ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డ్రైవర్ల సంక్షేమం కోసం ప్రతీ ఏటా వాహన మిత్ర పథకం (AP Vahana Mitra Scheme 2025) ద్వారా ఆర్థిక సహాయం అందిస్తోంది. 2025 సంవత్సరానికి గాను GO MS No: 33, రవాణా శాఖ, తేదీ: 13.09.2025 ప్రకారం, అర్హులైన ఆటో రిక్షా, మోటార్ క్యాబ్, మ్యాక్సీ క్యాబ్ యజమానులకు రూ.15,000 సహాయం అందించబడుతుంది.
ఈ పథకం ద్వారా ఆటో డ్రైవర్లు, టాక్సీ డ్రైవర్లు తమ వాహనాల మెయింటెనెన్స్, బీమా, ఫిట్‌నెస్ సర్టిఫికేట్, ఇతర ఖర్చులకు ఉపయోగించుకోవచ్చు.
✅ వాహన మిత్ర పథకం 2025 అర్హతలు (Eligibility Criteria)
Eligibility for AP Vahana Mitra Scheme 2025
GO MS No. 33 (13.09.2025) ప్రకారం:
- వాహనం యాజమాన్యం: అభ్యర్థి వద్ద తప్పనిసరిగా ఆటో రిక్షా, మోటార్ క్యాబ్ లేదా మ్యాక్సీ క్యాబ్ ఉండాలి (31.08.2025 నాటికి యాక్టివ్‌లో ఉండాలి).
- డ్రైవింగ్ లైసెన్స్: అభ్యర్థి లేదా కుటుంబ సభ్యుడికి చెల్లుబాటు అయ్యే ఆటో/లైట్ మోటార్ వాహన డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి.
- వాహన రిజిస్ట్రేషన్: వాహనం ఆంధ్రప్రదేశ్‌లో రిజిస్టర్ అయి ఉండాలి. ఆటోలకు ఈ సంవత్సరం ఫిట్‌నెస్ సర్టిఫికేట్ మినహాయింపు ఉంది.
- వాహన రకం: కేవలం ప్రయాణికుల వాహనాలు మాత్రమే అర్హులు. (సరుకు వాహనాలు అనర్హులు).
- ఆధార్ కార్డు తప్పనిసరి.
- బీపీఎల్ (Rice Card) కలిగి ఉండాలి.
- ప్రతి కుటుంబానికి ఒక వాహనం మాత్రమే అర్హం.
- GSWS Beneficiary Management Portal ద్వారా దరఖాస్తు చేయాలి.
- ఇతర occupational schemes లబ్ధిదారులు కాకూడదు.
- ప్రభుత్వ ఉద్యోగులు / పెన్షనర్లు కాకూడదు (శానిటరీ కార్మికుల కుటుంబం మినహాయింపు).
- ఆదాయ పన్ను చెల్లింపుదారులు కాకూడదు.
- కుటుంబం నెలసరి విద్యుత్ వినియోగం 300 యూనిట్లలోపు ఉండాలి (గత 12 నెలల సగటు).
- భూమి యాజమాన్యం: 3 ఎకరాల తడి, 10 ఎకరాల పొడి లేదా కలిపి 10 ఎకరాలకు మించి ఉండరాదు.
- పట్టణ ప్రాంతంలో 1000 sq.ft కంటే ఎక్కువ ఆస్తి ఉండరాదు.
- లీజ్ / రెంటు వాహనాలు అర్హం కావు.
- వాహనానికి ఎలాంటి పెండింగ్ బకాయిలు లేదా చలాన్లు ఉండరాదు.
Applicants applying under the AP Vahana Mitra Scheme 2025 must have valid driving license and vehicle registration in Andhra Pradesh
📌 వాహన మిత్ర పథకం ముఖ్యాంశాలు
- లబ్ధిదారునికి ప్రతి సంవత్సరం రూ.15,000 ఆర్థిక సాయం.
- దరఖాస్తులు GSWS పోర్టల్ ద్వారా మాత్రమే.
- డ్రైవర్ల జీవన ప్రమాణాలను మెరుగుపరచడం ప్రధాన ఉద్దేశ్యం.
- ఈ సాయం వాహనపు మెయింటెనెన్స్, ఇన్సూరెన్స్, ఫిట్‌నెస్ టెస్ట్, టాక్స్ చెల్లింపులు మొదలైన వాటికి ఉపయోగపడుతుంది.
📂 దరఖాస్తు ప్రక్రియ (How to Apply Online)
- సమీప గ్రామ / వార్డు సచివాలయం (GSWS) ను సంప్రదించాలి.
- GSWS Beneficiary Portal ద్వారా ఆన్‌లైన్ అప్లికేషన్ సమర్పించాలి.
- అవసరమైన పత్రాలు:
- అప్లికేషన్
- ఆధార్ కార్డు
- రైస్ కార్డు.
- ఆదాయ ద్రువీకరన పత్రం
- కుల ధ్రువీకరన పత్రం
- డ్రైవింగ్ లైసెన్స్.
- వాహనం యొక్క రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్.
- వెహికల్ ఫిటినెస్ .
- వెహికల్ ఇన్సూరెన్స్.
- లబ్ధిదారుని బ్యాంక్ పాస్ బుక్.
- దరఖాస్తుదారునికి తప్పనిసరిగా NPCI లింక్ ఉండాలి
- అప్లికేషన్ ఆమోదం అయిన తరువాత, డైరెక్ట్‌గా లబ్ధిదారుడి బ్యాంక్ ఖాతాలో రూ.15,000 జమ అవుతుంది.
❓ వాహన మిత్ర పథకం 2025 – తరచుగా అడిగే ప్రశ్నలు (FAQs)
| S.No | ప్రశ్న | సమాధానం |
|---|---|---|
| 1 | ఉద్యోగి మొబైల్ అప్లికేషన్ (eKYC) లో పాత యజమాని పేరు కనబడుతోంది. వాహనం కొత్త యజమానికి బదిలీ అయ్యింది. eKYC పాత యజమాని వివరాలతో చేయాలా? | లేదు. eKYC పాత యజమాని వివరాలతో చేయకూడదు. 31 ఆగస్టు 2025 తరువాత ownership transfer అయితే, eKYC లో “Vehicle SOLD” ఆప్షన్ ఎంచుకోవాలి. కొత్త యజమాని తన పేరుతో కొత్త అప్లికేషన్ సమర్పించాలి. |
| 2 | పూర్వ లబ్ధిదారు మరణించినప్పుడు nominee కి బదిలీ అవుతుందా? | లేదు. eKYC లో “Death” ఆప్షన్ ఉంది. కానీ వాహనం nominee పేరు మీదకు చట్టపరంగా బదిలీ అయిన తర్వాత మాత్రమే సాయం పొందగలరు. |
| 3 | పాత వాహనం అమ్మేసి కొత్త వాహనం తీసుకున్నప్పుడు, కొత్త వాహనం వివరాలు ఎలా అప్‌డేట్ చేయాలి? | కొత్త వాహనం వివరాలతో Secretariat లో కొత్త అప్లికేషన్ దాఖలు చేయాలి. అన్ని పత్రాలు eligibility క్రైటీరియా ప్రకారం సమర్పించాలి. |
| 4 | కొత్త అప్లికేషన్ ఎక్కడి నుండి దాఖలు చేయాలి? (DA లేదా WEA ద్వారా?) | గ్రామీణ ప్రాంతాల్లో Digital Assistant (DA) లాగిన్ ద్వారా, పట్టణ ప్రాంతాల్లో Ward Education & Data Processing Secretary లాగిన్ ద్వారా మాత్రమే దాఖలు చేయాలి. |
| 5 | 2023 records ఆధారంగా, వాహన యాజమాన్యం మార్చలేదంటే మళ్లీ అప్లికేషన్ ఇవ్వాలా? | Transport Dept. డేటా ప్రకారం, 31 ఆగస్టు 2025 వరకు ownership మార్చకపోతే కొత్త అప్లికేషన్ అవసరం లేదు. కానీ ownership మార్చితే కొత్త అప్లికేషన్ తప్పనిసరి. |
| 6 | పత్రాలు కాలం చెల్లిపోయినప్పుడు (RC/Fitness/Insurance) వాటితోనే అప్లికేషన్ వేయచ్చా? | లేదు. Welfare Assistants వాహనం, పత్రాలను ఫీల్డ్ లెవెల్‌లో verify చేస్తారు. RC, Fitness లేదా Insurance expired అయితే, కొత్త పత్రాలు submit చేయాలి. Expired documents తో అప్లికేషన్ process కాదు. |
| 7 | ఈ పథకం కింద లబ్ధి పొందడానికి కుల/ఆదాయం సర్టిఫికెట్లు అవసరమా? | లేదు. ఈ పథకం కోసం caste మరియు income certificates అవసరం లేదు. |
| 8 | RC భార్య పేరు మీద, DL భర్త పేరు మీద ఉన్నా, ఇద్దరూ ఒకే Rice Card లో ఉంటే, Household mapping వేరు అయినా scheme అర్హత ఉందా? | అవును. RC holder, DL holder ఒకే కుటుంబంలో immediate blood relatives (భర్త/భార్య/తల్లి/తండ్రి/కొడుకు/కూతురు/అన్న/చెల్లి) అయితే Household mapping వేరు ఉన్నా అర్హత ఉంటుంది. |
| 9 | ఈ పథకం కింద electric vehicles eligibleనా? | కేవలం 3-wheeler passenger battery autos మాత్రమే అర్హులు. e-rickshaws, e-karts వంటి non-passenger EVలు అర్హులు కావు. |
| 10 | గత సంవత్సరం లబ్ధిదారుల Fitness/RC expire అయి ఉంటే, eKYC చేయాలా లేక pendingలో ఉంచాలా? | ముందుగా పత్రాలను renew చేసి సమర్పించాలి. కొత్త valid documents లేకపోతే eKYC చేయరాదు. ఆవరకు కేసు pendingలో ఉంచాలి. |
| 11 | కొన్ని ఆటోలు condemned స్థితిలో ఉన్నాయి, ఫిట్‌నెస్ లేదు. వీరికి గతంలో సాయం వచ్చింది. ఇప్పుడు renew కావాలంటే? | Welfare Assistants ఫీల్డ్ లెవెల్‌లో verify చేస్తారు. operational & valid వాహనాలకే eligibility ఉంటుంది. Invalid autos “Not Recommended” గా reject అవుతాయి. |
| 12 | పూర్వ ప్రభుత్వంలోని Rice Trucks (MDU Vehicles) ఈ పథకం కింద వస్తాయా? | కాదు. Mobile Disbursement Vehicles (Rice Trucks) ఈ పథకం కింద అర్హులు కావు. |
| 13 | డ్రైవింగ్ లైసెన్స్ ఇతర రాష్ట్రం (ఉదా: ఒడిశా) లో issue అయ్యి, address ఆంధ్రప్రదేశ్ కాకపోతే eligibility ఉందా? | కాదు. DL India లో ఎక్కడి నుండి అయినా issue కావచ్చు, కానీ address ఆంధ్రప్రదేశ్ లో ఉండాలి. ఇతర రాష్ట్ర address ఉంటే అర్హత ఉండదు. |
| 14 | DL తండ్రి పేరు మీద, RC కూతురు పేరు మీద ఉన్నా, పెళ్లి అయ్యి వేరు Household mapping లో ఉన్నా, eKYC చేయవచ్చా? | అవును. వాహనం RC ఎవరి పేరు మీద ఉందో వారి పేరుతో eKYC చేయాలి. RC holder & DL holder father/daughter/son/mother వంటి immediate relatives అయితే Household mapping వేరు అయినా అర్హత ఉంటుంది. |
Vahana Mitra Scheme Apply Online
AP Auto Driver 15000 Scheme
వాహన మిత్ర పథకం 2025
ఆటో డ్రైవర్ పథకం ఆంధ్రప్రదేశ్
AP Driver Financial Assistance
Vahana Mitra Eligibility & Application
వాహన మిత్ర పథకం అప్లికేషన్ ప్రాసెస్
Andhra Pradesh Auto Driver Scheme
Check All Schemes Eligibility and Status
