Site icon SnehaJobs.com

రైతులకు ఇన్ పుట్ సబ్సిడీ

రైతులకు ఇన్ పుట్ సబ్సిడీ

  1. పథకంయొక్కవివరం: భారీ వర్షాలు, కరువు, తుఫాన్లు, వరదలు మొదలైనటువంటి ప్రకృతి వైపరీత్యాల  కారణంగా 33%మరియు అంతకన్న ఎక్కువపంట నష్టపోయినప్పుడు రైతులకు ఆర్థిక సహాయం అందించడం ఈ పథకం యొక్క లక్ష్యం. రైతు భరోసా కేంద్రాల (RBK) వద్ద e-క్రాపింగ్ ఆధారంగా శాస్త్రీయ విధానంలో పంట నష్టాన్ని అంచనా వేస్తారు.

2.పథకం అమలుకు బాధ్యత వహించే ఉద్యోగి:

          గ్రామ వ్యవసాయ/ ఉద్యానవన/ సెరికల్చర్ కార్యదర్శి

3.అర్హతా ప్రమాణాలు: ఈ పథకం క్రింద ఆర్ధిక సహాయం పొందడానికి లబ్ధిదారులు ఈ క్రింద

తేలిపినఅర్హతా ప్రమాణాలను కలిగి ఉండాలి.

వ.నెం.ప్రమాణంనిబంధనలు
 1అనుమతించబడే పంటలువరి, జొన్న, సజ్జ, మొక్కజొన్న, మినుము, పెసలు, ఎర్ర కంది పప్పు, సోయాబీన్, వేరుశనగ, ఆముదం, చెరకు, పత్తి, మిరప, పసుపు, కొర్ర, రాగి, శనగ, రాజ్మా, నువ్వులు, అలసందలు, బొబ్బర్లు మొదలైనవి.
 2అనుమతించబడే రైతులుకౌలు రైతులు మరియు రైతుల (భూ యజమానులు)తో సహా సన్న/చిన్న/పెద్ద అనే తేడా  లేకుండా రైతులందరూ.
 3ప్రీమియంరైతులు ఎటువంటి ప్రీమియం చెల్లించవలసిన అవసరం లేదు.

4. పథకం యొక్క పని విధానం

5. తక్షణ అప్పీలేట్ అథారిటీ

మండల వ్యవసాయ అధికారి (MAO)

6. సంబంధిత ప్రభుత్వ ఉత్తర్వులు

వ.నెంవివరణఉత్తర్వుల నెం.
1.రైతులకు ఇన్ పుట్ సబ్సిడీ పథకంజి.ఓ.ఎం.ఎస్.నెం. 15, తేదీ: 04-12-2015
2.రైతులకు ఇన్ పుట్ సబ్సిడీ పథకంజి.ఓ.ఎం.ఎస్.నెం.23-12-2014

# సాంకేతిక సమస్యలకు సంప్రదించవలసిన వారు

ఫిర్యాదు చేయుటకు లబ్ధిదారులు లేదా పౌరులు సంప్రదించవలసిన టోల్ ఫ్రీ నెంబర్లు:1907 లేదా 1902 లేదా 1800-180-1551.

Click Here For More Schemes

Check Your Eligibility

Exit mobile version