Site icon SnehaJobs.com

AP ఉచిత కుట్టు మెషిన్ పథకం 2025 – అర్హతలు, దరఖాస్తు ప్రక్రియ & ప్రయోజనాలు

AP ఉచిత కుట్టు మెషిన్ పథకం 2025 – అర్హతలు, దరఖాస్తు ప్రక్రియ & ప్రయోజనాలు

ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం AP ఉచిత కుట్టు మెషిన్ పథకం 2025 ను ప్రారంభించింది. ఈ పథకం ద్వారా ఆర్థికంగా బలహీన వర్గాలకు చెందిన మహిళలకు ఉచిత కుట్టు మిషన్లు మరియు శిక్షణ అందించడం ద్వారా స్వయం ఉపాధి అవకాశాలు కల్పించడం లక్ష్యం.

ఈ పథకం కింద రాష్ట్రవ్యాప్తంగా 26 జిల్లాలు, 60 నియోజకవర్గాలు లో మొత్తం 1 లక్ష కుట్టు మిషన్లు పంపిణీ చేయనున్నారు. ప్రతి నియోజకవర్గానికి 3,000 మిషన్లు కేటాయించబడతాయి.

AP ఉచిత కుట్టు మెషిన్ పథకం 2025 – అర్హతలు

ఈ పథకం ప్రయోజనాలను పొందాలనుకునే మహిళలు కింది అర్హతలు కలిగి ఉండాలి:

మహిళలు మాత్రమే ఈ పథకానికి అర్హులు.

దరఖాస్తుదారులు ఆంధ్ర ప్రదేశ్‌ లో స్థిర నివాసం కలిగి ఉండాలి.

సరైన ఆధార్ కార్డు ఉండాలి.

కుల ధ్రువీకరణ పత్రం (కావాల్సిన వారికి) ఉండాలి.

వయస్సు: 20 నుండి 40 సంవత్సరాల మధ్య ఉండాలి.

ఆర్థిక పరిమితి:

గ్రామీణ ప్రాంతాల్లో వార్షిక ఆదాయం ₹1.5 లక్షలు మించరాదు.

పట్టణ ప్రాంతాల్లో వార్షిక ఆదాయం ₹2 లక్షలు మించరాదు.

వితంతువులు మరియు దివ్యాంగ మహిళలకు ప్రాధాన్యత ఇస్తారు.

శిక్షణ సమయంలో కనీసం 70% హాజరు తప్పనిసరి.

ప్రస్తుతం BC మరియు EWS కులాలకు చెందిన మహిళలు మాత్రమే అర్హులు.

హౌస్ మ్యాపింగ్ ద్వారా నివాస ప్రామాణికతను నిర్ధారించుకోవచ్చు.

AP ఉచిత కుట్టు మెషిన్ పథకం 2025 – దరఖాస్తు విధానం

ఈ పథకానికి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడానికి ఎటువంటి అవకాశం లేదు.
దరఖాస్తుదారులు గ్రామ/వార్డు సచివాలయం ద్వారా మాత్రమే దరఖాస్తు చేయాలి.

దరఖాస్తు చేయడానికి అవసరమైన పత్రాలు

దరఖాస్తుతో పాటు కింది పత్రాల జిరాక్స్‌లు సమర్పించాలి:

  1. ఆధార్ కార్డు
  2. ఆదాయ ధ్రువీకరణ పత్రం
  3. కుల ధ్రువీకరణ పత్రం (కావాల్సిన వారికి)
  4. రేషన్ కార్డు / రైస్ కార్డు
  5. పనిచేస్తున్న మొబైల్ నంబర్
  6. పాస్‌పోర్ట్ సైజు ఫోటో
  7. దరఖాస్తు ఫార

AP ఉచిత కుట్టు మిషిన్ పథకం 2025 ద్వారా మహిళలు స్వయం ఉపాధి అవకాశాలను పొందే అవకాశం ఉంది.
మీరు అర్హులైతే, మీ సమీప గ్రామ/వార్డు సచివాలయాన్ని సందర్శించి దరఖాస్తు చేసుకోండి.

ఇంకా మరిన్ని వివరాల కోసం మీ గ్రామ లేదా వార్డు సచివాలయాన్ని సంప్రదించండి.

Apply new pension

HH Mapping Compulsory for every citizen in AP

Exit mobile version