Site icon SnehaJobs.com

జగనన్న విద్యా దీవెన&జగనన్న వసతి దీవెన

జగనన్న విద్యా దీవెన&జగనన్న వసతి దీవెన

1. పథకానికి సంబంధించిన వివరాలు(జగనన్నవిద్యాదీవెనRTF):

జగనన్న విద్యా దీవెన పథకంలో ITI నుండి Ph.D. వరకు (ఇంటర్మీడియట్ మినహా) చదువుకుంటున్న SC,ST,BC,EBC (కాపులు మినహా), కాపు, మైనారిటీ మరియు వికలాంగులైన విద్యార్ధులలో అర్హులైన వారికి పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ చేయడమేలక్ష్యం.

2.పథకానికి సంబంధించిన వివరాలు(జగనన్నవసతిదీవెనMTF):

జగనన్నవసతిదీవెనపథకంలో ITI విద్యార్థులుఒక్కొక్కరికిరూ.10,000/-, పాలిటెక్నిక్విద్యార్థులకుఒక్కొక్కరికిరూ.15,000/-, ఇతరడిగ్రీమరియుఅంతకంటేఎక్కువకోర్సులకుఒక్కొక్కరికిరూ.20,000/-. అర్హతఉన్నప్రతివిద్యార్థికిసంవత్సరానికిఆహారంమరియుహాస్టల్ఖర్చులుఅందిచడమేప్రథమలక్ష్యం.

3.పథకం అమలుకు బాధ్యత వహించే ఉద్యోగి:

  1. సంక్షేమ మరియు విద్యా సహాయకులు (గ్రామీణ ప్రాంతాలు)
  2. వార్డు విద్యా డేటా ప్రాసెసింగ్ సెక్రటరీ (పట్టణ ప్రాంతాలు)

4.అర్హతా ప్రమాణాలు:

ఈ పథకం క్రింద ఆర్ధిక సహాయం పొందడానికి లబ్ధిదారులు ఈ క్రింద తెలిపిన అర్హతా ప్రమాణాలను కలిగి ఉండాలి.

వ.నెం.ప్రమాణంనిబంధనలు
 1నివాసంఆంధ్రప్రదేశ్రాష్ట్రంలోశాశ్వత నివాసిగా ఉండాలి.
 2మొత్తం కుటుంబ ఆదాయంమొత్తం కుటుంబం యొక్క వార్షిక ఆదాయం రూ.2.50 లక్షలు లేదా అంతకంటే తక్కువ ఉన్నవారు అర్హులు.  
 3మొత్తం కుటుంబానికి గల భూమిలబ్ధిదారులు 10 ఎకరాల కంటే తక్కువ మాగాణి లేదా 25 ఎకరాల కంటే తక్కువ మెట్ట లేదా రెండూ కలిపి గరిష్టంగా 25 ఎకరాల లోపు ఉన్నవారు మాత్రమే అర్హులు.
 4ప్రభుత్వ ఉద్యోగి/ ఫించనుదారుకుటుంబంలోని ఏ వ్యక్తి ప్రభుత్వ ఉద్యోగి లేదా ఫించనుదారు అయి ఉండరాదు. ఈ షరతు నుండి పారిశుద్ధ్య పనివారి కుటుంబాలు మినహాయించబడినవి.
 5కోర్సు పూర్తికాలేజీలు/ యూనివర్సిటీలు లేదా గుర్తించబడిన విద్యా సంస్థలలో విద్యార్ధులు రెగ్యులర్ కోర్సులలో ప్రవేశం పొంది ఉండాలి.
 6అర్హత గల కోర్సులుబి.టెక్ బి. ఫార్మసీ ఐటిఐ పాలిటెక్నిక్ బి. ఎడ్ యం.టెక్ యం. ఫార్మసీ యంబిఎ ఇతర డిగ్రీలు/పోస్టుగ్రాడ్యుయేట్స్ * పోస్టు గ్రాడ్యుయేషన్ కోర్సులకు సంబంధించి ప్రభుత్వ/ యూనివర్సిటీ కాలేజీలలో చదివే వారు మాత్రమే అర్హులు
 7అర్హత గల విద్యా సంస్థలుఈ క్రింద తెల్పిన విద్యా సంస్థలలో ప్రవేశం పొందినవారు అర్హులు: ప్రభుత్వ లేదా ప్రభుత్వ సహాయం పొందే (ఎయిడెడ్)రాష్ట్ర యూనివర్శిటీలకు అనుబంధంగా ఉన్న ప్రైవేటు కాలేజీలు/ బోర్డులు. డే స్కాలర్ విద్యార్ధులు, కాలేజీలకు అనుసంధానించబడిన హాస్టల్విద్యార్ధులు (CAH), మరియు సంబంధిత శాఖకు అనుసంధానించ బడిన హాస్టల్ విద్యార్ధులు (DAH).
 8హాజరులబ్ధిదారులు 75% హాజరు ఉండేలా చూసుకోవాలి
 9అవసరమైన ధృవపత్రాల జాబితాఆధార్ కార్డురైస్ కార్డు/ ఆదాయ ధృవపత్రంకాలేజీ ప్రవేశ వివరాలుతల్లిదండ్రుల వివరాలుకుటుంబంలోని ఏ వ్యక్తి ప్రభుత్వ ఉద్యోగి లేదా ఫించనుదారు కారనే ధృవపత్రం/ నాలుగు చక్రాల వాహనం లేదనే ధృవపత్రం/ 1500 చ. అడుగుల పైన పట్టణ ప్రాంతంలో ఆస్తి లేదనే ధృవపత్రం/ నిర్ణీత పరిమితికి మించిన వ్యవసాయ భూమి లేదనే ధృవపత్రం  
 10నాలుగు చక్రాల వాహనంలబ్ధిదారు కుటుంబం నాలుగు చక్రాల వాహనం కలిగి ఉండకూడదు. (టాక్సీలు, ట్రాక్టర్లు, ఆటోలు ఈ షరతు నుండి మినహాయించబడినవి).
 11పట్టణాల్లో ఆస్తిఎటువంటి ఆస్తి లేని లేదా పట్టణ ప్రాంతాలలో 1500 చ.అల స్థలం (నివాస లేదా వాణిజ్య) కంటే తక్కువ కలిగిన కుటుంబాలు అర్హులు(పట్టణ ప్రాంతాలకు మాత్రమే వర్తిస్తుంది)  
 12ఆదాయపు పన్నుఆదాయపు పన్ను చెల్లిస్తున్నవారు ఈ పథకానికి అనర్హులు
13.వయస్సు& లింగంబాల, బాలికలు ఇద్దరూ అర్హులే,అర్హత గల నిర్ణీత కోర్సుకు తగిన వయస్సుకలిగి ఉండాలి.
14.కులం & కేటగిరీఎస్.సి, ఎస్.టి, బి.సి, ఇబిసి (కాపులు మినహా), కాపు, మైనారిటీ మరియు వికలాంగుల కేటగిరీలకు చెందిన విద్యార్ధులు అర్హులు.
15.అనర్హతలుప్రైవేటు యూనివర్సిటీలు/ డీమ్డ్ యూనివర్సిటీలలో చదువుతున్న విద్యార్ధులు (ప్రభుత్వ కోటా మినహా).కరెస్పాండెన్స్ కోర్సు విధానంలోనూ, దూర విద్యా విధానంలోనూ చదువుతున్న విద్యార్ధులు.మేనేజిమెంట్ / NRI కోటాలో అడ్మిషన్ పొందిన విద్యార్ధులకు ఈ పథకం వర్తించదు.

5. పథకం అమలు విధానం:

6.తక్షణ అప్పీలేట్ అథారిటీ:

7.సంబంధిత ప్రభుత్వ ఉత్తర్వులు

వ.నెంవివరణఉత్తర్వుల నెం.
1.జగనన్న విద్యా & వసతిదీవెన పథకం ప్రభుత్వ ఉత్తర్వులుజి.ఓ.ఎం.ఎస్.నెం. 115, తేదీ: 30-11-2019

8.ప్రభుత్వ ఉత్తర్వులసవరణ వివరాలు

సవరణ నెం. సవరణ తేదీ సవరణ వివరాలు
1.29-11-2021  జగనన్న విద్యా & వసతిదీవెన పథకం జి.ఓ.ఎం.ఎస్.నెం. 35,

# సాంకేతిక సమస్యలకు సంప్రదించవలసిన వారు

లబ్ధిదారులు లేదా పౌరులు సంప్రదించవలసిన టోల్ ఫ్రీ నెం:1902

ఫిర్యాదులను jnanabhumi.jvdschemes@gmail.com అనే ఈ మెయిల్ అడ్రస్ కు పంపవచ్చు.

మరింత సమాచారం కొరకు https://navasakam.ap.gov.in/అనే వెబ్ సైట్ను చూడవచ్చు.

Click Here For More Schemes

Exit mobile version