Site icon SnehaJobs.com

జగనన్న అమ్మ వొడి

జగనన్న అమ్మ వొడి

  1. పథకానికి సంబంధించిన వివరాలు:

దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న కుటుంబాలలో 1 నుండి XII (ఇంటర్మీడియట్) వరకు చదువుతున్న పిల్లలున్న తల్లులు లేదా పిల్లల సంరక్షకులకు (తల్లి లేనిచో) కుల, మత, ప్రాంతాలతో సంబంధం లేకుండా పిల్లలను రెసిడెన్షియల్ స్కూళ్ళు/ కాలేజీలు, గుర్తింపు పొందిన ప్రభుత్వ మరియు ప్రైవేటు పాఠశాలలు/జూనియర్ కాలేజీలలో చదివించడానికి వీలుగా ఆర్ధిక సహాయం అందించడం ఈ పథకం యొక్క లక్ష్యం.

వ.నెం.ప్రమాణంనిబంధనలు
 1మొత్తం కుటుంబ ఆదాయంగ్రామీణ ప్రాంతాలు –నెలకు రూ. 10,000/-ల లోపుపట్టణ ప్రాంతాలు –నెలకు రూ. 12,000/-ల లోపు ఉండాలి.  
 2మొత్తం కుటుంబానికి గల భూమి3ఏకరాలు కంటే తక్కువ మాగాణి లేదా 10ఏకరాలు కంటే తక్కువ మెట్ట లేదా రెండూ కలిపి గరిష్టంగా10ఏకరాలులోపు ఉన్న కుటుంబంలోని వారు మాత్రమే అర్హులు
 3తల్లి లేదా లబ్ధిదారు కలిగి ఉండాల్సిన ధృవపత్రాలుతల్లి లేదా లబ్ధిదారు తెల్ల రేషన్ కార్డు మరియు ప్రభుత్వం జారీ చేసిన చెల్లుబాటయ్యే ఆధార్ కార్డు కలిగి ఉండాలి.
 4ప్రభుత్వ ఉద్యోగి/ ఫించనుదారుకుటుంబంలోని ఏ వ్యక్తి ప్రభుత్వ ఉద్యోగి లేదా ఫించనుదారు అయి ఉండరాదు. ఈ షరతు నుండి పారిశుద్ధ్య పనివారి కుటుంబాలు మినహాయించబడినవి.
 5నాలుగు చక్రాల వాహనంలబ్ధిదారు కుటుంబం నాలుగు చక్రాల వాహనం కలిగి ఉండకూడదు. (టాక్సీలు, ట్రాక్టర్లు, ఆటోలు ఈ షరతు నుండి మినహాయించబడినవి).
 6విద్యుత్ వినియోగంగడచిన 12 నెలలలో కుటుంబం యొక్క విద్యుత్తు వినియోగం  నెలకు సరాసరి 300 యూనిట్లు మించరాదు.
 7ఆదాయపు పన్నుఆదాయపు పన్ను చెల్లిస్తున్నవారు ఈ పథకానికి అనర్హులు  
 8పట్టణాల్లో ఆస్తిమున్సిపాలిటీ పరిధిలో 1000 చ.అల కంటే తక్కువ స్థలం ఉన్నవారు అర్హులు. (పట్టణ ప్రాంతాలకు మాత్రమే వర్తిస్తుంది)  
 9వయస్సు& లింగంఈ షరతు వర్తించదు  
 10పుట్టిన తేదీ ధృవీకరణపత్రంఆధార్ కార్డు /సమీకృత ధృవీకరణపత్రం  
 11బ్యాంకు ఖాతా వివరాలుతల్లి/లబ్ధిదారు యొక్క గుర్తించబడిన గార్డియన్ యొక్క బ్యాంకు ఖాతా, ఆధార్ తో అనుసంధానించబడి ఉపయోగంలో ఉండి ఉండాలి.
 12హాజరువిద్యార్థులు 75% హాజరు ఉండేలా చూసుకోవాలి.

గమనిక :కుటుంబంలోఎంతమందిపిల్లలుఉన్నాఒకరికిమాత్రమే పధకంవర్తిస్తుంది.

సంబంధిత పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు (హెడ్ మాస్టర్)/ ఇంటర్ కాలేజీ ప్రిన్సిపాల్

వ.నెంవివరణఉత్తర్వుల నెం.
1.జగనన్న అమ్మవొడి పథకం ప్రభుత్వ ఉత్తర్వులుజి.ఓ.ఎం.ఎస్.నెం. 79, తేదీ: 04-11-2019

#సాంకేతిక సమస్యలకు సంప్రదించవలసిన వారు

లబ్ధిదారులు లేదా పౌరులు సంప్రదించవలసిన నెంబర్లు:9705655349, 9705454869
ఈ మెయిల్: apcse.@ap.gov.in

Check your Eligibility Status Here

CLICK HERE FOR MORE UPDATES

Exit mobile version