Site icon SnehaJobs.com

New Rice cards in AP

New Rice cards in AP : బియ్యం కార్డు  

How to check New Rice card Number with Old Ration card number

మీ ఆధార్ నంబరుతో కొత్త రైస్ కార్డు వివరాలు
మీ  కొత్త రైస్ కార్డ్ నెంబర్ మరియు స్టేటస్ తెలుసుకోండి
రైస్ కార్డు స్టేటస్ 
మీ కొత్త రైస్ కార్డ్ కి రైస్ వచ్చాయా లేదా ఎలా తెలుసుకోవాలి
రైస్ కార్డు కొత్త రూల్స్ 

ఆంద్రప్రదేశ్ ప్రభుత్వ పౌర సరఫరాల శాఖ వారిచే ఇవ్వబడిన బియ్యం కార్డు పొందిన ప్రతి కుటుంబానికి అభినందనలు   తెలియజేస్తూ ….. నిరుపేదలు ఎవ్వరూ ఆకలి కడుపుతో ఉండ కూడాదనే మా నాన్నా గారైన దివంగత ముఖ్యమంత్రిశ్రీ డా. వై .ఎస్ .రాజశేఖర్ రెడ్డి గారి ఆశయం మేరకు అర్హులైన పేదలందరికి నాణ్యమైన బియ్యాన్ని అందించాలనే మంచి ఉద్దేశ్యంతో ఎంతో కాలంగా ఉన్న అర్హత ప్రమాణాల పరిమితిని మరింత పెంచుతూ గ్రామ సభలలో సామాజిక తనిఖీ నిర్వహించుట ద్వారా అత్యంత పారదర్శకంగా అర్హులైన లబ్ధిదారులను ఎంపిక చేసి వారి జీవితాలలో ఆకలిని దూరం చేసి ఆనందాన్ని చేరువ చేసేలా ఈ కార్యక్రమం రూపొందించడం జరిగింది.

ఈ కార్యక్రమంలో భాగంగా బియ్యం కార్డు పొందిన పేదలందరికి తినగలిగే ,నాణ్యమైన మంచి బియ్యాన్ని మన గ్రామ/వార్డు వాలంటీర్ల ద్వారా మీ ఇంటి వద్దకే అందించడం జరుగుతుంది. దీని వల్ల మీరు ఇంతకు ముందులాగా మీ పనులకు ఆటంకం లేకుండ, రేషన్ షాప్ వద్ద వేచి ఉంటూ మీ విలువైన సమయాన్ని వృధా చేసుకోవలసిన అవసరం లేదు.

అంతే కాకుండా ఇక మీదట బియ్యం కార్డునకు సంభందించి ఏ విధమైన సేవలనైనను మీ ఇంటి వద్ద నుంచే వాలంటీర్ల సహాయంతో పొందే విధంగా మన గ్రామ/వార్డు సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేసి మీకు అంధుబాటులోకి తీసుకురావడం జరిగింది. ఎవరైనా అర్హులై ఉంది ఇంకనూ బియ్యం కార్డు పొందలేకపోయినప్పటికీ, మీ గ్రామ/వార్డు   సచివాలయం నందు దరఖాస్తు చేసిన కేవలం 10 రోజులలో మీరు రేషన్ కార్డు పొందే విధంగా ఏర్పాటు చేయుట జరిగినది.

Member Addition in Rice card Application form

New Rice Card Application form

Rice Card Member Deletion Application form

Rice Card Splitting Application form

Rice Card Surrendor Application form

ఈ బియ్యం కార్డులు చినిగిపోకుండా, తడిచినప్పటికి పాడవకుండా మరియు ఎన్ని సంవత్సరాలైనా భద్రంగా ఉండే విధంగా రూపొందించడం జరిగింది. అంతే కాకుండా ఇందులో ఇచ్చిన క్యు.ఆర్ (QR) కోడ్ సహాయంతో ఈ బియ్యం కార్డు యొక్క నకలును మీ మొబైల్ ఫోన్ లో భద్రపరచుకునే వీలును కూడా పొందుపరచడం జరిగింది.

ఈ బియ్యం కార్డును మీకు అందించి మీ జీవితాలలో ఆకలిని దూరం చేసి ఆనందాన్ని చేరువ చేస్తునందుకు నాకు ఎ0తో సంతోషంగా, తృప్తిగా ఉంది. ఈ బియ్యం కార్డు అందుకుంటున్న మీకు మరొకసారి నా హృదయపూర్వక అభినందనలు.

How to check New Rice card Number with Old Ration card number

పాత రేషన్ కార్డు నెంబర్ తో క్రొత్త రైస్ కార్డు ఎలా తెలుసుకొనగలం?

STEP 1

ఈ క్రింది లింక్ క్లిక్ చేయుము.

To Know my rice card

STEP 2

ఆ వెబ్సైట్ ఓపెన్ అవ్వగానే… పైన MIS అనే ఆప్షన్ ని క్లిక్ చేయండి (HOME బటన్ పక్కన ఉంటాది)

STEP 3️

మీకు వరుసగా కొన్ని ఆప్షన్స్ కనిపిస్తాయి అందులో Ration card/Rice card search అనే ఆప్షన్ క్లిక్ చేయాలి.

STEP 4️

అందులో పాత రేషన్ కార్డు నెంబర్ నమోదు చేసి సబ్మిట్ చేస్తే దాని క్రొత్త రైస్ కార్డు నెంబర్ చూపుతుంది.

Exit mobile version