Site icon SnehaJobs.com

డా. వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ

డా. వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ

ఈ పథకం లక్ష్యం

స్వీయ-నిధుల రీయింబర్స్‌మెంట్ మెకానిజం (ట్రస్ట్) ద్వారా గుర్తించబడిన నెట్ వర్క్ఆసుపత్రులనుండి దారిద్ర్యరేఖకు దిగువన ఉన్న వారికి ఉచిత,నాణ్యమైన వైద్య సేవలు అందించడం.

ప్రతి కుటుంబానికి సంవత్సరానికి రూ. 5 లక్షల వరకు కవరేజ్

విపత్కర పరిస్థితుల్లో ఆరోగ్య ఖర్చులకు అవసరమైన ఆర్థిక భద్రతను అందించడం.

డిమాండ్ సైడ్ ఫినాన్సింగ్ ద్వారా ప్రభుత్వ ఆసుపత్రులను బలోపేతం చేయడం.

పట్టణ మరియు గ్రామీణ పేదల ఆరోగ్యానికి సంబంధించిన సార్వత్రిక కవరేజ్ని అందించడం.

ఈ పథకం క్రింద ఆర్ధిక సహాయం పొందడానికి లబ్ధిదారులు ఈ క్రింద తెల్పిన అర్హతా ప్రమాణాలను కలిగి ఉండాలి.

ప్రమాణంనిబంధనలు
వ్యక్తిగత వాహనంఒకటికి మించి వ్యక్తిగత వాహనం (కారు) లేని కుటుంబాలు.
మొత్తం కుటుంబ ఆదాయంరూ.5.00 లక్షలు లేదా అంతకంటే తక్కువ వార్షిక ఆదాయం కలిగిన కుటుంబాలు (సాలరీ సర్టిఫికేట్ ప్రకారం)  
కుటుంబానికి గల మొత్తం భూమి12.00 ఎకరాల కంటే తక్కువ మాగాణి లేదా 35.00 ఎకరాల కంటే తక్కువ మెట్ట లేదా రెండూ కలిపి గరిష్టంగా35 ఎకరాల లోపు ఉన్నవారు మాత్రమే అర్హులు.
ప్రభుత్వ ఉద్యోగి/ ఫించనుదారుప్రభుత్వ ఉద్యోగులు, ఉద్యోగుల ఆరోగ్య పథకం (EHS) క్రిందకు వస్తారు కాబట్టీ వారికి వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ వర్తించదు.
ఆదాయపు పన్నురూ. 5.00లక్షల రూపాయల ఆదాయం వరకూ ఆదాయపు పన్ను చెల్లిస్తున్న కుటుంబాలు అర్హులు (ఆదాయపు పన్ను ధృవపత్రం అవసరం)  
మున్సిపాలిటీ ఆస్తిపట్టణ ప్రాంతాలలో 3000 చ.అల స్థలం (334చ.గ.) కంటే తక్కువ కలిగి ఉండి మున్సిపాలిటీకి ఆస్తి పన్ను చెల్లిస్తున్న అన్ని కుటుంబాలు అర్హులు(పట్టణ ప్రాంతాలకు మాత్రమే వర్తిస్తుంది)  
వ. నెంవివరణఉత్తర్వుల నెం.
1.డా. వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం ప్రభుత్వ ఉత్తర్వులుజి. ఓ.ఎం.ఎస్. నెం. 227, తేదీ: 09.06.2006 &జి. ఓ.ఎం.ఎస్. నెం. 83, తేదీ: 21.08.2020
2.డా. వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకంhttps://www.ysraarogyasri.ap.gov.in/web/guest/ysr-aarogyasri-scheme

# సాంకేతిక సమస్యలకు సంప్రదించవలసిన వారు

Exit mobile version