Site icon SnehaJobs.com

వై ఎస్ ఆర్ కాపు నేస్తం

వై ఎస్ ఆర్ కాపు నేస్తం

  1. పథకానికి సంబంధించిన వివరాలు: కాపు, బలిజ, తెలగ, ఒంటరి మహిళలను ఆర్ధికంగా బలోపేతం చేయటానికి అవసరమైన జీవనోపాధి అవకాశాలను మరియు జీవన ప్రమాణాలను పెంపొందించడానికి వీలుగా ఐదేళ్ల కాలంలో రూ. 75,000/- (సంవత్సరానికి రూ. 15,000/-లు చొప్పున) ఆర్ధిక సహాయం అందించడం ఈ పథకం యొక్క లక్ష్యం.  45 నుంచి 60 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన మహిళలు మాత్రమే అర్హులు.

2. పథకం అమలుకు బాధ్యత వహించే ఉద్యోగి:

సంక్షేమ మరియు విద్యా సహాయకులు (గ్రామీణ ప్రాంతాలు)

వార్డు సంక్షేమ & అభివృద్ధి కార్యదర్శి (పట్టణ ప్రాంతాలు)

3. అర్హతా ప్రమాణాలు: ఈ పథకం క్రింద ఆర్ధిక సహాయం పొందడానికి లబ్ధిదారులు ఈ క్రింద తెల్పిన అర్హతా ప్రమాణాలను కలిగి ఉండాలి.

వ.నెం.ప్రమాణంనిబంధనలు
 1మొత్తం కుటుంబ ఆదాయంగ్రామీణ ప్రాంతాలు –నెలకు రూ. 10,000/-ల లోపుపట్టణ ప్రాంతాలు –నెలకు రూ. 12,000/-ల లోపు ఉండాలి.  
 2మొత్తం కుటుంబానికి గల భూమిలబ్ధిదారులు ఎ. 3.00ల కంటే తక్కువ మాగాణి లేదా ఎ. 10.00ల కంటే తక్కువ మెట్ట లేదా రెండూ కలిపి గరిష్టంగా ఎ. 10.00లు లోపు ఉన్నవారు మాత్రమే అర్హులు
 3ప్రభుత్వ ఉద్యోగి/ ఫించనుదారుకుటుంబంలోని ఏ వ్యక్తి ప్రభుత్వ ఉద్యోగి లేదా ఫించనుదారు అయి ఉండరాదు. ఈ షరతు నుండి పారిశుద్ధ్య ఉద్యోగుల కుటుంబాలు మినహాయించబడినవి.
 4నాలుగు చక్రాల వాహనంలబ్ధిదారు కుటుంబం నాలుగు చక్రాల వాహనం కలిగి ఉండకూడదు. (టాక్సీలు, ట్రాక్టర్లు, ఆటోలు ఈ షరతు నుండి మినహాయించబడినవి).
 5విద్యుత్ వినియోగంగడచిన 12 నెలలలోకుటుంబంయొక్కవిద్యుత్తువినియోగంనెలకుసరాసరి 300 యూనిట్లుమించరాదు.
 6ఆదాయపు పన్నుఆదాయపు పన్ను చెల్లిస్తున్నవారు ఈ పథకానికి అనర్హులు  
 7పట్టణాల్లో ఆస్తిమున్సిపాలిటీ పరిధిలో 1000 చ.అల కంటే తక్కువ నిర్మిత ప్రాంతం (నివాస లేదా వాణిజ్య)ఉన్నవారు(పట్టణ ప్రాంతాలకు మాత్రమే వర్తిస్తుంది)  
 8వయస్సు& లింగంఈస్కీమ్ప్రభుత్వఉత్తర్వుజారిచేసినతేదీనాటికి 45-60 సంవత్సరాలవయస్సుగలమహిళలు.
పుట్టిన తేదీ ఆధారంఆధార్ కార్డ్ ప్రకారం
 10కేటగిరీతప్పనిసరిగా కాపు కులానికి చెందిన వారై ఉండాలి (కాపు,బలిజ, తెలగ మరియు ఒంటరి కులాలు)

4. పథకం అమలు విధానం:

5. తక్షణ అప్పీలేట్ అథారిటీ

మండల పరిషత్ అభివృద్ధి అధికారి

మున్సిపల్ కమీషనర్

6. సంబంధిత ప్రభుత్వ ఉత్తర్వులు

వ.నెంవివరణఉత్తర్వుల నెం.
1.వై ఎస్ ఆర్ కాపు నేస్తం పథకం ప్రభుత్వ ఉత్తర్వులుజి.ఓ.ఎం.ఎస్.నెం. 4, తేదీ: 28-01-2020

7.ప్రభుత్వ ఉత్తర్వులసవరణ వివరాలు

సవరణ నెం. సవరణ తేదీ సవరణ వివరాలు
1.వైఎస్ఆర్కాపునేస్తంపథకంప్రభుత్వఉత్తర్వులుమెమోనెంబరు: 1594916 తేదీ: 30-12-2021

# సాంకేతిక సమస్యలకు సంప్రదించవలసిన వారు

లబ్ధిదారులు లేదా పౌరులు సంప్రదించవలసిన హెల్ప్ డెస్క్ నెంబరు:1902

ఫిర్యాదులను apkwdc@gmail.com అనే ఈ మెయిల్ అడ్రస్ కు పంపవచ్చు.

Click Here For Check Your Eligibility

For More Schemes Click Here

Exit mobile version