు పత్రములను జత చేసి ధరఖాస్తును , గ్రామ/ వార్డు సచివాలయాలలో స్వయంగా గాని లేదా గ్రామ/ వార్డు వాలంటీర్ల ద్వారగాని సమర్పించవలెను.
  • అర్హులైన ధరఖాస్తు దా రునికి  YSR ( Your Service Request – మీ సేవల అభ్యర్ధన ) నెంబర్ ఇవ్వబడుతుంది.
  • దరఖాస్తు చేసిన లబ్ధి దారులకు నిర్ధేశించిన ప్రక్రియలు అన్నీ పూర్తి చేసి అర్హత కలిగిన వారికి సంవత్సరానికి ఒకసారి మంజూరు చేసే వై యస్ ఆర్ నేతన్న నేస్తం పధకం ద్వారా లబ్ధి చేకూర్చ బడుతుంది.

FOR MORE GOVERNMENT SCHEMES CLICK HERE

CLICK HERE FOR OFFICIAL SITE

Updated: August 2, 2020 — 5:39 pm
SnehaJobs.com © 2022 All Rights Reserved
You cannot copy content of this page