SnehaJobs.com

GSWS Updates|| VSU Previous Papers||Study Materials||Latest Jobs

5 వ తరగతి

5th Class General Science 

  • మన దేశంలో National Beauro of Plant Genetics సంస్థ మొక్కల జన్యువులను సేకరించి భద్రపరుస్తుంది.
  • చాలా పెద్దవిగా పెరిగే చెట్లను చిన్న చిన్న కుండీలలో పెంచడాన్ని బాన్సాయ్ (వామన వృక్షాలు) అంటారు. ఇది జపాన్ దేశపు సాంప్రదాయ కళ.
  • వేప చెట్టును UNO శతాబ్ద వృక్షంగా ప్రకటించారు.
  • కాంతి వైద్యం చేసే డాక్టరును ‘ఆప్తల్మాజిస్ట్ ‘ అంటారు.
  • చర్మ సంబంధ వ్యాధులకు చికిత్స చేసే డాక్టరును ‘డెర్మటాలజిస్ట్’ అంటారు.
  • శరీరంలో అతి పెద్ద అవయవం – చర్మం.
  • ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధులకు చికిత్స చేసే డాక్టరును ‘పల్మోనాలజిస్ట్’ అంటారు.
  • గుండెకు సంబంధించిన వ్యాధులకు చికిత్స చేసే డాక్టరును ‘కార్డియాలజిస్ట్’ అంటారు.
  • రక్తంలో ఎక్కువగా ద్రవ రూపంలో ఉన్న ప్లాస్మా ఉంటుంది.
  • రక్తంలో మూడు రకాల రక్త కణాలు ఉంటాయి.అవి 1. ఎర్ర రక్త కణాలు 2. తెల్ల రక్త కణాలు 3. రక్త ఫలికలు.
  • ఎర్ర రక్త కణాలు శరీరంలో ఉన్న అన్నీ కణాలకు ఆక్సీజన్ అందిస్తాయి.
  • తెల్ల రక్త కణాలు రోగ కారక క్రిములతో పోరాడతాయి.
  • రక్త ఫలికలు రక్తం గడ్డ కట్టడంలో సహాయపడుతుంది.
  • ఎముకలకు సంబంధించి వైధ్యం చేయు డాక్టరును ‘ఆర్ధోపెడీషియన్’ అంటారు.
  • మూత్రపిండ వ్యవస్థకు సంబంధించిన వ్యాధిఉలకు చికిత్స చేసే డాక్టరును ‘న్యూరాలజిస్ట్’ అంటారు.
  • మన దేశంలో మొత్తం భూ భాగంలో అడవులు 6,92,027 చ.కి.మీ. ఉన్నాయి.
  • మధ్యప్రదేశ్ రాష్ట్రం 77,000 చ.కి.మీ. అటవీ విస్తీర్ణంతో దేశంలో మొదటి స్థానంలోయి ఉంది.
  • గోదావరి నది మహారాష్ట్రంలోని నాసిక్ జిల్లా త్రయంబకేశ్వరం వద్ద పశ్చిమ కనుమలలోని బ్రహ్మగిరి కొండలలో ప్రారంభమౌతుంది.
  • ఇది సముద్రంలో కలిసే ముందు మూడు పాయలుగా విడిపోయి తూర్పు గోదావరి జిల్లాలోని అంతర్వేది, యానాంల వద్ద బంగాళాఖాతంలో కలుస్తుంది.
  • సౌర కుటుంబంలో సూర్యుని చుట్టూ 8 గ్రహాలు తిరుగుతుంటాయి.
  • బుధుడు
  • శుక్రుడు
  • భూమి
  • అంగారకుడు
  • గురుడు
  • శని
  • యురేనస్
  • నెఫ్త్యూన్
  • ప్లూటో
  • భూమి తన చుట్టూ తాను తిరగడమే ‘భూ భ్రమణం ‘.
  • అంతరిక్షం గుండా భూమి సెకనుకి 30km వేగంతో పయనిస్తుంది.ఇతర ఏ అంతరిక్ష పదార్ధం ఇంత వేగంగా పయనించలేదు.
  • క్రీ.శ. 1565 సం.లో రాక్షస తంగడి యుద్దంలో విజయనగర రాజులు ఓడిపోయారు.
  • దీనితో విజయనగర రాజులు రాజధాని ని హంపి నుండి పెనుగొండకు తర్వాత చంద్రగిరికీ తరలించారు.అనంతరం అరవీటి వంశం విజయనగర పరిపాలన భారమును చేపట్టి చంద్రగిరిని శాశ్వత రాజధాని పట్టణంగా చేసుకొని పరిపాలించారు.
  • క్రీ.శ. 1585 లో అరవీటి వంశపు రాజు శ్రీ వెంకటపతి దేవరాయల కాలంలో చంద్రగిరి కోట చాలా ప్రాచుర్యంలోకి వచ్చింది.
  • ఆముక్త మాల్యదను రచించినది – శ్రీ కృష్ణదేవరాయలు
  • మను చరిత్రను రచించినది – అల్లసాని పెద్దన
  • విజయనగర రాజులు ఆస్థానంలోని ప్రసిద్ద కవి ‘తెనాలి రామకృష్ణుడు’ చంద్రగిరిలో జన్మించాడు.
  • మన దేశంలోని సౌరశక్తిని ఎక్కువగా ఉపయోగింఛే రాష్ట్రం – గుజరాత్
  • ప్రపంచంలో వైశాల్యంలో పెద్ద దేశాలు వరుసగా అవి :- రష్యా  2. కెనడా  3. చైనా  4. U.S.A   5. బ్రెజిల్  6. ఆస్ట్రేలియా   7. ఇండియా
  • భారతదేశం మద్యగా వింధ్య, సాత్పుర పర్వతాలు ఉన్నాయి. వీటికి ఉత్తర భాగాన్ని ఉత్తర భారత దేశమని , దక్షిణ భాగాన్ని దక్షిణ భారత దేశమని అంటారు.
  • సముద్ర మట్టం నుండి 1000 మీటర్ల ఎత్తుకు పోయే కొలది 60 c ఉష్ణోగ్రత తగ్గుతుంది.
  • భారత రాజ్యగం డా. బాబు రాజేంద్ర ప్రసాద్ సారధ్యంలో రూపొందించబడింది.ఈయన మన దేశానికి మొదటి రాష్ట్రపతి.రెండు పర్యాయాలు భారత రాష్ట్రపతిగా పనిచేశారు.
  • రాజ్యంగా రచనా కమిటీకి ఛైర్మన్ గా డా. అంబేద్కర్ ను నియమించారు. సభ్యులుగా
    • గోపాలస్వామి అయ్యంగార్
    • అల్లాడి కృష్ణస్వామి అయ్యర్
    • కె.ఎమ్. మున్షి
    • సయ్యద్ మహ్మద్ సాదుల్లా
    • మాధవరావు ఉన్నారు.
  • వీరికి రాజ్యాంగం రాయడానికి 2సం.11నెలల 18రోజులు పట్టింది.
  • 1949 నవంబర్ 26న పూర్తి చేశారు.
  • 1950 జనవరి 26 న అమలులోకి వచ్చింది. ఈ రోజునే మనం గణతంత్ర దినోత్సవం గా జరుపుకుంటాం.
  • భారతదేశంలో 1652 భాషలు ఉన్నాయి.మన రాజ్యాంగంలో 22 భాషలను అధికారిక భాషలుగా గుర్తించారు.
  • పార్లమెంటులో రాజ్యసభ , లోక్ సభ ఉంటాయి.
  • లోక్ సభకు 543 మంది సభ్యులను ఓట్ల ద్వారా ఎన్నుకుంటారు.ఇద్దరు సభ్యులను ఎన్నికలు లేకుండా నామినేట్ చేస్తారు.
  • రాజ్యసభకు 233 మంది సభ్యులను ఎన్నుకుంటారు. 12 మందిని నామినేట్ చేస్తారు.
  • పార్లమెంట్ లో మొత్తం సభ్యుల సంఖ్య – 790
  • రోజు శరీరానికి ఎండ తగలడం వల్ల ‘D’ విటమిన్ లభిస్తుంది.దీనితో ఎముకలు, చర్మం ఆరోగ్యకరంగా ఉంటుంది.
  • భూ వాతావరణానికి ఉష్ణోగ్రతలలో ఉండే మార్పుల ఆధారంగా 5 పొరలుగా విభజించారు. ట్రోపో ఆవరణం   b.స్ట్రాటో ఆవరణం   c.యొసో ఆవరణం    d.ధర్మొ ఆవరణం    e.ఎక్సో ఆవరణం.
  • చంద్రగిరికోటను క్రీ.శ. 1000 సం.లో చంద్రగిరి పట్టణమునకు సమీపంలో ఉన్న నారాయణ వనమును పాలించిన ‘ఇమ్మడి యాదవ నరసింహ రాయులు’ కట్టించారు.

 

Updated: July 9, 2020 — 8:24 am
Disclaimer- We (snehajobs.com) provide Degree previous papers/ Jobs / Career related information gathered from various reliable sources. We have tried our best to provide accurate information about syllabus, previous paper, Study Materials, results, jobs, vsws updates, private job and other informative links. Any error or false information is not our responsibility. We are a Non-Government service provider and does not guarantee 100% accuracy. Please double-check the information from the official source/website before taking any action. All Rights Reserved

You cannot copy content of this page