Site icon SnehaJobs.com

Citizen Outreach Campaign

Citizen Outreach Campaign

గ్రామ వార్డు సచివాలయాల ద్వారా అందుతున్నటువంటి ప్రభుత్వ పథకాలు మరియు సేవలపై ప్రజల అందరి అభిప్రాయాలను తెలుసుకోవాలని సిటిజన్ ఔట్రీచ్ అనే ప్రోగ్రాం ను మొదలు పెట్టింది. అందులో భాగంగా ప్రతి గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది వాలంటీర్ల తో వారి సచివాలయం పరిధిలో కి వెళ్లి సిటిజెన్ అవుట్ రీచ్ సర్వే చేయాలి.

దేశంలో ఇప్పటి వరకు ఎక్కడా లేని విధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రామ, వార్డు సచివాలయాల వ్యవస్థను తెచ్చింది. అవినీతికి కానీ, వివక్షతకు కానీ తావు ఇవ్వకూడదని, పరిపాలన అన్నది ప్రజలకు చేరువ కావాలన్న ప్రధాన ఉద్దేశంతో రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారు ఈ సచివాలయ వ్యవస్థకు శ్రీకారం చుట్టారు. గ్రామ,వార్డు సచివాలయాల్లో దాదాపు 35 ప్రభుత్వ శాఖలకు సంబంధించి 540 సేవలు అందుబాటులో ఉంటాయి.

సర్వే పేరు : సిటిజెన్ మరియు బెనిఫిషరీ ఔట్రీచ్ ప్రోగ్రాం

ముఖ్య ఉద్దేశ్యంఈ ప్రోగ్రాం యొక్క ముఖ్య ఉద్దేశ్యం సచివాలయం పరిధిలోని ప్రతి ఇంటిని పరిచయం చేసుకోవడం
ఎవరు చేయాలి ప్రతి గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగి మరియు 2-3 వాలంటీర్లు ఒక టీంగా చేయాలి. ప్రతి 10 ఇండ్లకు                                        ఒకసారి ఉద్యోగి యొక్క బయోమెట్రిక్ తప్పనిసరి. కావున వాలంటీర్స్ తో పాటు ఉద్యోగి  కూడా ఫీల్డులో                                    ఖచ్చితంగా తిరగాలి.

ఎప్పుడు చెయ్యాలి : నెలకు రెండు రోజులు అనగా నెల చివరి శుక్రవారం మరియు శనివారం నాడు సర్వే చేయాలి.

సర్వే చేయు విధానం : 

సచివాలయ సిబ్బంది ఎవరి క్లస్టర్ పరిధిలో సర్వే చేస్తున్నారో ఆ క్లస్టర్ ను సెలెక్ట్ చేసుకోవాలి, చేసుకున్న తరువాత ఆ క్లస్టర్ పరిధిలో ఉండే హౌస్ హోల్డ్ వివరాలు మొత్తం చూపిస్తాయి, అందులో అందుబాటులో ఉన్నటువంటి వారి పేరు సెలెక్ట్ చేసుకోని  సర్వే పూర్తి చెయ్యాలి.

హౌస్ హోల్డర్ పై క్లిక్ చేస్తే ప్రశ్నలు చూపిస్తాయి :

ప్రశ్న 1: మీ గ్రామ/వార్డు సచివాలయం ఎక్కడ ఉన్నదో మీకు తెలుసా?

సమాధానం : తెలుసు / తెలియదు లో ఒకటి టిక్ చెయ్యాలి

ప్రశ్న 2: మీ గ్రామ/వార్డు వాలంటీర్ మీకు తెలుసా?

సమాధానం : తెలుసు / తెలియదు లో ఒకటి టిక్ చెయ్యాలి

ప్రశ్న 3: మీ వాలంటీర్ ఎన్ని రోజులకీ ఒక్కసారి మీ ఇంటిని సందర్శిస్తున్నారు?

సమాధానం : రాలేదు / నెలకి ఒకసారి / నెల పైబడి లో ఒకటి టిక్ చెయ్యాలి

ప్రశ్న 4: మీకు ప్రభుత్వం అందిస్తున్న వివిధ సంక్షేమ పథకాల గురించి తెలుసా?
( సంక్షేమ పథకాలు చదివి వినిపించండి )

  1. అగ్రి గోల్డ్ 
  2. జగనన్న అమ్మ ఒడి
  3. పేదలందరికి ఇల్లు
  4. జగనన్న చేదోడు
  5. జగనన్న గోరుముద్ద 
  6. జగనన్న తోడు
  7. జగనన్న విద్యా కానుక 
  8. వై యస్ ఆర్ లా నేస్తం 
  9. వై యస్ ఆర్ మత్స్య కార భరోసా
  10. వై యస్ ఆర్ సున్నా వడ్డీ ( SHGS)
  11. వై యస్ ఆర్ ఆసరా 
  12. డా.  వై.యస్.ఆర్ ఆరోగ్యశ్రీ
  13. వై యస్ ఆర్ భీమా 
  14. వై.యస్. ఆర్ చేయూత
  15. వై యస్ ఆర్ జలకల 
  16. వై యస్ ఆర్ కాపు నేస్తం
  17. వై యస్ ఆర్ నేతన్ననేస్తం
  18. వై.యస్.ఆర్ పింఛన్ కానుక
  19. వై యస్ ఆర్ సంపూర్ణ పోషణ 
  20. వై యస్ ఆర్ సున్నా వడ్డీ (Formers)
  21. వై యస్ ఆర్ వాహన మిత్ర
  22. వై యస్ ఆర్ రైతు భరోసా – పి ఏం కిసాన్
  23. జగనన్న విద్యా దీవెన
  24. జగనన్న వసతి దీవెన
  25. వైస్సార్ పెళ్లి  కానుక 
  26. ఇ బి సి నేస్తం  

ప్రశ్న 5: సచివాలయం అందిస్తున్న సేవలు/సర్వీసులు తెలుసా?

సమాధానం : తెలుసు / తెలియదు లో ఒకటి టిక్ చెయ్యాలి

ప్రశ్న 6: మీ సచివాలయం ద్వారా అందుతున్న సేవలు సంబంధించి మీకు ఏమైనా సమస్య ఉందా?

సమాధానం : ఉంది / లేదు లో ఒకటి టిక్ చెయ్యాలి

ఈ విధమైన ప్రశ్నలకూ సమాధానాలు ఎంటర్ చేసి అందుబాటులో ఉన్నటువంటి కుటుంబంలో ఒకరి ఫోటో కాప్చర్ చెయ్యాలి.తీసేటప్పుడు సిటిజన్ కనురెప్పలు Blink చేసినట్లయితే ఫోటో క్యాప్చర్ అవుతుంది. ” Data Saved Successfully” అనీ వచ్చినట్లయితే పూర్తి అయినట్టు.

నోట్ : మార్చి నెల సర్వే లో ముఖ్యంగా కరెంట్ మీటర్ నెంబరు, NPCI లింక్, చదువు వివరాలు, పాన్ కార్డు వివరాలు  మరియు వాహనం వివరాలు సరిచూడవలెను. 

Exit mobile version