జగనన్న విద్యా దీవెన మరియు జగనన్న వసతి దీవెన

జగనన్న విద్యా దీవెన మరియు జగనన్న వసతి దీవెన

Apply online Jaganana vidya deevena and jagananna vasati deevena. How to Apply jagananna vidya deevena and jagananna vasati deevena?పేదవిద్యార్ధులు ఉన్నత విద్యను కొనసాగించుటకై ఆర్ధిక బరోసా ఇచ్చి ప్రోత్సహించడమే పధకం లక్ష్యం.

జగనన్న విద్యా దీవెన మరియు జగనన్న వసతి దీవెన అర్హతలు

  • కుటుంబ వార్షిక ఆదాయం రూ. 2,50,000 లోపు ఉన్నవారు అర్హులు.
  • కుటుంబానికి వ్యాసాయ భూమి మగాణి ఐతే 10 ఎకరాలు కన్నా తక్కువ లేదా మెట్ట భూమి ఐతే 25 ఏకరాలకన్నా తక్కువ లేదా మాగాణి మరియు మెటా కలిపి 25 ఏకరాలలోపు ఉన్నవారు అర్హులు.
  • కుటుంబ సభ్యులలో ఏ ఒక్కరు ప్రభుత్వ ఉద్యోగి / ఆదాయపు పన్ను చెల్లింపుదారు / పెన్షన్ దారుడు ఉన్న యెడల అర్హులు కారు. ( పారిశుధ్య కార్మికులు మినహా )
  • పట్టణ ప్రాంతములో 1500 చ. అ. లు కన్నా తక్కువ బిల్డప్ ఏరియా ( నివాస మరియు వాణిజ్య భవనము ) కలిగిన కుటుంబం అర్హులు.
  • ఐ టి ఐ , పాలిటెక్నిక్ , డిగ్రీ ఆపై కోర్సు లను ప్రభుత్వము గుర్తింపు ఉన్న కళాశాలల్లో చదువుతున్నవారు అర్హులు.

జాబితాలో పేరు లేనివారు దరఖాస్తు చేసుకునే విధానము :

  • 2019-20 సంవత్సరములో అనర్హత జాబితాలో ఉన్నవారు అభ్యంతరములు ఉన్నట్లైయతే , వారి అర్హత రుజువులతో గ్రామ / వార్డు సచివాలయం ద్వారా ” నవశకం ” లాగిన్ లో అభ్యంతరములు దాఖలు చేసిన యెడల వాటిని పరిశీలించి తగుచర్య గైకొనబడును.
  • 2020-21 విద్యా సంవత్సరములో కళాశాలలు తెరచిన పిమ్మట అర్హతగా విద్యార్ధులు తమ ధరకాస్తులను వారి కళాశాల ద్వారా ” జ్ణానభూమి పోర్టల్ నందు నమోదు చేసుకొనవచ్చును. లేదా దరఖాస్తులను గ్రామ / వార్డు వాలంటీర్ల ద్వారా కానీ, లేదా స్వయంగా గ్రామ/ వార్డు సచివాలయం నందు ధరఖాస్తు చేసుకొనవచ్చును.
  • అర్హులైన ధరఖాస్తు దారునికి  YSR (Your Service Request –  మీ సేవల అభ్యర్ధన)  నెంబరు ఇవ్వబడుతుంది .

Click Here For More Schemes 

Official Site 

Updated: July 31, 2020 — 6:12 am

Leave a Reply

Snehajobs.com © 2019 All Rights Reserved
You cannot copy content of this page