Site icon SnehaJobs.com

Citizen Outreach Campaign May 2023

Citizen Outreach Campaign May 2023

గ్రామ వార్డు సచివాలయాల ద్వారా అందుతున్నటువంటి ప్రభుత్వ పథకాలు మరియు సేవలపై ప్రజల అందరి అభిప్రాయాలను తెలుసుకోవాలని సిటిజన్ ఔట్రీచ్ అనే ప్రోగ్రాం ను మొదలు పెట్టింది. అందులో భాగంగా ప్రతి గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది వాలంటీర్ల తో వారి సచివాలయం పరిధిలో కి వెళ్లి సిటిజెన్ అవుట్ రీచ్ సర్వే చేయాలి.

దేశంలో ఇప్పటి వరకు ఎక్కడా లేని విధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రామ, వార్డు సచివాలయాల వ్యవస్థను తెచ్చింది. అవినీతికి కానీ, వివక్షతకు కానీ తావు ఇవ్వకూడదని, పరిపాలన అన్నది ప్రజలకు చేరువ కావాలన్న ప్రధాన ఉద్దేశంతో రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారు ఈ సచివాలయ వ్యవస్థకు శ్రీకారం చుట్టారు. గ్రామ,వార్డు సచివాలయాల్లో దాదాపు 35 ప్రభుత్వ శాఖలకు సంబంధించి 540 సేవలు అందుబాటులో ఉంటాయి.

సర్వే పేరు : సిటిజెన్ మరియు బెనిఫిషరీ ఔట్రీచ్ ప్రోగ్రాం

ముఖ్య ఉద్దేశ్యం : ఈ ప్రోగ్రాం యొక్క ముఖ్య ఉద్దేశ్యం సచివాలయం పరిధిలోని ప్రతి ఇంటిని పరిచయం చేసుకోవడం
ఎవరు చేయాలి :  ప్రతి గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగి మరియు 2-3 వాలంటీర్లు ఒక టీంగా చేయాలి. ప్రతి 10 ఇండ్లకు ఒకసారి ఉద్యోగి యొక్క బయోమెట్రిక్ తప్పనిసరి. కావున వాలంటీర్స్ తో పాటు ఉద్యోగి  కూడా ఫీల్డులో ఖచ్చితంగా తిరగాలి.

Citizen Outreach Campaign Dash Board and App Links

ఎప్పుడు చెయ్యాలి : నెలకు రెండు రోజులు అనగా నెల చివరి శుక్రవారం మరియు శనివారం నాడు సర్వే చేయాలి.

సర్వే చేయు విధానం : 

సచివాలయ సిబ్బంది ఎవరి క్లస్టర్ పరిధిలో సర్వే చేస్తున్నారో ఆ క్లస్టర్ ను సెలెక్ట్ చేసుకోవాలి, చేసుకున్న తరువాత ఆ క్లస్టర్ పరిధిలో ఉండే హౌస్ హోల్డ్ వివరాలు మొత్తం చూపిస్తాయి, అందులో అందుబాటులో ఉన్నటువంటి వారి పేరు సెలెక్ట్ చేసుకోని  సర్వే పూర్తి చెయ్యాలి.

మే 26, 27 తేదీల్లో GSWS COP (సిటిజెన్ ఔట్రీచ్ ప్రోగ్రాం) నిర్వహించబడును. అందరూ సెక్రటరీలు మరియు వాలంటీర్లు ఈ క్రింది లింక్ ద్వారా అప్డేట్ చేసుకొనగలరు.

సిటిజన్ ఔట్రీచ్ రిపోర్ట్ (డాష్ బోర్డ్)

హౌస్ హోల్డర్ పై క్లిక్ చేస్తే ప్రశ్నలు చూపిస్తాయి :

June Month Scheme Details

జూన్ నెలలో అమలు కాబడే పధకాల గురించి అవగాహన్ కల్పించార?

సమాధానం : అవును / కాదు లో ఒకటి టిక్ చెయ్యాలి.

జూన్ నెలలో జగనన్న అమ్మ్ ఒడి పధకం తాలూకు నగదు ఆ పధకం యొక్క తల్లి / గార్డియన్ కు జమ చేయడం జరుగుతుంది . మీరు ఈ పధకం కి సంబందించి అర్హత కలిగి దాఖలు చేసి ఉంటే దగ్గరలో ఉన్న సచివాలయం లో మంజూరు వివరాలు తెలుసుకోవచ్చు .

ఈ విధమైన ప్రశ్నలకూ సమాధానాలు ఎంటర్ చేసి అందుబాటులో ఉన్నటువంటి కుటుంబంలో ఒకరి ఫోటో కాప్చర్ చెయ్యాలి.తీసేటప్పుడు సిటిజన్ కనురెప్పలు Blink చేసినట్లయితే ఫోటో క్యాప్చర్ అవుతుంది. ” Data Saved Successfully” అనీ వచ్చినట్లయితే సర్వే Partially Completed అవుతుంది .

సర్వే పూర్తిగా చేయాలి అంటే ఆ కుటుంబంలో ఉన్న ఒక్కో వ్యక్తి యొక్క ఆధార్ మరియు ఫోన్ నంబరు ఎంటర్ చేసి Ekyc చేయవలెను. అప్పుడు మాత్రమే సర్వే పూర్తి అవుతుంది .

అప్లికేషన్ లింక్

సిటిజన్ ఔట్రీచ్ రిపోర్ట్ (డాష్ బోర్డ్)

ALL VSWS Updates Click Here

Exit mobile version