Site icon SnehaJobs.com

జగనన్న చేదోడు

జగనన్న చేదోడు

  1. పథకానికి సంబంధించిన వివరాలు:

ఇది రాష్ట్రంలోని టైలర్లు (అన్ని కమ్యూనిటీలు), రజకులు (వాషర్‌మెన్‌లు) మరియు నాయీ బ్రాహ్మణుల (బార్బర్‌లు) కోసం మొదలు  పెట్టిన పథకం ఇది. 5 సంవత్సరాల పాటు సంవత్సరానికి రూ.10 వేల చొప్పున అందిస్తారు. మొత్తం సొమ్మును ఐదు వాయిదాలలో (రూ.50,000/-) చెల్లిస్తారు.  లబ్ధిదారులు తమ ఆదాయ వనరులు మరియు వృత్తి నైపుణ్యాన్ని పెంచుకోవడానికి సాధనాలు, పరికరాలు మరియు ఇతర అవసరమైన వస్తువులను కొనుగోలు చేయడానికి ఈ పధకం ఉపయోగ పడుతుంది.

2.పథకం అమలుకు బాధ్యత వహించే ఉద్యోగి:

     సంక్షేమ & విద్యా సహాయకులు/ వార్డు సంక్షేమ & అభివృద్ధి కార్యదర్శి

3. అర్హతా ప్రమాణాలు:

ఈ పథకం క్రింద ఆర్ధిక సహాయం పొందడానికి లబ్ధిదారులు ఈ క్రింద తెల్పిన అర్హతా ప్రమాణాలను కలిగి ఉండాలి.

వ.నెం.ప్రమాణంనిబంధనలు
 1వృత్తిరాష్ట్రంలోని రజకులు/ ధోబీలు (వాషర్ మెన్ – చాకలివారు)స్వంత సెలూన్ కలిగిన మంగలి వారు (నాయీ బ్రాహ్మలు – బార్బర్లు)కాపు,వెనుకబడినతరగతులు (BC),ఆర్ధికంగావెనుకబడినతరగతులకుచెందినదర్జీలు(టైలర్లు)(అన్ని కమ్యూనిటీలు), ఈ పధకం ఆశించే లబ్ధిదారులకు తప్పనిసరిగావారి షాపులు -షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్‌మెంట్ యాక్ట్క్రింద రిజిస్టర్ చేయబడి ఉండాలి.
 2మొత్తం కుటుంబ ఆదాయంగ్రామీణ ప్రాంతాలు – నెలకు రూ. 10,000/-ల లోపుపట్టణ ప్రాంతాలు – నెలకు రూ. 12,000/-ల లోపు ఉండాలి.  
 3మొత్తం కుటుంబానికి గల భూమిలబ్ధిదారులు3 ఎకరాల కంటే తక్కువ మాగాణి లేదా 10 ఎకరాల కంటే తక్కువ మెట్ట లేదా రెండూ కలిపి గరిష్టంగా 10 ఎకరాల లోపు ఉన్నవారు మాత్రమే అర్హులు
 4ప్రభుత్వ ఉద్యోగి/ ఫించనుదారుకుటుంబంలోని ఏ వ్యక్తి ప్రభుత్వ ఉద్యోగి లేదా ఫించనుదారు అయి ఉండరాదు. ఈ షరతు నుండి పారిశుద్ధ్య కార్మికుల కుటుంబాలు మినహాయించబడినవి.
 5నాలుగు చక్రాల వాహనంలబ్ధిదారు కుటుంబం నాలుగు చక్రాల వాహనం కలిగి ఉండకూడదు. (టాక్సీలు, ట్రాక్టర్లు, ఆటోలు ఈ షరతు నుండి మినహాయించబడినవి).
 6విద్యుత్ వినియోగంగడచిన 12 నెలలలో కుటుంబం యొక్కవిద్యుత్తు వినియోగం  నెలకు సరాసరి 300 యూనిట్లు మించరాదు
 7ఆదాయపు పన్నుఆదాయపు పన్ను చెల్లిస్తున్నవారు ఈ పథకానికి అనర్హులు  
 8 పట్టణాల్లో  ఆస్తిఎటువంటి ఆస్తి లేని లేదా పట్టణ ప్రాంతాలలో 1000 చ.అల స్థలం (నివాస లేదా వాణిజ్య) కంటే తక్కువ కలిగిన కుటుంబాలు అర్హులు(పట్టణ ప్రాంతాలకు మాత్రమే వర్తిస్తుంది)  
 9పుట్టిన తేదీ ఆధారంసమీకృత ధృవీకరణపత్రం (కులము, జనన తేదీ మరియు స్థానికత కలిగియున్నది)ఆధార్ కార్డ్ ప్రకారం
 10కుల ధృవీకరణ పత్రం & బ్యాంకు ఖాతా వివరాలులబ్ధిదారులు చెల్లుబాటయ్యే కుల ధృవీకరణ పత్రాన్ని మరియు ఆర్ధిక సహాయాన్ని జమ చేసేందుకు ఏదైనా షెడ్యూల్డ్ వాణిజ్య బ్యాంకులో తమ పేరుపై ఉన్న ఖాతా, ఆధార్ మరియు NPCIఖాతా వివరాలను ఇవ్వాలి.

4. పథకం అమలు విధానం:

5. తక్షణ అప్పీలేట్ అథారిటీ

మండల పరిషత్ అభివృద్ధి అధికారి

మున్సిపల్ కమీషనర్

6. సంబంధిత ప్రభుత్వ ఉత్తర్వులు

వ.నెంవివరణఉత్తర్వుల నెం.
1.జగనన్న చేదోడు ప్రభుత్వ ఉత్తర్వులుమెమో నెం. 2030/BCW/c/2021తేదీ. 24.09.2021

# సాంకేతిక సమస్యలకు సంప్రదించవలసిన వారు

ఫిర్యాదు చేయుటకు లబ్ధిదారులు లేదా పౌరులు సంప్రదించవలసిన టోల్ ఫ్రీ నెంబర్లు:1902, (లేదా) https://navasakam2.apfss.in అనే వెబ్ సైట్ ను సందర్శించవచ్చు.

Check Your Eligibility

Click Here For More Schemes

Exit mobile version