Site icon SnehaJobs.com

వాహన మిత్ర పథకం 2025 – ఆటో, క్యాబ్ డ్రైవర్లకు రూ.15,000 ఆర్థిక సాయం

ap vahana mitra 2025

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డ్రైవర్ల సంక్షేమం కోసం ప్రతీ ఏటా వాహన మిత్ర పథకం (AP Vahana Mitra Scheme 2025) ద్వారా ఆర్థిక సహాయం అందిస్తోంది. 2025 సంవత్సరానికి గాను GO MS No: 33, రవాణా శాఖ, తేదీ: 13.09.2025 ప్రకారం, అర్హులైన ఆటో రిక్షా, మోటార్ క్యాబ్, మ్యాక్సీ క్యాబ్ యజమానులకు రూ.15,000 సహాయం అందించబడుతుంది.

ఈ పథకం ద్వారా ఆటో డ్రైవర్లు, టాక్సీ డ్రైవర్లు తమ వాహనాల మెయింటెనెన్స్, బీమా, ఫిట్‌నెస్ సర్టిఫికేట్, ఇతర ఖర్చులకు ఉపయోగించుకోవచ్చు.

Eligibility for AP Vahana Mitra Scheme 2025

GO MS No. 33 (13.09.2025) ప్రకారం:

  1. వాహనం యాజమాన్యం: అభ్యర్థి వద్ద తప్పనిసరిగా ఆటో రిక్షా, మోటార్ క్యాబ్ లేదా మ్యాక్సీ క్యాబ్ ఉండాలి (31.08.2025 నాటికి యాక్టివ్‌లో ఉండాలి).
  2. డ్రైవింగ్ లైసెన్స్: అభ్యర్థి లేదా కుటుంబ సభ్యుడికి చెల్లుబాటు అయ్యే ఆటో/లైట్ మోటార్ వాహన డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి.
  3. వాహన రిజిస్ట్రేషన్: వాహనం ఆంధ్రప్రదేశ్‌లో రిజిస్టర్ అయి ఉండాలి. ఆటోలకు ఈ సంవత్సరం ఫిట్‌నెస్ సర్టిఫికేట్ మినహాయింపు ఉంది.
  4. వాహన రకం: కేవలం ప్రయాణికుల వాహనాలు మాత్రమే అర్హులు. (సరుకు వాహనాలు అనర్హులు).
  5. ఆధార్ కార్డు తప్పనిసరి.
  6. బీపీఎల్ (Rice Card) కలిగి ఉండాలి.
  7. ప్రతి కుటుంబానికి ఒక వాహనం మాత్రమే అర్హం.
  8. GSWS Beneficiary Management Portal ద్వారా దరఖాస్తు చేయాలి.
  9. ఇతర occupational schemes లబ్ధిదారులు కాకూడదు.
  10. ప్రభుత్వ ఉద్యోగులు / పెన్షనర్లు కాకూడదు (శానిటరీ కార్మికుల కుటుంబం మినహాయింపు).
  11. ఆదాయ పన్ను చెల్లింపుదారులు కాకూడదు.
  12. కుటుంబం నెలసరి విద్యుత్ వినియోగం 300 యూనిట్లలోపు ఉండాలి (గత 12 నెలల సగటు).
  13. భూమి యాజమాన్యం: 3 ఎకరాల తడి, 10 ఎకరాల పొడి లేదా కలిపి 10 ఎకరాలకు మించి ఉండరాదు.
  14. పట్టణ ప్రాంతంలో 1000 sq.ft కంటే ఎక్కువ ఆస్తి ఉండరాదు.
  15. లీజ్ / రెంటు వాహనాలు అర్హం కావు.
  16. వాహనానికి ఎలాంటి పెండింగ్ బకాయిలు లేదా చలాన్లు ఉండరాదు.

Applicants applying under the AP Vahana Mitra Scheme 2025 must have valid driving license and vehicle registration in Andhra Pradesh

  1. సమీప గ్రామ / వార్డు సచివాలయం (GSWS) ను సంప్రదించాలి.
  2. GSWS Beneficiary Portal ద్వారా ఆన్‌లైన్ అప్లికేషన్ సమర్పించాలి.
  3. అవసరమైన పత్రాలు:
    • అప్లికేషన్
    • ఆధార్ కార్డు
    • రైస్ కార్డు.
    • ఆదాయ ద్రువీకరన పత్రం
    • కుల ధ్రువీకరన పత్రం
    • డ్రైవింగ్ లైసెన్స్.
    • వాహనం యొక్క రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్.
    • వెహికల్ ఫిటినెస్ .
    • వెహికల్ ఇన్సూరెన్స్.
    • లబ్ధిదారుని బ్యాంక్ పాస్ బుక్.
    • దరఖాస్తుదారునికి తప్పనిసరిగా NPCI లింక్ ఉండాలి
  4. అప్లికేషన్ ఆమోదం అయిన తరువాత, డైరెక్ట్‌గా లబ్ధిదారుడి బ్యాంక్ ఖాతాలో రూ.15,000 జమ అవుతుంది.
S.Noప్రశ్నసమాధానం
1ఉద్యోగి మొబైల్ అప్లికేషన్ (eKYC) లో పాత యజమాని పేరు కనబడుతోంది. వాహనం కొత్త యజమానికి బదిలీ అయ్యింది. eKYC పాత యజమాని వివరాలతో చేయాలా?లేదు. eKYC పాత యజమాని వివరాలతో చేయకూడదు. 31 ఆగస్టు 2025 తరువాత ownership transfer అయితే, eKYC లో “Vehicle SOLD” ఆప్షన్ ఎంచుకోవాలి. కొత్త యజమాని తన పేరుతో కొత్త అప్లికేషన్ సమర్పించాలి.
2పూర్వ లబ్ధిదారు మరణించినప్పుడు nominee కి బదిలీ అవుతుందా?లేదు. eKYC లో “Death” ఆప్షన్ ఉంది. కానీ వాహనం nominee పేరు మీదకు చట్టపరంగా బదిలీ అయిన తర్వాత మాత్రమే సాయం పొందగలరు.
3పాత వాహనం అమ్మేసి కొత్త వాహనం తీసుకున్నప్పుడు, కొత్త వాహనం వివరాలు ఎలా అప్‌డేట్ చేయాలి?కొత్త వాహనం వివరాలతో Secretariat లో కొత్త అప్లికేషన్ దాఖలు చేయాలి. అన్ని పత్రాలు eligibility క్రైటీరియా ప్రకారం సమర్పించాలి.
4కొత్త అప్లికేషన్ ఎక్కడి నుండి దాఖలు చేయాలి? (DA లేదా WEA ద్వారా?)గ్రామీణ ప్రాంతాల్లో Digital Assistant (DA) లాగిన్ ద్వారా, పట్టణ ప్రాంతాల్లో Ward Education & Data Processing Secretary లాగిన్ ద్వారా మాత్రమే దాఖలు చేయాలి.
52023 records ఆధారంగా, వాహన యాజమాన్యం మార్చలేదంటే మళ్లీ అప్లికేషన్ ఇవ్వాలా?Transport Dept. డేటా ప్రకారం, 31 ఆగస్టు 2025 వరకు ownership మార్చకపోతే కొత్త అప్లికేషన్ అవసరం లేదు. కానీ ownership మార్చితే కొత్త అప్లికేషన్ తప్పనిసరి.
6పత్రాలు కాలం చెల్లిపోయినప్పుడు (RC/Fitness/Insurance) వాటితోనే అప్లికేషన్ వేయచ్చా?లేదు. Welfare Assistants వాహనం, పత్రాలను ఫీల్డ్ లెవెల్‌లో verify చేస్తారు. RC, Fitness లేదా Insurance expired అయితే, కొత్త పత్రాలు submit చేయాలి. Expired documents తో అప్లికేషన్ process కాదు.
7ఈ పథకం కింద లబ్ధి పొందడానికి కుల/ఆదాయం సర్టిఫికెట్లు అవసరమా?లేదు. ఈ పథకం కోసం caste మరియు income certificates అవసరం లేదు.
8RC భార్య పేరు మీద, DL భర్త పేరు మీద ఉన్నా, ఇద్దరూ ఒకే Rice Card లో ఉంటే, Household mapping వేరు అయినా scheme అర్హత ఉందా?అవును. RC holder, DL holder ఒకే కుటుంబంలో immediate blood relatives (భర్త/భార్య/తల్లి/తండ్రి/కొడుకు/కూతురు/అన్న/చెల్లి) అయితే Household mapping వేరు ఉన్నా అర్హత ఉంటుంది.
9ఈ పథకం కింద electric vehicles eligibleనా?కేవలం 3-wheeler passenger battery autos మాత్రమే అర్హులు. e-rickshaws, e-karts వంటి non-passenger EVలు అర్హులు కావు.
10గత సంవత్సరం లబ్ధిదారుల Fitness/RC expire అయి ఉంటే, eKYC చేయాలా లేక pendingలో ఉంచాలా?ముందుగా పత్రాలను renew చేసి సమర్పించాలి. కొత్త valid documents లేకపోతే eKYC చేయరాదు. ఆవరకు కేసు pendingలో ఉంచాలి.
11కొన్ని ఆటోలు condemned స్థితిలో ఉన్నాయి, ఫిట్‌నెస్ లేదు. వీరికి గతంలో సాయం వచ్చింది. ఇప్పుడు renew కావాలంటే?Welfare Assistants ఫీల్డ్ లెవెల్‌లో verify చేస్తారు. operational & valid వాహనాలకే eligibility ఉంటుంది. Invalid autos “Not Recommended” గా reject అవుతాయి.
12పూర్వ ప్రభుత్వంలోని Rice Trucks (MDU Vehicles) ఈ పథకం కింద వస్తాయా?కాదు. Mobile Disbursement Vehicles (Rice Trucks) ఈ పథకం కింద అర్హులు కావు.
13డ్రైవింగ్ లైసెన్స్ ఇతర రాష్ట్రం (ఉదా: ఒడిశా) లో issue అయ్యి, address ఆంధ్రప్రదేశ్ కాకపోతే eligibility ఉందా?కాదు. DL India లో ఎక్కడి నుండి అయినా issue కావచ్చు, కానీ address ఆంధ్రప్రదేశ్ లో ఉండాలి. ఇతర రాష్ట్ర address ఉంటే అర్హత ఉండదు.
14DL తండ్రి పేరు మీద, RC కూతురు పేరు మీద ఉన్నా, పెళ్లి అయ్యి వేరు Household mapping లో ఉన్నా, eKYC చేయవచ్చా?అవును. వాహనం RC ఎవరి పేరు మీద ఉందో వారి పేరుతో eKYC చేయాలి. RC holder & DL holder father/daughter/son/mother వంటి immediate relatives అయితే Household mapping వేరు అయినా అర్హత ఉంటుంది.

Vahana Mitra Scheme Apply Online

AP Auto Driver 15000 Scheme

వాహన మిత్ర పథకం 2025

ఆటో డ్రైవర్ పథకం ఆంధ్రప్రదేశ్

AP Driver Financial Assistance

Vahana Mitra Eligibility & Application

వాహన మిత్ర పథకం అప్లికేషన్ ప్రాసెస్

Andhra Pradesh Auto Driver Scheme

Check All Schemes Eligibility and Status

Exit mobile version