ఓటరు నమోదు

How to apply Voter id || How to search your name in voter list || Download voter list PDF

మీకు జనవరి 1, 2021 నాటికి 18 సం|| నిండినా లేదా నిండుతున్నట్లైతే డిసెంబరు 15 లోగా ఓటరు నమోదు కండి .

కొత్తగా ఓటరు ధరఖాస్తు చేసుకొనుటకు అర్హతలు 

1. భారత పౌరులు ఐ ఉండాలి

2. జనవరి 1, 2021 నాటికి 18 సం|| ల వయసున్నవారు లేదా నిండుతున్నవారు అర్హులు

3. ఓటరుగా నమోదు చేసుకున్న ప్రాంతం లో నివాసి ఐ ఉండాలి

కొత్తగా ఓటరు ధరఖాస్తు ఎలా  చేసుకోవాలి How to apply new voter id  Off line

ఈ‌ఆర్‌ఓ , బి‌ఎల్‌ఓ ల వద్ద అన్నీ రకాల ధరకాస్తు ఫారాలు లభిస్తాయి . లేదా www.eci.nic.in వెబ్ సైట్ నుండి ఫారాలు డౌన్లోడ్ చేసుకోవచ్చు . సంబందిత ఫారాన్ని నింపి , ఫోటో అతికించి వయస్సు , చిరునామా ధృవీకరణ పత్రాలు జతచేసి ధరఖాస్తు చేసుకోవచ్చును. లేదా ఓటరు నమోదు కేంద్రం లో కూడా ధరఖాస్తు సమర్పించవచ్చు .

కొత్తగా ఓటరు ధరఖాస్తు ఎలా చేసుకోవాలి How to apply new voter id  Online

నేషనల్ ఓటర్స్ సర్విస్ పోర్టల్ ( NVSP ) www.nvsp.in విజిట్ చేయండి . సంబందిత బటన్ క్లిక్ చేయండి , ఫారం 6 లో మీ పేరు  చిరునామా వివరాలు ఫారం లో పొందు పరచిన మీ ఫోటో , వయస్సు , నివాస ధృవ పత్రాలను కూడా అప్లోడ్ చేయండి.

ఓటర్ల జాబితాలోని మీకు సంబందించిన వివరాల సవరణ కొరకు ,ఒకే నియోజక వర్గంలోని ఒక పోలింగ్ కేంద్రం నుండి మరొక పోలింగ్ కేంద్రానికి చిరునామా మార్పు కొరకు సంబందిత ఫారం ని నింపి ధరఖాస్తు చేయండి .

ఓటర్ల నమోదు ప్రక్రియలో ఏ ఫారం ఎందుకు ఉపయోగిస్తారు 

ఫారం 6 : కొత్తగా పేరు నమోదు చేసుకోడానికి , ఒక శాసన సభ నియోజక వర్గం నుండి వేరే శాసన సభ నియోజక వర్గానికి చిరునామా మార్చుకోడానికి ఉపయోగించాలి .

ఫారం 6 ఎ : భారతీయ పాస్ పోర్ట్ కలిగిన విదేశాలలోని భారతీయులకోసం ఉపయోగించాలి .

ఫారం 7 : ఓటర్ల జాబితాలో ప్రస్తుతం ఉన్న పేరును తొలగించడానికి , లేదా ఓటర్ల జాబితాలో పేరు చేర్చడానికి వ్యతిరేకంగా అభ్యంతరం తెలపడానికి ఉపయోగించాలి  .

ఫారం 8 : ఓటర్ల జాబితాలో ఎంట్రీలలో మార్పులు / దిద్దుబాట్లు కోసం ఉపయోగించాలి .

ఫారం 8 ఎ : అదే శాసన సభ నియోజక వర్గం పరిధి లో చిరునామా మార్పు బదిలీ కోసం ఉపయోగించాలి .

Search your name in voter list 

Search you name through SMS

Search for PDF electoral Rolls

Enroll your name 

మరింత సమాచారం మరియు సహాయం కోసం టోల్ ఫ్రీ నంబరుకు డయల్ చేయండి 1950

 

 

Updated: November 29, 2020 — 1:00 pm
SnehaJobs.com © 2022 All Rights Reserved
You cannot copy content of this page