డా.  వై.యస్.ఆర్ ఆరోగ్యశ్రీ కార్డు

డా.  వై.యస్.ఆర్ ఆరోగ్యశ్రీ కార్డు

జనం ఆరోగ్యమే  – జగనన్న ఆశయం

పేదలందరికి నాణ్యమైన వైద్యం అందించటమే లక్ష్యం

అర్హతలు

  • బియ్యం కార్డు, పింఛను కార్డు , జగనన్న విద్యా దీవెన మరియు జగనన్న వసతి దీవెన పధకాలకు అర్హులైన వారు ఈ పధకానికి అర్హులు.
  • మాగాణి భూమి 12 ఎకరాలు లేదా మెట్ట/మెరక భూమి 35 ఎకరాలు లేదా మెట్ట మరియు మాగాణి కలిపి 35 ఏకరాలలోపు కలిగినవారు అర్హులు.
  • 5 లక్షలు లేదా అంతకు తక్కువ కుటుంబ వార్షిక ఆదాయము కలిగిన వారు అర్హులు.
  • 5 లక్ష్లల లోపు ఆదాయపుపన్ను చెల్లింపులను చేస్తున్న కుటుంబాలు అర్హులు.
  • శాశ్వత ప్రభుత్వ ఉద్యోగి / పింఛను దారు మినహాయించి మరే ఇతర ఉద్యోగి ప్రభుత్వం లోగాని లేదా ప్రవేట్ గా కానీ కాంట్రాక్ట్ , ఒప్పంద ఉద్యోగులు , పార్ట్ టైమ్ ఉద్యోగులు , శానిటరీ వర్కర్లు , గౌరవవేతనం ఆదారంగా పనిచేసే ఉద్యోగులు ఎవరైనా 5 లక్షల లోపు వార్షిక ఆదాయం కలిగిఉన్న వారు అర్హులు.
  • 3000 చదరపు అడుగులు (334Yds) స్థలంలోపు వైశాల్యానికి మునిసిపల్ ఆస్తి పన్ను చెల్లింపుదారులు ఈ పధకానికి అర్హులు
  • ఒక కుటుంబానికి / గృహానికి ఒక వ్యక్తిగత కారును మించి ఉండరాదు.

జాబితాలో పేరు లేని వారు ధరఖాస్తు చేసుకునే విధానము

  • అర్హత కలిగిన వారు కుటుంబ సభ్యులందరి ఆధర్ కార్డు, ఆస్తి పన్ను రుజువు, పట్టాదార్ పాస్ పుస్తకం నకలు, స్వీయ మరియు కుటుంబ సభ్యుల జీతం సర్టిఫికటే ( ఏదైనా ఉంటే ) వాహనాలు మరియు ఆస్తి వివరాలు, కుటుంబం యొక్క ఫోటో తోపాటు గ్రామ వార్డు సచివాలయాలలో గానీ లేదా గ్రామ/ వార్డు వాలంటీర్ల ద్వార గానీ ధరఖాస్తు చేసుకోవచ్చు.
  • అర్హులైన ధరఖాస్తు ధారునికి YSR ( Your Service Request మీ సేవల అభ్యర్ధన ) నెంబర్ ఇవ్వబడుతుంది.
  • ధరఖాస్తు చేసిన 20 పని దినములలో అర్హులైన ధరఖాస్తు ధారునికి  డా.  వై యస్ ఆర్ ఆరోగ్యశ్రీ కార్డు వాలంటీర్ల ద్వారా ఇవ్వబడుతుంది.

 

 

Updated: July 12, 2020 — 10:07 pm
SnehaJobs.com © 2022 All Rights Reserved
You cannot copy content of this page