Site icon SnehaJobs.com

ప్రపంచ రక్తదాతల దినోత్సవం

సత్య డిగ్రీ అండ్ పీజీ కళాశాల – ప్రపంచ రక్తదాతల దినోత్సవం

విజయనగరం తేదీ(14/06/2020)నాడు స్థానిక సత్య డిగ్రీ అండ్ పీజీ కళాశాలలో,”ప్రపంచ రక్తదాతల దినోత్సవం” సందర్భంగా సత్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్, ఆశయ ఫౌండేషన్,మరియు విజయ బ్లడ్ బ్యాంకు వారు, సంయుక్తంగా నిర్వహించిన మెగా రక్తదాన శిబిరానికి, విజయనగరం మాజీ పార్లమెంటు సభ్యులు గౌరవనీయులు”శ్రీ”డాక్టర్” బొత్స ఝాన్సీ లక్ష్మీ “గారు ముఖ్య అతిథిగా పాల్గొనడం జరిగింది,ఈ కార్యక్రమంలో సుమారు 100 మంది రక్త దానం చేయడం జరిగింది,తదుపరి వారు రక్తదాతలతో మాట్లాడుతూ రక్త దానం యొక్క ఆవశ్యకతను రక్త దానం పై ఉన్న అపోహలను తొలగించారు, అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ,ఇలాంటి మంచి కార్యక్రమాలను ప్రభుత్వంతోపాటు,స్వచ్ఛంద సంస్థలు కూడా వారి వంతు సేవ చేయాలని వారు పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో కేసలి స్వచ్ఛంద సంస్థ అధ్యక్షులు, రాష్ట్ర బాలల హక్కుల కమిషన్ ఉపాధ్యక్షులు శ్రీ”కేసలి అప్పారావు”గారు సత్య డిగ్రీ అండ్ పీజీ కళాశాల ప్రిన్సిపల్ శ్రీ సాయి దేవ మణి”గారు ఆశయ ఫౌండేషన్ ప్రతినిధులు, సమీర్ గారు,షాబు గారు, విజయ బ్లడ్ బ్యాంక్ ప్రతినిధులు,సత్య విద్యాసంస్థల ఎన్.సి.సి ఆఫీసర్స్ కళ్యాణ్ గారు, సత్య వేణి గారు,ఎన్.సి.సి విద్యార్థులు మరియు కళాశాల టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ సిబ్బంది తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది.

 

Click Here For Sachivalayam latest Updates 

Exit mobile version