YSR Raithubharosa

YSR Raithu Bharosa – PM Kisan

వై యస్ ఆర్ రైతు భరోసా – పి ఏం కిసాన్ 

సాగు సమయంలో రైతు ల ఆర్ధిక సమస్యలను తగ్గించి అధిక ఉత్పత్తి సాదించుటకై ఏటా రూ. 13500/- పెట్టుబడి సహాయం ఐదు సంవత్సరాలలో మొత్తం పెట్టుబడి సహాయం రూ. 67500/-

వై యస్ ఆర్ రైతు భరోసా – పి ఏం కిసాన్ Payment Status

అర్హతలు 

 • వెబ్ ల్యాండ్ డేటా ఆధారంగా భూమి పరిమాణంతో సంబంధం లేకుండా రైతుల గుర్తింపు.
 • ఆర్ ఓ ఎఫ్ ఆర్ మరియు డి పట్టా భూములను ( సంబందిత రికార్డు లో నమోదు ఐనా వాటిని ) సాగు చేయుచున్న రైతు కుటుంబాలు.
 • పరిహారం చెల్లించకుండా స్వదీనమ్ చేసుకున్న భూములను సాగు చేస్తున్న రైతులు. ఎస్సీ ,ఎస్టీ, బీసీ , మైనారిటీకి చెందిన సొంత భూమి లేని సాగుదారులు, వ్యవసాయ, ఉద్యానవన మరియు పట్టు పరిశ్రమ పంటలను కనీసం ఒక ఎకరం, పువ్వులు మరియు పశుగ్రాస పంటలు కనీసం 0.5 ఎకరం లేదా 0.1 ఎకరం తమలపాకులు సాగు చేయుచున్నచో అట్టి సాగు దారులు అర్హులు.
 • ఒక భూ యజమానికి ఒకరికన్నా ఎక్కువ మండి కౌలు రైతులు ఉంటే , అందులో మొదటి ప్రాధాన్యత షెడ్యూల్డు తెగకు చెందిన రైతులకు ఇవ్వబడుతుంది. తరువాత ప్రాధాన్యత క్రమం లో షెడ్యూల్డు కులం, వెనుకబడిన మరియు మైనారిటీ తరగతికి చెందినవారు ఉంటే వారికి ఇవ్వబడుతుంది.
 • గిరిజన ప్రాంతాలలో , గిరిజన చట్టాలు ఆధారంగా గిరిజన సాగుదారుల ను మాత్రమే గుర్తించటం జరుగుతుంది.
 • ఒకే ఊరిలో ఉన్న సన్న కారు రైతు మరియు భూమి లేని సాగుదారుల మధ్య గా కౌలు ఒప్పందం చెల్లదు.
 • దేవాదాయ  శాఖ నమోదుల ఆధారంగా దేవాదాయ భూములను సాగు చేస్తున్న సాగుదారులు లబ్ధిని పొందడానికి అర్హులు.
 • రైతు కుటుంబంలో పెళ్లికాని ప్రభుత్వ ఉద్యోగులు లేదా ఆదాయ పన్ను చెల్లించేవారు ఉన్నకుడా సంబందిత రైతు మినహాయింపు వర్గంలో లేకపోతే అతను వై యస్ ఆర్ రైతు భరోసాకి అర్హుడు.

జాబితాలో పేరు లేని వారు దరఖాస్తు చేసుకునే విధానము 

 • పట్టాదారు పాస్ బుక్కు ఆధారముగా అర్హులైన భూమి గల రైతులను గుర్తించటం జరుగుతుంది.
 • భూమి లేని సాగుదారులను పంట సాగుదారుల హక్కు పత్రం ఆధారంగా గుర్తించటం జరుగుతుంది
 • ఇతర వివరాలను స్వయంగా రైతు భరోసా కేంద్రాలలో కానీ గ్రామ/ వార్డు సచివాలయం లో  సంప్రదించవలేను.
 • అర్హులైన ధరఖాస్తు దారునికి YSR ( Your Service Request – మీ సేవల అభ్యర్ధన ) నెంబరు ఇవ్వబడుతుంది.
Updated: August 9, 2021 — 3:47 pm

Leave a Reply

Snehajobs.com © 2019 All Rights Reserved