Site icon SnehaJobs.com

ఆరోగ్య శ్రీ హెల్త్ కార్డు

ఆరోగ్య శ్రీ హెల్త్ కార్డు

డా. వై.ఎస్.ఆర్  ఆరోగ్య శ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్

“డా. వై.ఎస్.ఆర్  ఆరోగ్య శ్రీ హెల్త్ కార్డు “ ను అందుకోనున్న ప్రతి కుటుంబానికి నమస్కరిస్తూ ,అభినందనలు తెలియజేస్తూ …..

మా నాన్నగారు దివంగత ముఖ్యమంత్రి గారైన శ్రీ డా.వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి గారు పేదలందరికి నాణ్యమైన వైధ్యం అందించటమే లక్ష్యంతో 2007 లో ప్రారంభించిన ఈ ఆరోగ్య శ్రీ ఎంతో మంది పేదవారికి సకాలంలో వైద్యం అందించి వారి ప్రాణాలను కాపాడటంతో పాటు అనారోగ్య కారణంగా ఆసుపత్రులలో ఖరీదైన వైద్యం కోసం ఉన్నదంతా పోగొట్టుకోకుండా నిరుపేదలను ఆదుకుంటూ యావత్ భారత దేశానికి ఆదర్శప్రాయంగా నిలిచింది.

ఈ పధకాన్ని ప్రజలకు మరింత చేరువ చేస్తూ మరిన్ని సేవలు అందించాలనే లక్ష్యంతో మానిఫెస్టోలోని నవరత్నాలలో నేను మాట ఇచ్చిన ప్రకారంగా ఆరోగ్య శ్రీ లో హామీలన్నిటిని అమలు చేసే దిశగా ఈ ఆరోగ్య హెల్త్ కార్డును మీకు అందించడం నాకు ఎంతో సంతోషాన్నిస్తోంది.ఈ హెల్త్ కార్డు 10 సంవత్సరాలైన భద్రంగా ఉండేలా రూపొందించటమే కాకుండా ఇందులో పొందుపరచినక్యూ ఆర్ ( QR) కోడ్ సాయంతో ఆరోగ్య శ్రీ మొబైల్ ఆప్ (Mobile App) ద్వారా మీ కుటుంబం యొక్క పూర్తి హెల్త్ రికార్డును మరియు ఆరోగ్య శ్రీ ద్వారా మీరు పొందిన సేవలను, మీ రిపోర్టులను ఎప్పుడైనా , ఎక్కడైనా చూసుకునే విధంగా ఈ హెల్త్ కార్డును రూపొందించటం జరిగింది.

ఈ హెల్త్ కార్డు ద్వారా మీ కుటుంబంలో ఉన్న వారందరికీ సంవత్సరానికి రూ. 5 లక్షల వరకు వైద్యం , కాన్సర్   వ్యాధిగ్రస్తులకు మరియు పుట్టుకతో చెవుడు ఉన్న చిన్నారులకు రూ. 5 లక్షలకు మించి కూడా వైద్యం అందించబడుతుంది. ఈ కార్డు ద్వారా 2059 చికిత్సలకు పధకం క్రింద నమోదు అయిన ఆసుపత్రులలో ఉచితంగా వైద్యం చేసుకునే సదుపాయం ఉంది. అంతే కాకుండా దేశంలోనే మరెక్కడా లేనటువంటి విధంగా , ఆసుపత్రి నుండి వైద్యం చేయించుకుని డిశ్చార్జ్ అయిన తరువాత , ఆ విశ్రాంత సమయంలో మీ జీవనాధారం కోసం మీరు కోలుకునే సమయంలో రోజుకు రూ.225/- చొప్పున గరిష్టంగా నెలకు రూ.5,000/- వరకు, ఈ విధంగా అవసరమైన మేరకు ఈ భృతి నేరుగా మీ ఖాతాలలో జమ చేయబడుతుంది. ఈ ఆరోగ్య శ్రీ కార్డు ద్వారా మన పొరుగు రాష్ట్రాలలోని మహా నగరాలైన హైదరాబాద్ , చెన్నై, బెంగుళూరులోని సుమారు 130 కీ పైగా ఆసుపత్రులలో కూడా మీకు ఆరోగ్య సేవలందచేసే విధంగా అన్నీ చర్యలు తీసుకున్నాం.

ఇన్ని ఆరోగ్య సదుపాయాలు అందచేసే ఈ కార్డును అందుకుంటున్నమీకు మరొక్కసారి నా హృదయపూర్వక అభినందనలను తెలియజేస్తూ …..

 

                                                                                                                                                                                           మీ

                                                                                                                                                                         వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి

                                                                                                                                                                         ముఖ్యమంత్రి , ఆంధ్రప్రదేశ్

Exit mobile version